4 లక్షలు తీసుకుని దూలపల్లి కుర్రాడి "పొడుగు దూల " తీర్చిన గ్లోబల్ డాక్టర్లు !!!
అ అబ్బాయి పేరు నిఖిల్ రెడ్డి. వయస్సు 22 యేండ్లు. చదివింది B.tech . ఉండేది హైదరాబాద్ లోని పేట్ బషీర్ బాద్ పోలిస్ స్టేషన్ పరిదిలో గల దూలపల్లి .ఈ దూలపల్లి అబ్బాయి కి ఒక చిన్న దూల ఉంది అట. అదేమిటంటే తను ఇంకొంచం ఎత్తు కావాలని. ప్రస్తుతం అతని ఎత్తు 5. 7 అట. ఒక రకంగా అది మగాళ్ళకు ఏవరేజ్ ఎత్తు. మరి పొట్టిగా కాని , మరీ పొడుగుగా కాని అనిపించనంత సాదారణ ఎత్తు. అయినా సరే కుర్రాడికి తన ఎత్తు పట్ల సంతృప్తి కలుగలేదు అంటె దానికి వేరే కారణం ఏదైనా ఉందేమో! చదివిన ఇంజనీరింగ్ కోర్స్ కూడా అతనికి మానసిక పరిపక్వతను ఇవ...