మోడీ గారి వ్యతిరేకులంతా "వైవస్వత మన్వంతర " కాలంలో ఉంటె , మోడి గారేమో "సూర్య సావర్ణిక మన్వంతర " కాలం లో ఉన్నారు. !!!

                                                                                 

             
                     ఈ  దేశం లో ఒకప్పుడు అణగారిన వర్గాల తరపున ఉద్యమాలు నడిపి , వారిలో  గొప్ప ఆశ లు రేకెత్తించి , వారికి ఆశాజ్యోతి గా వెలుగొందుతుంది అని బావించిన "కమ్మ్యూనిస్ట్ పార్టి " లు చివరకు విశ్వ విద్యాలయాల్లో కొంతమంది  విద్యార్దులు నిర్వహించే  "ముద్దులు" ఉద్యమానికి,  "అప్జల్ " ఉద్యమానికి సపోర్ట్ చేసి తమ స్తాయిని తామే దిగజార్చుకుంటున్నాయి .  పరిణామ క్రమం సిద్దాంతం అనేది కేవలం జీవ జాలానికే కాదు , బావజాలాలకు వర్తిస్తుందని , భారత దేశం లోని కమ్యూనిస్ట్  పార్టిల  చరిత్ర రుజువు చేస్తుంది. అంతరించి పోతున్న జీవజాలం వలెనే "అంతరించిపోతున్న బావజాలం " అనేది కూడా పరిణామ క్రమం లో బాగం గా ఉంటుంది అని అనిపిస్తుంది .  అంతరించి పోయే జీవజాలాన్ని  కాపాడుకోవడానికి ప్రభుత్వాలు అక్కడక్కడా సదరు జీవ జాల సంరక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసి వాటి అభివృద్దికి క్రుషి చేస్తున్నాయి. అలాగే అంతరించి పోతున్న బావాజాలలను కాపాడుకోవటానికి , వాటిని అంతో ఇంతో అభివృద్ధి చేయడానికి ఈ  దేశం లో కొన్ని సంరక్షణా కేంద్రాలు లాంటివి  ఉన్నాయి. అవే "విశ్వవిద్యాలయాలు" .

      మరి అంతరింఛి పోయే జీవ జాలం ని అభివృద్ధి చేయాలంటే వాటికి అనువైన పరిస్తితులు కల్పించి , అవి తినే ఆహారాన్ని అందిస్తూ ఉండాలి. అవి బయట ప్రపంచం లో దొరకవు  కాబట్టి ,ప్రత్యేకంగా వాటిని తయారు చేసి అందించాలి . అలాగే అంతరించి పోతున్నకొన్ని  బావజాలాల అభివృద్దికి తగిన విప్లవ  , సాంస్కృతిక పరిస్తితులు దేశం లో లేవు  కాబట్టి , విశ్వవిద్యాలయాల గ్రందాలయాల్లొ ఉండే పుస్తకాల్లోనె అవి నిక్షిప్తం అయ్యాయి కాబట్టి, అవే అంతరించి పోతున్న బావ  జాలాలకు ఆలంబనగా నిలుస్తున్నాయి.  చరిత్రను అద్యయనం చేయడం  లోతప్పు లేదు. చేయాలి కూడా. కాని మారుతున్న సమకాలీన సమాజ పరిస్తితులను ,గ్రహించకుండా , ఎప్పటి సమాజమో ఇప్పటికీ అలాగే ఉంది అనే కబోది కబుర్లు చెపుతూ , అందుకు అనుగుణంగా ఉన్న, తమ కాలం చెల్లిన  బావజాలాలను  సమర్దించుకుంటు ,ఎప్పటి చెడునో ఇప్పుడూ విమర్సించుకుంటూ  పోతే , ప్రజలు వారు చెప్పే దానికి విలువ ఇవ్వరు సరి కదా వారిని అంతరించి పోతున్న బావజాలికుల లిస్ట్ లో చేర్చి జాలి చూపుతారు.

     ఉదాహరణకు మొన్న JNU లో సో కాల్డ్ మేదావి అయిన కన్నయ్య ఇచ్చిన ప్రసంగాన్ని కొంత  మంది లెప్టిస్ట్  , బుద్దిస్ట్ లు చాలా ఉత్తేజిత పూరిత ప్రసంగం అని , అది ఆయనలోని మేదో శక్తికే కాక ప్రస్తుత సమాజం లోని పరిస్తితులకు అద్దం పడుతుందని తెగ పొగిడారు. కన్నయ్య అంటే కృష్ణుడు కు ఉన్న మరో పేరు  కాబట్టి ఈ  కన్నయ్య వారికి "దళిత గోవిందుడు " లాగాను , అతడు చేసిన  ప్రసంగం "దళిత గీత" లాగాను అనిపించవచ్చు. కాని భారత దేశం లోని మెజార్తీ ప్రజలు అతగాడు చెప్పే కబోది కబుర్లను నమ్ముతారా? ఎందుకు నమ్మరో  చూద్ద్దాం .

              కన్నయ్య చెప్పిన "మనుస్మృతి " ఈ  దేశం లోని పూజారులే పాటించడం లేదు. ఇక సామాన్య జనం ఎవరు పాటిస్తునారు. ? ఎందుకంటె మనుస్మృతి ప్రకారం, డబ్బులు తీసుకుని దైవ సేవలు చెస్తే మరుజన్మలో కుక్కలుగా పుడతారట. మరి దీనిని పాటిస్తే జీతభత్యాలు తీసుకుని గుళ్ళలో పూజలు చేసే పూజారులు పని చేయగలరా? అలాగే చాలా ఉన్నాయి. వైవస్వత మన్వంతరం లో చెప్పబడింది అని చెప్పబడుతున్న , నేటి కాలం లో లభిస్తున్న మనుస్మృతిలో నేటి సమాజం  లో తమ మనుగడకు   అనువైనవి కొద్ది శాతం మాత్రమే కాబట్టి , వాటిని మాత్రమే పాటిస్తూ  మిగతావన్నీప్రజలు ఎప్పుడొ  త్యజించారు. ప్రస్తుతం మనకు ఉన్నది  ఎప్పటి మనువో రాసిన మనుస్మృతి కాదు , అభినవ మనువు అంబేద్కర్ గారి అద్వర్యం లో రాయబడిన భారత రాజ్యంగం. దాని ప్రకారమే మొన్న కన్నయ్య అతని  సహవిద్యార్డుల మీద కేసులు పెట్టింది. ఒక వేళ  మనుస్మృతి ప్రకారం అయితే ఏమయి ఉండేదో , మన  కంటె నిరంతరం మనుస్మృతి జపం  చేస్తున్న వారికే బాగా తెలుసు. కాబట్టి ఇలాంటి కాలం చెల్లిన వాదాలను పట్టుకుని వేలాడితే అవే ఉరి తాళ్ళు అయ్యే ప్రమాదముంది.

                                                                   

     


                             మనుస్మృతి అనేది బైబిల్ , ఖురాన్ గ్రందాలు లాగా మార్చడానికి ఎన్నటికీ వీలు లేని పవిత్ర గ్రంధం అని చెప్పబడలేదు. ఒక వేళ  అదే నిజమయితే  ఏసుక్రీస్తు లాగా , మహ్మద్ ప్రవక్త లాగా ఒకరే మనువు ఉంటాడు అని చెప్పే వారు. పురాణాల ప్రకారం హిందువులకు 14 మంది మనువులు ఉంటారని , మారుతున్న సమాజ పరిస్తితులకు అనుగుణంగా ఆయా సమయాలలో మనువులు అవతరిస్తారని , అలా అవతరించిన వారు అప్పటి దాక ఉన్న మనుస్మ్రుతుల లోని లోపాలని సవరించి , సమకాలీన సమాజానికి అనువైన విదంగా నూతన మనుస్మృతిని ఆవిష్కరింప చేస్తారు అని, అలా 14 మంది మనువుల కాల చక్రం పూర్తి అయ్యాక తిరిగి మొదటి మనువుతో కాలం పునరావృతం అవుతుందని చెప్పారు. కాబట్టి హిందూ రుషులు చెప్పిన దాని ప్రకారం కూడా ఏ మనుస్మృతి శాశ్వత ఆచరణియ యోగ్యమైనది  కాదు. వాటికి మార్పులు చేయాల్సిందే . అలా చేసే వారే మనువులు అని రుషులు చెప్పకనే చెప్పారు .

      ఈ  దేశం  లో కమ్యూ నిస్ట్  లు,  ఇక్కడి ప్రజల జీవన విదానం  వారి సాంప్రదాయ ఆచార వ్యవహారాలకు విలువ నివ్వకుండా , అదంతా ఒట్టి చెత్త అని , తాము నమ్మిన "మార్క్సిజమే "  సర్వరోగ నివారిణి అని  నమ్మి, దానిని ప్రజలలో వ్యాప్తి చేయాలి అంటె ఇక్కడి సంస్కృతిని నాశనమ్ చేయాలని సంకల్పించి , దానికి అనుగుణంగా  అంటె వారి బావజాల వ్యాప్తి కోసం స్వదేశి ఆచార సాంప్రదాయాలకు వ్యతిరేకంగా పనిచెసే అన్ని రకాల శక్తులతొ చేతులు కలిపారు. తాము పక్కా నాస్తికులమని, దైవ బావన  అంటె అజ్ణానమ్ అని వాదించే వీరు, అన్యమతాల బావనల పట్ల మాత్రం ఉదారత బావం చూపి హిందూ సంస్క్రుతి ద్వంసానికి పరొక్షంగా సహయపడుతున్నారు. దిని వలన అంతిమంగా నష్టపోయింది వీరే.ఉదాహరణకు  దళితులకు దేవాలయ ప్రవేశం కల్పించాలి అని అన్న గాందేయ వాదం ముందు , అసలు దేవుడే లేదన్న వీరి కమ్మునిస్ట్ వాదం  ఓడిపోయింది. సంస్కరణ అనేది స్వదేశి గుండెల్లో నుండి రావాలి తప్పా, వీదేశి బావాలనుండి కాదు అనే చిన్న లాజిక్ ను కమ్మునిస్ట్ లు మరచిపోవడం చేత అంతరించిపోతున్న  బావజాలాల్లో వారిది ఒకటి అయింది.

   . సిద్దాంత పరంగా వీరికి బౌద్దమతావలంబికులకు  పొసగకపోయినా కేవలమ్ హిందూ వ్యతిరేకత తోనే వీరూ ఏకమయ్యారు. ఈ దేశం  లో ఒకప్పుడు ఉచ్చ దశ లో ఉన్న బౌద్దమ్ ఇప్పుడు అంతర్దాన దశలో ఉండడానికి కారణమ్ అందులో కూడా  ఆచరణకు సాద్యం కాని జీవన విదాన సూత్రాలు ఉండడమే. ఏదో ఇండియాలో టూరిజమ్ అభివ్రుద్దికి , మైనార్తీ హోదా కోసం పనికి వచ్చేదిగా తప్పా సామాన్య ప్రజలను   అంతగా ప్రభావమ్ చూపలేక అంతరించి పోతున్న బావాజాలాల్లో అదీ ఒకటిగా మారి పోతుంది.

   మార్కిసమ్ అయినా, బుద్దిజం అయినా అయా కాలగమన పరిస్తుతులకు అనుగుణంగా చెప్పబడిన సిద్దాంతాలు  తప్పా అవేవి శాశ్వత  సత్యాలు కావు. మారుతున్న కాలమ్ కి అనుగుణంగా సమాజాలలో ఏర్పడె పరిస్తితులకు అనుగుణంగా మన జీవన విదానం ఉండాలని హిందూ రుషులు గుర్తించడమ్ చేతనే 14 మంది  మనువులతో కూడిన ఒక మను ధర్మాచరణ వ్యవస్త ఉంటుంది అని చెప్పారు. ఒక మన్వంతరమ్ లో ఉన్న ధర్మమ్ మరొక మన్వంతరానికి పనికి రాదని బావించడం చేతనే ప్రతి మన్వంతరానికి ఒక మనువు ని నిర్దేసించి ఆయన చెప్పిన ధర్మాచరణమ్,  ఆయన పేరు మీద నడిచే కాలమంతా  ఉంటుందని చెప్పారు. ఇప్పటివరకు నడచినవి 7 మన్వంతరాలు.  . హిందూ పండితులు ప్రకారం ఇప్పుడు నడుస్తున్నది వైవస్వత మన్వంతరం. కమ్మునిస్ట్ లు, బౌద్దులు విమర్సిసిస్తున్న మనుస్మ్రుతి వైవస్వత మన్వంతరం కి చెందిందే. కాని నాకున్న కాలజ్ణానమ్ ప్రకారం వైవస్వత మన్వంతరం గడువు ముగిసింది . ప్రస్తుతం సంది దశ నడుస్తుంది. మన సమాజం లో జరుగుతున్న అనేక మార్పులను పరిశిలిస్తుంటె 8 వ మన్వంతరం అయిన సూర్య సావర్నిక మన్వంతరమ్ ప్రారంబం అయిందని అనిపిస్తుంది.

                                                                     

 
                                        మన దేశం  లో సౌరమండలంగా గుర్తించబడిన "సౌరాష్త్ర" ప్రాంతం నుండి, ఒక్క సారిగా అన్ని అడ్డంకుల మబ్బులను దాటుకుని వచ్చిన "నరెంద్ర మోడి " అనే వ్యక్తి సూర్య కిరణములు వంటి తనలోని చైతన్యం తో హిందూ సంస్క్రుతి అనే పద్మమ్ ని వికసింపచేయడమ్, తద్వారా భారతీయ యువత ఇప్పటివరకు ఉన్న విదేశి ప్రేరేపిత పిడివాదాలను తిరస్కరించి,సంస్కరణాత్మకమైన స్వదేశి ధర్మాచరణ వైపు మక్కువ చూపిస్తూ  ఉండడమ్ , ఇవ్వన్నీ చూస్తుంటె "సూర్య సావర్నిక మన్వంతరం" మొదలు అయిందనే అనిపిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా "సౌర శక్తి" తో ప్రజల జీవన మనుగడ అభివ్రుద్ది దాయకం అవుతుండడమ్ కూడా ఇప్పుడు నడుస్తుంది సూర్య సావర్నిక మన్వంతరమ్ అని నమ్మాల్సి వస్తుంది  .హిందూ పురాణాలలో ఇంకొక ఆసక్తికరమైన అంశం కూడా  ఉంది . బలి చక్రవర్తి  ని భగవానుడైన విష్ణు మూర్తి  వామన రూపం లో పాతాళానికి తొక్కివేసినప్పుడు , బలి చక్రవర్తి ధర్మ నిరతిని ద్రుష్టిలో ఉంచుకుని ఆయనకొక వరం ఇస్తాడు. రాబోయే మన్వంతర కాలం లో బలి చక్రవర్తి ఇంద్ర పదవిని అలంకరిస్తాడు అని , దానితో భారత దేశం సర్వ సౌబాగ్యాలతో తుల తూగుతుందని. ఇది బలి చక్రవర్తిని తమ వాడిగా చెప్పుకుంటున్న శూద్రులకు సంతోషం కలిగించే మాటయే కదా. మరి ఆ వర ప్రబావమో ఏమో కాని భారత దేశం లో సంకర జాతి కి చెందిన నాయకుల నాయకత్వం పోయి , నిష్టా గరిష్టుడు అయిన ఒక శూద్రుని పాలన లోకి భారత దేశం రావడం .  దీనిని శూద్ర బావజాలం మాది , మేము శూద్రులమ్ అని చెప్పుకుంటున్న వారంతా ఆహ్వానించాలి . కాని అలా కాకుండా ఇప్పటి వరకు ఈదేశం లో జరిగిన అన్ని అరాచకాలకు , ఆకృత్యాలకు, అమానవీయ చర్యలకు, నిరకుశత్వానికి  ఏ సంకర జాతి పాలకులు కారకులో , ఎవరి దన్ను వలన ఇన్నాళ్ళు వారి పాలనలో ఈ  దేశం జరగాల్సినంత అభివృద్ధి జరుగకుండా పోయిందో , వారి సప్పోర్ట్ తోనే కుల , మత రాజకీయాలు చేసుకుంటూ , హిందూ జీవన విదానం ని తప్పు పడుతూ , విదేశి శక్తులను కీర్తిస్తూ ఉంటె ఇక ఈ  దేశం లోని యువత మీరు చెప్పే కల్ల  బొల్లి మాటలను నమ్ముతూ మిమ్మల్ని మేదావులు అని అనుకోవాలా?

          సరే ఏది ఏమైనా వైవస్వత మనువు కాలం నాటి మనుస్మ్రుతిని ఇప్పుడు మనం పాటించటం లేదు. మనుస్మ్రుతి స్మరణ  కమ్మునిస్ట్ లు, బుద్దిస్త్ లు తప్పా ఎవరూ చేయటం లేదు. తప్పు ఒప్పులు అనేవి అన్ని సమాజాలలో ఉంటాయి. ఇప్పుడు జరుగుతున్న తప్పులకు ఎప్పటి మనువాదాన్నో తప్పు పట్టడమ్ కంటె స్వాతంత్ర్యనంతర కాలం లో కుహానా సెక్యులర్ ప్రభుత్వాలు అనుసరించిన విదానాలే అనడం సబబుగా ఉంటుంది . అంతే తప్పా, నిన్న కాక మొన్న వచ్చిన  మోడి గారి ప్రభుత్వం కాదు అనేది నిర్వివాదాంశం.తన ప్రసంగం లో కన్నయ్య విమర్సించింది, కాలం చెల్లిన "మనుస్మ్రుతిని అడ్డం పెట్టుకుని దేశాన్ని అభిరుది పదం లో నడిపిస్తున్న అపర సూర్యుడు అయిన మోడి గారిని  అయన చేస్తున్న కార్యక్రమాలను మాత్రమే కాక, భారతదేశాన్ని కూడా నిందిస్తూ , పార్లమెంట్ మీద దాడి చేసిన వారిని కీర్తిస్తూ ఉపన్యాసాలు ఇస్తుంటే . దానిని మేదావి తనం అనుకోవడం మేదో నైరాశ్యమ్. వీరి గురించి భారతీయులు పట్టించుకోవడమ్, వారి హిందూ విద్వేష పూరిత ఉపన్యాసాలకు విలువనివ్వడం దండగ.  వీరికి ఉన్నది ఒకటే సిద్దాంతం . విదేశి శక్తులు పంపే పండ్స్ తో ఏవో కొన్ని సంస్తలు స్తాపించి , ఎప్పుడో వాళ్ళ తాతలు చవి చూసిన "కుల దాష్టికాన్ని ",  ఇప్పుడు విమర్శిస్తూ , లేని మనుస్మృతి ప్రబావాన్ని బండ భూతులు తిడుతూ , పెద్ద భూచి  గా చూపిస్తూ , తమకు పండ్స్ ఇస్తున్న విదేశి మత జాలికులను  , బావజాలికులను సంతృప్తి పరుస్తూ  జీవిస్తూ ఉండడమే వీరిపని . ఇలాంటి నిర్బాగ్య   తనానికి మేదావి తనం అంటగట్టి ప్రచారాలు చేసుకోవడం  వారికే చెల్లు .

    కాబట్టి ఇక్కడ మనం గ్రహించాల్సింది ఒకటే . భారతదేశం ,మోడి గారి నాయకత్వాన  అభివృద్ధి పదాన ప్రపంచ దేశాలతో పోటిపడుతూ ముందుకు సాగుతుంటె , హిందూ సంస్కృతిని విమర్శించే వారంతా  ఇంకా  పురాణాలు  రాసిన కాలం లోనే ఉండటమో ఉన్నట్లు నటించడమో చేస్తున్నారు . అంటే   మోడీ గారి వ్యతిరేకులంతా "వైవస్వత మన్వంతర " కాలంలో ఉంటె , మోడి గారేమో "సూర్య సావర్ణిక మన్వంతర " కాలం లో ఉన్నారు. !!! అయన సారద్యం లో మన దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని ఇక్కడి మేజార్తీ ప్రజలు విశ్వసిస్తున్నారు . అదే ఆయనకు కొండంత బలం.
                                                       (23/2/2016 Post Republished).

   
      

Comments

  1. Kannaya Kumar is said to belong to Upper Cast (Bhumihar caste which is said to be a branch of Brahmin)

    http://www.relatest.com/20160220700754234061402114/

    https://en.wikipedia.org/wiki/Bhumihar

    ReplyDelete
  2. మంచి పోస్ట్. ముఖ్యంగా ఏ జాలం (ism) అయినా అదే జాతి, సంసృతిలోంచే రావాలి అని, బయటినుంచి వచ్చే వాటికి మనుగడ ఉండదని చక్కగా చెప్పారు.

    ReplyDelete

Post a Comment

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

కలికాలం.. రివర్స్ కాలం..కాలజ్ఞానం