బాబా రహస్యం బయట పెట్టలేక, జనం కళ్ళకు "గంతలు " కట్టిన జన విజ్ణాన వేదిక !


                                                                 
     

 నిన్న పేస్ బుక్ లో, జన విజ్ఞాన వేదిక  వారి  సాహసోపేత "అగ్ని చేధన " పీట్లు  అంటూ  యూ ట్యూబ్ లో ఒక  వీడియో లింక్ పెట్టారు .ఆ యూ ట్యూబ్ లో కామెంట్స్   కాలం  లో ఇలా ఉంది

"జన విజ్ఞాన వేదిక రమేష్ చేసిన సాహసోపేతమైన ఫీట్ ఇది. సత్యం చెప్పిన బ్రునోను మతోన్మాదులు బహిరంగంగా సజీవ దహనం చేసిన రోజునే .... అతనికి నివాళి అర్పిస్తూ చేసిన అద్భుతమైన ఫీట్ ఇది. కిక్కిరిసిన మీడియా కెమెరాల సాక్షిగా గొలుసులతో కట్టి వేసి .... అనేక తాళాలు వేసి అగ్ని జ్వాలల మధ్యలో క్రేన్ సహాయంతో పడేయగా .... క్షణాలలో గొలుసులను ఊడదీసుకుని ... మంటలను చ్చేదించుకుంటూ .... కిక్కిరిసిన మీడియా కెమెరాలు .... జనాలు సాక్షిగా బయటకు రావటం జరిగింది ... ఆ విన్యాసాన్ని మీరు చూడండి... మూడ నమ్మకాల నిర్మూలన ఆవశ్యకతను మీరు గుర్తించండి .... ప్రభుత్వాల మెడలు వంచి మూడ నమ్మకాల నిర్మూలన చట్టం చేయటానికి మీవంతు మద్దతును దయచేసి ఇవ్వండి"
.
అది చూసి చాలా సంతోషం వేసింది . మెజిషియన్ లు చేసే పైర్ పీట్ ని  జన విజ్ణాన వేదిక  వారు నేర్చుకున్నందుకు అనందం వేసింది . కాని సదరు పీట్ ను బాబాలు చేసే ఫీట్ గా ప్రచారం చేయడం చూసి కొంత అనుమానం కూడా వేసింది .ఇంతకు ఆ వీడియోలో ఏముందా అని ఆసక్తిగా చూడటం జరిగింది . అది పక్తు మెజిషియన్ లు చేసే పీట్ లాగుంది కాని ,"అగ్ని యోగి" చేసే ప్రక్రియలా లేదు . ఇంతకి "అగ్ని యోగి " చేసే ప్రక్రియకు ,JVV  వారు చేసిన మాజిక్ ఫీట్ కు గల బేదం ఏమిటో తెలుసుకుంటే కాని ,జనం అజ్ఞానం ని పాపులారిటి కోసం వాడుకుంటుంది ఎవరో తెలియదు .

 "అగ్నియోగి " ప్రక్రియ   
ఇందులో ఒక హోమ గుండం ఉంటుంది . అందులో సమిదలుతో పాటు నెయ్యి లాంటివి వేసి హోమ గుండం వెలిగిస్తారు . అలాంటి  హోమ గుండం లో 'అగ్ని యోగి ' ఆ సమిదలు మీద పడుకుని ఉంటాడు . అతని ఒంటి మీద ఒక అంగ వస్త్రం  మాత్రమే ఉంటుంది . అలా ఆ యోగి, సమిదలు అంటుకుని పెద్ద మంటగా పెద్ద మంటగా మారే వరకు జనిస్తున్న ఆ వేడిని ,పొగను భరిస్తూ ,చివరకు జ్వాలలు ఎగిసే వరకు ఉండి బయటకు రావడం జరుగుతుంది .ఇదంతా బహిరంగంగా అందరూ చూసే విదంగా జరుగుతుంది . దిని వలన ఎవరి కైనా అర్ధం అయ్యేదోకటే . సామాన్య మానవుడు కంటే 'అగ్ని యోగి 'శరీరానికి  వేడిని తట్టుకునే శక్తి ఎక్కువ .ఇది అయన నేర్చుకున్న తాంత్రిక ప్రక్రియ వల్లా సాధ్య పడుతుందని అయన బావిస్తుండవచ్చు ,సైన్స్ పరంగా కూడా అది సాధ్యమే కావచ్చు . ఉదాహరణకు మామూలు మనిషి నీటిలో ఊపిరి బందించి ఉండే కాలం కంటే ,మెరైన్ విబాగంలో శిక్షణ పొందిన వారు కొన్ని నిమిషాలు ఎక్కువుగా ఉండగలుగుతారు .వారుతీసుకున్న ట్రైనింగ్ వారిని అలా ఉండ గలిగేలా చేస్తుంది . తాంత్రిక విద్య కూడా అలాంటి ట్రైనింగే కావచ్చు .దీనినే జన విజ్ఞాన వేదిక వారు శాస్త్రీయంగా వివరిస్తే సరి పోతుంది .కావాలంటే అగ్ని యోగి తాంత్రిక ప్రక్రియను క్రింది విడియోలో చూడండి .ఆయన మామూలు మనిషి కంటే  కొంత ఎక్కువ సేపు  వరకు మాత్రమే ఆవేడిని బరించాడు తప్పా ,తన శరీరం కాలి పోయే దశలో మాత్రం కాదు అని అయన చేస్తున్న ఆ ప్రక్రియ చూసే వారికెవరికైనా క్లియర్ గా అర్దమవుతుంది .ఇది తెలుసుకోవడానికి సైన్స్ లోడిగ్రీ లుఅక్కర్లేదు .

           
                    


 ఇక పోతె  బాబాల బండారం బయట పెడతామంటూ ,పెద్ద బిల్డ్ అప్ లు ఇచ్చి ,పెద్ద క్రేన్ లు తెచ్చి ,సర్కస్ పీట్ లు చేసి ,దానితో జనం ని విజ్ఞాన వంతులను చేస్తున్నాం అని "విజ్ఞాన బాబులు " అనుకుంటే దానికన్నా అజ్ఞానం మరొకటి ఉండదు . అసలు విజ్ఞాన బాబులు చేసిన మాజిక్  ఫీట్ కి ,అగ్ని యోగి చేసిన తాంత్రిక ప్రక్రియకి ఏమైనా సంబందం ఉందా? చూదాం .

 విజ్ఞాన వేదిక వారి మాజిక్  పీట్ 
ఇందులో చుట్టు కర్రలతో ఒక దొడ్డి లాంటిది చట్రుసాకారం లో కట్టారు . దాని నలు వైపులా గడ్డి తో కప్పి వేసారు .దీని వలన లోపల ఉన్న మనిషి ఏమి చేస్తున్నాడో ఎవరికీ కనపడదు . అంటే ఒక రకంగా ప్రేక్షకుల  కళ్ళకు గంతలు కట్టి నట్లే !. ఇక మాజిక్  ఫీట్ చేసె వ్యక్తిని ,వారి మనుషులే సంకెళ్ళు లాంటి గొలుసులు ,వాటికి 2లేక 3 తాళాలు వేసి ,ఆ వ్యక్తిని క్రేన్ సహాయంతో పైన చెప్పిన గడ్డి దొడ్డి  ప్రాంతంలోకి ప్రవేశ పెడతారు . ఆ తర్వాత దొడ్డి చుట్టూ ఉన్న చెత్తకి నిప్పు పెడతారు .దొడ్డి లోకి దిగెటప్పుడే చక చకా తనకున్న సంకెళ్ళు విప్పదీసుకునె అవకాసం ఉంటుంది కాబట్టి . మాజిక్ పిట్ చేసే వ్యక్తీ పూర్తిగా చెత్త తగలబడి పోకముందే అందునుంచి 'బ్రతికి పోయానురా భగవంతుడా "అన్నట్లు ఆదరా బాదరా బయటకువచ్చి ఒక కాగడా ను చేతి మీద తొందర తొందరగా క్రిందికి పైకి కదిలిస్తూ తన దీరత్వమ్ ప్రదర్స్తిస్తాడు . అసలు ఆ గడ్డి దొడ్డి లోపల చాలా ఖాళి స్తలం ఉంది కాబట్టి ,ఒక వేల గడ్డి పూర్తిగా కాలి పోయె దాకా అందులో ఉన్నా ప్రాణ హాని ఏమి ఉండదేమో అనిపిస్తుంది . అది కాక అసలు అగ్ని యోగి బహిరంగంగా మంట మీద పడుకున్న దానికి , సిక్రెట్ గా జనవిజ్ఞాన వేదిక వ్యక్తీ తాళాలు విప్పదిసి ,మంటను భరించలేక బయటకు వచ్చె సిన్ కి ఎమైనా సంబందం ఉందా ?ఈ రెండు ఘటనలలో జనం కళ్ళకు గంతలు కట్టింది ఎవరు? అగ్ని యోగా ?విజ్ఞాన బాబులా ? విజ్ఞాన వేదిక వారు ప్రదర్శించిన ఆర్బాటపు ప్రచార సన్నివేశాల తొకూడిన వీదియోని క్రింద చూడవచ్చు నిజానికి జనం కి విజ్ఞానమే బొదించాలి అనుకుంటే ఇలా ఆర్బాట ప్రచారాలు చేయాల్సిన అవసరం లేదు . మెజీషియన్ లు చేసే ట్రిక్ లు చేస్తూ ,వాటిని బాబాలు చేసే పీట్లు అనడంలో జన విజ్ఞాన వేదిక వారి ఉద్దేశ్యం వేరే అయి ఉంటుంది . తమ అసలు ఉద్దేశ్యాలు ప్రజలకు తెలియకుండా ఉండటానికి ,తమ సంస్త  పాపులారిటి కోసమే ఇలాంటి మాజిక్ ప్రదర్సనలు ,జన విజ్ఞాన వేదిక వారు ఇస్తున్నారని ,చాలా మంది అనుకోవడం లో తప్పు లేదేమో అనిపిస్తుంది ,ఇలాంటి ప్రదర్సనలు చూస్తె!.


                                 నిజానికి,విజ్ఞానుల్లో ప్రజల అమాయకత్వాన్ని ,తమ స్వార్ద ప్రయోజనాలకు వాడుకునే నకిలీ విజ్ఞానులు ఉన్నట్లే ,ఆద్యాత్మిక రంగంలో నకిలీ బాబాలు ఉండవచ్చు . 100 మంది నకిలీ బాబాలు చేసే మాయలు వలన ప్రజకు జరిగే హాని కంటే,డబ్బు కోసం కిడ్నీలు మాయం చేసె ఒక విజ్ఞాని వలన సమాజానికి కలిగే హాని యే ఎక్కువ . విజ్ఞానం అనేది  ప్రణాలికా బద్దమైన దీర్గ కాల  బోద తో కలుగుతుంది తప్పా ,చెప్పే దానికి చేసే దానికి సంబందం లేని ఇలాంటి మాజిక్ పీట్లు వలన కాదు అని విజ్ణాన బాబులు గుర్తిస్తే మంచిది . లేకుంటే నకిలీ బాబాలు అయినా ,విజ్ఞాన వేదిక వారైనా పాపులారిటి కోసమె ఇలాంటి మేజిక్ పీట్లు ను చేస్తున్నారు అని  అంతో ఇంతో జ్ఞానం ఉన్న వారు అనుకుంటారు .                                                                                                                            
                                                                             
                                                                   

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

పెళ్లి అంటే"పిచ్చి పని", మగాడు అంటే "సెక్స్ కోసం వాడి పారేసే వేస్ట్ పేపర్".అంటా!

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )