"ఆమె " పాలన అంటేనే హడలెత్తి పోయి,AAP కి అధికారం కట్టబెట్టిన డిల్లీ ప్రజలు !
ఉదాహరణకు డిల్లికి మూడు సార్లు ముఖ్య మంత్రి గా పని చేసిన షిలా దిక్షిత్ గారి విషయమే తీసుకుందాం . ఆమె సాక్షాత్తు కాంగ్రెస్ పార్టికి చెందిన సీనియర్ లేడి లీడర్ . కేంద్రం లో అధికారం లో ఉంది తన పార్తీయే . అయినా సరే డిల్లీ పోలిస్ అధికారులు ఆమెగారి ఆదేశాలను బేఖాతరు చెసే వారు . తన రాష్ట్ర పోలిస్, తన మాట వినటం లేదని ఆమె కేంద్రం పెద్దలు ముందు కన్నీరు పెట్టుకునేది అని వినికిడి . బహిరంగంగా కేంద్రం కి నిరసన తెల్పిన సందర్బాలు ఉన్నాయి . డిల్లి శాంతి భద్రతల విషయం లో స్త్రీ రక్షణ ప్రదాన మైనది . స్త్రీల మీద జరుగుతున్నా లైంగిక దాడులకు ,అక్కడి కొంతమంది స్త్రీల ప్రవర్తన ఇంక్లూడింగ్ డ్రెస్ కోడ్ అని డిల్లి పోలిసులు దృడంగా నమ్ముతారు . దానిని స్త్రీ ముక్యమంత్రులు ఒప్పుకోక పోవడం సహజం . అలాగే ఇంకా కొన్ని విషయాలలో డిల్లి పోలిసులుకు ,ఆమెకు పడేది కాదు అనుకుంటా . అలా సమన్వయము కొరవడిన పాలక ,అధికార వర్గాలు వలన డిల్లి లోశాంతి భద్రతలు అస్తవ్య్స్తంగా మారి నిర్భయ లాంటి ఉదంతాలతో డిల్లీప్రతిష్ట మసక బారి పోయింది . అంతిమంగా ఒక స్త్రీ ముక్యమంత్రిగా డిల్లీ పోలిస్ ను అదుపు చేయలేదనే నిర్దారణకు డిల్లీ ప్రజలు వచ్చి ఉండాలి .
అదిగో సరిగా అదే సమయంలో కిరణ్ బేడి గారిని ముక్యమంత్రి అబ్యర్ధిగా ప్రకటించి , BJP ఎన్నికల్లో దిగడం ప్రజలకు రుచించ లేదు ."ఆమె " (స్త్రీ పాలన ) వలన ఇప్పటి దాక పడిన బాధలు చాలు .ఇక వద్దురా బాబూ అనుకుని ఉండాలి . అందుకే ఆడ పెత్తనాన్ని మగ చీపురు పెట్టి ఓడించి పారేసారు . లేకుంటే పోయిన సారి ఎన్నికలకు ,ఇప్పటి ఎన్నికలకు కేవలం ఒక శాతం కి తక్కువ ఓట్లు పొందిన BJP,సీట్లు సాధనలో మొత్తంగా ఎందుకు పెయిల్ అయింది . "ఆమె " పాలన మీద ప్రజలకు విశ్వాసం సన్నగిల్లడం వల్లా, స్తానిక పోలిసుల ప్రవర్తనలను దృష్టిలో పెట్టుకుని , డిల్లీని మగాళ్ళు తప్పా ఆడాళ్ళు పాలించ లేరనే అభిప్రాయానికి వచ్చి ఉండటం వలన కావచ్చు .
ఎదీ ఏమైనప్పటికి లౌక్యం లేమి వలన కేజ్రీ వాల్ గారు తన మొదటి ఇన్నింగ్స్ ని 49 రోజులకే ముగించాల్సి వచ్చింది డిల్లీ లో పాలన సజావుగా ఉండాలంటె కేంద్రం తో సత్సంబందాలు కంపల్సారి అని కేజ్రీ వాల్ గారు గుర్తించినట్లే కన పడుతున్నట్లుమ్ది . అదే అయన పాలనకు శ్రీ రామ రక్ష . BJp వారు కూడా ,సామాన్య, మద్య తరగతి ప్రజల ఆకాంక్షలకు విలువ నిచ్చి ,అవినీతి మీద రాజీ లేని పోరాటం చేయాలనుకునే కేజ్రి వాల్ గారికి సహాయం అందించాలి .ఇప్పటికైనా నల్ల దనం విషయం లో మొహమాటాలకు తావు ఇవ్వ కుండా విదేశాలలో ఉన్న నల్ల ధనం ఇండియాకి తెస్తే ,ఈ నాడు AAP కి ప్రజలు ఎలా బ్రహ్మ రధం పట్టారో అలాగే BJp వారికీ పడతారు అనడం లో ఎటువంటి సoదేహమ్ ఉండనవసరమ్ లేదు .
డిల్లి ఎన్నికల్లో అఖండ విజయం సాదించిన కెజ్రీవాల్ గారికి అయన పార్టికి శుభాభి నందనలు
Comments
Post a Comment