ఆడది నన్నేమి చేస్తుందిలే అని అహంకరించిన "దున్నపోతు రాక్షసుడు" ని చంపిన "దుర్గాదేవిని " అంత మాట అంటారా ఈ "దున్నపోతు బావజాలికులు ".

                                                                         

చదవక ముందు "అమ్మా " "అమ్మా " అన్నోడు , చదువు ఎక్కువ అయి "నీ అమ్మా , నీ అమ్మా , అనటం మొదలు పెట్టాడంట !. అలా ఉంది మన విశ్వ విద్యాలయాల్లో కొంతమంది మేదావి విద్యార్దులుం అని విర్రవీగే వారి తీరు. పూర్వకాలం లో రాక్షసులు ఎంత విద్యావంతులు, బలవంతులు  అయినా , మూర్కత్వం తో కూడిన అహంకారం ఉండటం వలననే లోక కంటకులు అయి దేవతల చేతిలో దిక్కు లేని చావు చచ్చ్చ్హారు . మేము ఆ  రాక్షస  రాజులుకు  వారసులం అని , మాది రాక్షస బావజాలం అని చెప్పుకుంటున్న వారు నిజంగా ఆ రాక్షస సంతతి యొక్క వారసులే అని అనిపిస్తుంది , వారు చెప్పే కదలు , చెసే చేష్టలు చూస్తుంటె. కాకపోతే బాదా కరమైన విషయం ఏమిటంటె , ఈ  దేశం  లో ఉన్న 80% అణగారిన వర్గాలకు చెందిన ప్రజలను సదరు రాక్షస సంతతికి చెందిన వారిగా తీర్మాణించి , వారందరికి వీరు ప్రతినిధులు అన్నట్లు స్టేట్ మెంట్ లు ఇవ్వడమ్. నిజంగా ఈ రాక్షస బావజాలికులు చెప్పే కట్టుకదలు వింటె వారు ఎవరికీ ప్రతినిదులం అని చెప్పుకుంటున్నారో , వారే బడితే పూజ చెయ్యడం ఖాయం. 

   దుర్గా దేవి హిందువుల ఆరాద్య దైవం. భారత దేశం లోఅనాదిగా  స్త్రీలను దేవతలు గా బావించి పూజిస్తున్నారు అంటె అది ఆ దేవతల ఆవిర్బావం వెనుక ఉన్న పురాణ కదలే . స్త్రీలను పురుష దేవుళ్ళతో పాటు సమానంగా  పూజించడమనేది హిందూ జీవన విదానం లో బాగమని రుజువు చేస్తున్నాయి శక్తీ అవతారాల ఆవిర్బావ కదలు . అందులో ఒకటి దుర్గాదేవి ఆవిర్బావ కద. 

   పురుష అహంకారానికి ప్రతీకలు అయిన రాక్షసులు నిరంతరం తమ బల గర్వంతో మానవులను హింసిస్తూ  , దేవతల మీద అధిపత్యం తపస్సులు చేసే వారు . అటువంటి వారిలో మహిషాసురుడు ఒకడు. అతడు బ్రహ్మ గురించి తప్పస్సు చేయగా బ్రహ్మ ప్రత్యక్షమై "ఏమి వరం కావాలో కోరుకో "అన్నాడు . దానికి మహిషాసురుడు మానవుల చేతిలో కాని, దేవతల చేతిలోకాని చావు లేని విదంగా వరం ఇమ్మనాడు . ఆ దున్నపోతు రాజు అంతర్యం గ్రహించిన ఆ చతుర్ముఖుడు "స్త్రీ చేతిలో తప్పా , మరెవరి చేతిలోను నీకు చావు లేదు" అనే వరం ఇచ్చాడు. దానితో ఆ మహిషాసురుడు " ఆ అప్ట్రాల్ ఆడది నన్నేమి చేస్తుంది లే" అని అహంకారం తో ఆ వరం కి O.K అన్నాడు.   

                         ఇక ఆ తర్వాత బ్రహ్మదేవుని వరాల వలన వరగర్వితుడైన మహిషాసురుడు దేవతల్తో ఘోరమైన యుద్ధమి చేసి వారిని ఓడించి ఇంద్రపదవి చేపట్టాడు. దేవేంద్రుడు త్రిమూర్తులతో మొర పెట్టుకొనగా మహిషునిపై వారిలో రగిలిన క్రోధాగ్ని ప్రకాశవంతమైన తేజముగా మారింది. త్రిమూర్తుల తేజము కేంద్రీకృతమై ఒక స్త్రీరూపమై జన్మించింది.శివుని తేజము ముఖముగా, విష్ణు తేజము బాహువులుగా, బ్రహ్మ తేజము పాదములుగా కలిగి మంగళమూర్తిగా అవతరించిన ఆమె 18 బాహువులను కలిగి ఉంది. ఆమెకు శివుడు శూలమును, విష్ణువు చక్రమును, ఇంద్రుడు వజ్రాయుధమును, వరుణ దేవుడు పాశము , బ్రహ్మదేవుడు అక్షమాల, కమండలము హిమవంతుడు సింహమును వాహనంగాను ఇచ్చారు. ఇలా సర్వదేవతల ఆయుధములు సమకూర్చుకొని మహిషాసురుని సైన్యంతో తలపడి భీకరమైన పోరు సల్పింది. మహిషాసురుని తరఫున పోరు సల్పుతున్న ఉదద్రుడు, మహాహనుడు, అసిలోముడు, బాష్కలుడు, బిడాలుడు మొదలైన వారిని సంహరించిన తరువాత మహిషాసురునితో తలపడినది. ఈ యుద్దములో ఆదేవి వాహనమైన సింహమూ శత్రువులను చీల్చి చెండాడింది. దేవితో తలపడిన అసురుడు మహిషిరూపము, సింహరూపము, మానవరూపముతో భీకరముగా పోరి చివరకు తిరిగి మహిషిరూపములో దేవిచేతిలో హతుడైనాడు.ఈ విధంగా అప్పటి నుండి మహిషుని సంహరించిన దినము దసరా పర్వదినంగా ప్రజలచే కొనియబడినది.

          అలా దసరా పడుగని ఆనందం తో సర్వ వర్ణాల వారు దుర్గా దేవిని పూజిస్తూ జరుపుకుంటుంటే ,విశ్వవిడ్యాలయలోని కొంత మంది దున్నపోతు రాజు సంతతి అని చెప్పుకునే వారు, దున్నపోతు రాజు గొప్ప వీరుడు అని  అతనిని ఎదిరించలేక దేవతలు " దుర్గ " అనే వేశ్యను ప్రేరేపించి దున్నపోతు రాజు దగ్గరకు పంపితే వాడు 9 రోజులు ఆమె తో ఎంజాయి చేస్తూ పదవ రోజున ఆమే ఇచ్చిన విషం త్రాగి చచ్చాడు అని ఒక నీచమైన కధను  అల్లి  ఆ రాక్షసుడి ని అమర వీరుడిగా కీర్తిస్తూ ఉత్సవాలు చేసుకుంటున్నారు. 

     ఇప్పుడు చెప్పండి ఏ బావజాలం గొప్పది?. స్త్రీకి అన్ని రకాల ఆయుదాలు సమకూర్చి లోక కంటకుడు అయిన ., పురుష అహంకారుడిని చంపమన్న బావజాలం  గొప్పదా? ఆప్ట్రాల్ ఆడది  నన్నేమి చేస్తుందిలే అన్న అహంకారికి వారసులం  అని చెప్పుకోవడం కోసం కోట్లాది మంది ప్రజలు పూజించే  దేవతను వేశ్య అని చిత్రీకరించి న బావజాలం గొప్పదా? ఇదే మాట విశ్వవిద్యాలయం బయటకు వచ్చి సామాన్య ప్రజలతో అంటె ఆ దున్నపోతు రాజుకు పట్టిన గతే వారికీ పడుతుంది. అలాంటి దున్నపోతు రాక్షసుడు వారసుల నుంచి ఈ  దేశం లోని  విద్యాలయాలను విముక్తం చేయమని ఆ దుర్గా దేవిని ప్రార్దిద్దాం . 

జై దుర్గా                                                                       జై మహిషాసుర మర్దిని !!
                                           (26/2/2018 Post Republished).


Comments

Popular Posts

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన

ఇంగ్లీష్ దుస్తులు వేసుకుని "Happy New Year " అంటే , కన్నడ కేకలు వేస్తూ వెంటపడి వేధించారు అట !

స్త్రీ ని నగ్నంగా చూపించటం అశ్లీలం కాదన్న సుప్రీం కోర్టు

మరిది పెండ్లిలో వదిన ముద్దు పెట్టినందుకు , మరిది పెళ్లి మటాష్ అయి , బందువులంతా బాదుకున్నారట!

మనల్ని ఆపదల నుండి కాపాడే నరసింహ మంత్రం

తమ్ముడ్ని పెండ్లాడి, అన్న మీద మనసు పడితే చివరకు జరిగేది ఇదే!.