చక్కనమ్మ చిక్కినా అందమే ! బడాయి అమ్మాయి "బర్రె గొంతు"తో పాడినా చందమే !
మనం రైళ్ళల్లో ప్రయాణాలు చేసేటప్పుడు , కొంతమంది బిక్షకులను చూస్తుంటాం. వారు తమకు వచ్చిన సినిమా పాటలు పాడుతూ బిక్షాటన చేస్తుంటారు. వారిలో కొంతమంది మంది గొంతులు మధురంగా కాకపోయినా , వినసొంపుగా ఉండి, వారు పాడే పాటను కాసేపు వినేలా చేస్తాయి. వారికే కనుక అవకాశాలు కల్పించే వారుంటే , మన సిని జగత్తుల్లో చాలా మంది కంటె వారు చాలా బెటర్ నిరూపించుకుంటారు . ఇక కొంతమంది బిక్షకులు ఉంటారు . వారి గొంతులు కర్ణ కటోరంగా , రాగం తాళం అడ్డదిడ్డంగా ఉండి , వారు దగ్గరకు వస్తే తొందరగా పైసలు ఇచ్చి పంపిస్తే బాగుండు అనిపిస్తుంది అలాంటి కర్ణకఠోర గాత్ర దారులకు తలమానికం లా నిలుస్తుంది , ప్రముఖ సిని నటుడు మోహన్ బాబుగారి గారాల పట్టి మంచు లక్ష్మీ . ఆమె గారికి దేవుడు ఇచ్చిన గొప్ప వరం ఏమిటంటే ,ఏ కత్తి లేకుండానే తెలుగు బాషను తుంపులు చేసి పలకడం . ఆమె గారు ఒక బడా నట ప్యామిలీ కి చెందిన "బడాయి అమ్మాయి " కాబట్టి ఆమె ఎలా మాట్లాడినా . అహా ఒహో అనటం తప్పా విమర్శించే సాహసం ఎవరికీ ఉండదు . ఇప్పటిదాక ప