బాబా రహస్యం బయట పెట్టలేక, జనం కళ్ళకు "గంతలు " కట్టిన జన విజ్ణాన వేదిక !
నిన్న పేస్ బుక్ లో, జన విజ్ఞాన వేదిక వారి సాహసోపేత "అగ్ని చేధన " పీట్లు అంటూ యూ ట్యూబ్ లో ఒక వీడియో లింక్ పెట్టారు .ఆ యూ ట్యూబ్ లో కామెంట్స్ కాలం లో ఇలా ఉంది "జన విజ్ఞాన వేదిక రమేష్ చేసిన సాహసోపేతమైన ఫీట్ ఇది. సత్యం చెప్పిన బ్రునోను మతోన్మాదులు బహిరంగంగా సజీవ దహనం చేసిన రోజునే .... అతనికి నివాళి అర్పిస్తూ చేసిన అద్భుతమైన ఫీట్ ఇది. కిక్కిరిసిన మీడియా కెమెరాల సాక్షిగా గొలుసులతో కట్టి వేసి .... అనేక తాళాలు వేసి అగ్ని జ్వాలల మధ్యలో క్రేన్ సహాయంతో పడేయగా .... క్షణాలలో గొలుసులను ఊడదీసుకుని ... మంటలను చ్చేదించుకుంటూ .... కిక్కిరిసిన మీడియా కెమెరాలు .... జనాలు సాక్షిగా బయటకు రావటం జరిగింది ... ఆ విన్యాసాన్ని మీరు చూడండి... మూడ నమ్మకాల నిర్మూలన ఆవశ్యకతను మీరు గుర్తించండి ......