30,000 శవ పరీక్షలు చేసిన ఆ డాక్టర్ కే ఒళ్ళు గగుర్పొడిచేలా చేసిన ఆ" యువతి శవ పరిక్ష " !!!?
ఈమద్య ఒక ఆంగ్ల వ్యాసం చదివాను . ఆ వ్యాస రచయిత ఏ మాత్రం వాస్తవ ద్రుష్టి లేని పక్కా ఆదర్శ వాది కాబోలు 'స్త్రీలకు కావాల్సింది రక్షణ కాదు ,స్వేచ్చా స్వాతంత్ర్యాలు చాలు " అని తేల్చేసాడు . ప్రస్తుతం డిల్లీలో జరుగుతున్నా ఎన్నికల ప్రచారం సందర్బంగా అక్కడి ప్రదాన పార్టీలు అయిన బి. జె.పి ,అమ్ ఆద్మీ మానిపెస్టో ల గురించి ప్రస్తావిస్తూ రాసిన వ్యాసంలో అయన గారి కోరిక అది .కాని అది ప్రచురించబడిన 24 గంటల్లోనే డిల్లికి సమీపం లోని రోహ్తక్ జిల్లాలో జరిగిన ఒక దారుణ సంఘటణ సదరు రచయిత గారి కోరిక ఎంత వాస్తవ దూరమైనదో తెలియ చేస్తుంది .స్త్రీలకు సంపూర్ణ స్వెచ్చా స్వాతంత్ర్యాలు అనేవి నూటికి నూరు శాతం మనుషులు ఉన్న సమాజం లో ఉంటె మేలు చేస్తాయి కాని ,1% మనిషి రూప మెకాలు ఉన్నా అవి స్త్రీలకు అపాయం తలపెడతాయి, అని అనిపించే లా ఉన్న ఈ ఉదంతం గురించి తెలుసుకోండి . ఆమె 28 ఏండ్ల యువతి . నేపాల్ లోని వార్డా జిల్లా కు చెందిన వ్యక్తీ . ఆమె కు మానసిక రుగ్మతలు ఉండటం వలన చికిత్స తీసుకుంటుంది .ఆమె అక్క ఒకామె హర్యానా లోని రోహ్ తక్ లో ఒక