పెండ్లి కాని "బాబా" లు గొప్పా ? పెండ్లి అయిన "భాబా" లు గొప్పా?
మన దేశం లో బాబాలు అనబడేవారు రెండు రకాలు. ఒకరు పెండ్లి కాని బాబాలు అయితే రెండవ రకం పెండ్లి అయిన భాబాలు . వీరిలో ఏ రకం బాబాలు గొప్ప వారు అనేది తెలుసుకునే ముందు అసలు ఈ రెండు రకాల బాబాల మద్య ఉన్న తేడాలు ఏమిటొ తెలుసుకుంటే గాని చెప్పడం కుదరదు. అందుకే వీరి గురించి వివరిస్తాను. ముందుగా పెండ్లి కాని బాబాలు గురించి తెలుసుకుందాం. మన దేశం లో పూర్వం రుషులు , మునులు అనబడె మానవోత్తములు ఉండె వారు . వీరు వనాలలో ఆశ్రమాలు నిర్మించుకుని , తమ పరివార సహితంగా జీవిస్తూ తమ అనుభవాలను , జ్ఞానాన్ని తమ తర్వాతి తరాలకు అందిస్తూ సమాజానికి మార్గదర్శకులై ఉండె వారు . సాదారణంగా వీరు వివాహాలు చేసుకుని ...