సంతానం కోసం సన్నాసి బాబాలతో ఇలాంటి పనులు చేయించుకోవడం ఏమిటి చండాలంగా?
స్త్రీ కి సంతానం పొందాలి అనే కోరిక సహజ సిద్దం అయినది. సంతానం లేని స్త్రీలను "గొడ్రాలు" అనే పేరుతో మన సమాజం , ముక్యంగా తోటి స్త్రీ లు అవమానిస్తూ ఉంటారు . వివాహం, తద్వారా ఏర్పడే కుటుంబం యొక్కపరమోద్దేస్యం పిల్లల్ని కనీ వారిని ప్రయోజకులుగా తీర్చి దిద్దడమే. అలాగే ప్రతి జీవి తమ వారసత్వాన్ని నిలబెట్టుకోవాలి అనే కోరికను కలిగి ఉండడమ్ సహజ సిద్దం. అందుకే ప్రతి వారు సంతానం కోసం ఆశించడం వారి జన్మ హక్కు మాత్రమే కాదు , అంతర్జాతీయ సమాజం గుర్తించిన కుటుంబ హక్కులలో బాగం. అయితే ఆరోగ్య లేక ఇతర కారణాల వలన కొంత మందికి సంతానం లేటుగా అందవచ్చు. మరి కొంతమందిలో అసలు సంతానం కలగక పోవచ్చు. అటువంటి వారు పదే బాద వర్ణనా తీతం.
పూర్వకాలం లో సంతానం సకాలం లో అందని వారు దేవుని కటాక్షం కొరకు అనేక నోములు నోస్తూ ,తీర్దయాత్రలు చేస్తూ ప్రార్ధనలు చెసే వారు. సంతాన లేమి తో బాదపడుతున్న దంపతులలో సంతానం పొందుతాము అనే నమ్మకం కలిగించి ఊరడించే కార్యక్రమాలుగా ఈ తీర్ద యాత్రా కార్యక్రమాలు ఉపయోగపడెవి. చివరకు లేటుగా అయినా సంతానం పొందితే అది వారు ఆ దైవ అనుగ్రహం గా బావించి ఎంతో సంతోషించే వారు. ఒక వేల ఎన్ని నోములు నోచినా తీర్ద యాత్రీలు చేసినా సంతానం కలుగనివారికి సంతానం ఎలా పొందాలో తెలిపింది మన హిందూ జీవన విదానం. ప్రపంచం లో ఎవరూ చెప్పని "సప్త సంతానం " విదానం గురించి చెప్పి తన విశిష్టతను చాటుకుంది "హిందూ జీవన విదానం". కడుపున పుట్టిన వారు మాత్రమే సంతానం కాదని , వారితో పాటు ఇంకా 6 రకాలైన సంతానం పొంది, మనిషి జన్మ సాపల్యత పొందవచ్చని చెప్పిన ఆ ధర్మం నిజంగా సంతానం లేని వారికి దేవుడు చూపిన మార్గం అనవచ్చు.
సప్త సంతానం అంటె ఏడు విధములు అయిన సంతానం అవి (1) స్వసంతానం అంటె తమకు పుట్టిన బిడ్డలు ,(2) దత్తత ద్వారా పొందిన బిడ్డలు (3). వనప్రతిష్ట అంటె బాటసారులు కోసం వనాలు పెంచడం (4) దేవాలయ నిర్మాణం (5). గ్రంద లేక కావ్య రచనలు చేయడం (6) చెరువులు త్రవ్వించడం (7) దన నిక్షేపాలను వెచ్చించి ప్రజలకు మేలు చెయ్యడం . పైన చెప్ప బడిన 7 విదాలలో మొదటి రెందు కాక తతిమ్మా 5 ఖచ్చితంగా గృహస్తునికి కీర్తి ప్రతిష్టలు తెచ్చేవే. అలాగే బిద్దలుకూడా పేరును నిలబెట్టే వారైతెనే వారికి సంతానం అని చెప్పుకునే అర్హత ఉంటుంది అని మన పెద్దలు చెప్పారు.
డబ్బు ఉన్నవారైతే వారికి సంతానం కలుగక పోయినా పై 5 పనులలో ఏదో ఒకటి లేక అన్ని చేసి "సంతాన ప్రాప్తి " పలితాన్ని పొందుతారు. కాని సామాన్యులకు మాత్రం కలిగితే స్వసంతానమ్ లేకుంటే వేరే వారి పిల్లలను దత్త త తీసుకోవడం ద్వారా తమ వంశాభివ్రుద్దిని చేసుకోవచ్చు. అలా తీసుకునే దత్తత కూదా తమ సమీప బందువులు ,లో దాతలు అయిన భార్య భర్తల గుణ గణాలు ఎంచి తీసుకుంటే మంచిది . అయితే ఆధునిక వైద్య శాస్త్రం అభివృద్ధి చెందాక "సర్రోగసి సెంటర్ " లు అని "ఫెర్టిలిటి సెంటర్ " లు సంతాన లేని వారికి ఒక వర ప్రసాదం లా ఉన్నా సామాన్య దంపతులకు అందుబాటులో లేని వైద్య విదానం అది. అవి కూదా లక్షలు ఆర్జించే బిసినేస్స్ సెంటర్ లు గా రూపాంతరం చెందాయి కాబట్టి "సంతాన ప్రక్రియ" నూటికి నూరు పాళ్ళు విస్వసనీయమైనదే అనుకోవడానికి వీలు లేదు. కాబట్టి దానికంటె దగ్గరి బందువుల పిల్లలను దత్తత తీసుకోవడం మంచిది.
సరే ఇదంతా సంతానం ఒక క్రమ పద్దతిలో మన ధర్మం చెప్పిన విదానం లో పొందేది అయితే , కొంత మంది స్త్రీలు తమ సంతానం కోసం దొంగ బాబాలను , పకీర్లను ఆశ్రయించి తమకు సంతానం కలిగేలా చేయమని వేడుకుంటుంటారు. వీరి బాల హీనతను సదరు మాయగాళ్ళు క్యాష్ చేసుకుంటుటారు. అదిగో అలాంటి అజ్ఞాన మహిళల జాబితాలోకే చేరుతారు క్రింది విడియోలో ఉన్న స్త్రీలు .బీహర్ రాష్ట్రం లోని సమస్తిపూర్ జిల్లలోని పల్లెటూళ్ళలో నివసిస్తున్న వారు . ఆ ఏరియాలో బగత్ అనే బాబా సంతానం లేని వారికి సంతానం కలిగిస్తాడు అనే ప్రచారం చేసుకుంటే దానిని నమ్మి వచ్చి అతను చెప్పినట్లు అందరూ వరుసగా పదుకున్నారు. ఇక ఆ బాబా ఏమో ఒక చిన్న కత్తి తీసుకుని వారి పొట్టలు మీద గాట్లు పెట్టి , వాటికి కుట్లు కూడా వేసి, ఆ తర్వాత నోట్లో ఎదో నీరు లాంటిది పోసి "ఇక మీకు సంతానం గ్యారంటి " అనే సరికి , పిచ్చి అమ్మలు అంతా ఆనందంగా ఇంటికి వెళ్లి "అమ్మను ఎప్పుడు అవుతామా " అని ఎదురు చూస్తుంతారట. అందులో ఎవరికి అయినాస సంతానం కలిగితే "బాబా కత్తి " మహిమా ,లేకుంటే "దేవుడు అన్యాయం చేసాడు" . దట్సాల్". ఇది ఒక బీహర్ లొనే కాదు మన సమాజం లో చాల మంది , చాలా చోట్ల ఇలాంటి మోసగాల్లను ను నమ్మి తమ శరీరాలను కత్తులకు గురి చేసి అనారోగ్య పాలు అయి కష్టాలు కొని తెచ్చుకుంటున్నారు , అలా చేసి మూర్కులు అనిపించుకునే బదులు , చక్కగా మన జీవన విదానం చూపించిన విదానం లో సంతతి పొంది ఆనందంగా ,కీర్తి ప్రతిష్టలతో జీవించడం వివేక మైన పని.
చివరగా స్వసంతానం లేని, కలిగిన కుటుంబాల వారికి నాదొక విజ్ఞప్తి. మీరు అమ్మా నాన్న కావాలంటే పైన చెప్పిన సప్త సంతాన విదానం లో రెండవది అయిన దత్తత ద్వారా పొందవచ్చు. కానీ మీ దనాన్ని, దాన గుణాన్ని కేవలం ఏ ఒక్కరికో ఉపయోగ పడేలా కాకుండా ,ఒక "అనాధ శరణాలయం/" స్తాపించి దాని ద్వారా మీకు చేతనైనంత వరకు ఆనాద బాలకు ఆశ్రయం కల్పించి పెంచి పెద్ద చేసి , వారి కాళ్ళ మీద వారు నిలబడేటట్లు చేస్తే మీకంటె గొప్ప మాతా పితలు ఈ ప్రపంచం లో ఎవ్వరూ ఉండరు. ఇది మన ధర్మం చెప్పిన సప్త సంతానం లో బాగం . అంతే కాదు బాల ప్రహ్లాదుని రక్షించడానికే ఉద్బవించిన ఆ నరసింహా స్వామీ కి ఎంతో అనందం కలిగించే చర్య ఇది. అలా చేసిన వారికి ఆస్వామి కరుణా కటాక్షాలు ఎల్లపుడు ఉంటు వారు చరిత్రలో నిలిచిపోయేలా అనుగ్రహిస్తాడు.
ఇక సంతానం కోసం బాబా కత్తికి ఏర గా మారిన స్త్రీలకు సంబందించిన వీడియోను చూడండి
(12/2/2016 Post Republished)
Comments
Post a Comment