వాలెంటైన్స్ డే అంటె పువ్వులు పట్టుకుని తిరగడం కాదు ! పుస్తెలు పట్టుకుని తిరగడం !

                                                                                   

 వాలెంటైన్స్ అనే ఒక ప్రాశ్చ్యాత మహనీయుడు రోమ్ లో నివసించే వాడు . అప్పటి రోమ్ పాలకుడైన క్లాడియస్ మహా క్రూరుడు . అప్పటి రోమ్ ప్రజల జీవన విదానం సెక్స్ విషయం లో విచ్చల విడిగా ఉండెది అట . స్త్రీ పురుషులు తమకు ఇష్టం వచ్చిన వారితో నచ్చినంత కాలం గడిపి ,మొహం మొత్తగానే సెక్స్ లో కొత్త రుచులు కోసం తమతో ఉన్న వారిని వదిలించుకుని ,కొత్త వారితో ఖుషీ చేసే వారట .కాబట్టి అప్పటి పిల్లలకు తమ తల్లి ఎవరో తెలుసు కాని ,తండ్రి ఎవరో చెప్పటం కష్టం అట . అంతేకాక విశ్రుంఖల స్వేచ్చా విదానం వలన స్త్రీ పురుషులలో దిక్కు మాలిన సుఖ వ్యాదులు ప్రబలి ఆరోగ్యాలు అస్త్య వ్యస్తంగా ఉండెవి అట . ఇటువంటి విశ్రుంఖల జంతు జీవన విదానమే తమ నాగరిక జీవన విదానం అని అప్పటి రోమ్ పాలకులు తలచెవారట .

అదిగో అలాంటి సమయంలో ఒక చర్చ్ కి పెద్ద గా ఉన్న వాలెంటైన్ మహనీయుడు సమాజంలో ఉన్న దుర్నీతిని ఎండగట్టి ,మానవ వికాసానికి ,ఆరోగ్య కరమైన సమాజ అభివృద్దికి ,విచ్చలవిడి విదానం కంటె క్రమ యుత మైన కుటుంబ జీవన విదానం ఉండాలి అని ,దానికి ఏక దంపతీ వివాహ వ్యవస్థ సరి అయినదని బావించి ,దాని గురించి ప్రజల్లో ప్రచారం చేయడం ప్రారంభించాడు .  ప్రతి వ్యక్తీకి వివాహం అవసరం అని ప్రచారం చేయడమేకాక ,యువతి యువకులకు తన చర్చ్ లోరహస్యంగా పెండ్లిళ్ళు చేసే వాడు .ఎందుకంటే అప్పటి రోమ్ శాసనాలు ప్రకారం వివాహాలు నిషిద్ద్సం కాబట్టి . అయితే వాలెంటైన్ సెయింట్ చేస్తున్న ఈ పని చివరకు క్లాడియస్ రాజు కు తెలిసి  అయన్ని ,అయన పెండ్లిళ్ళు చేయించిన జంటల సమక్షంలో పబ్లిక్ గా ఉరి తియించాడు . ఆ విదంగా వాలెంటైన్ మహానియున్ని ఉరి తీసిన రోజే పిబ్రవరి 14. ఆ తర్వాత అయన స్మృత్యర్ధం వివాహితులు అయిన స్త్రీ పురుషులు వాలెంటైన్స్ డే జరుపుకునే వారట .

 రాజుల కాలం పోయి తరాజుల కాలం అంటె వ్యాపార వాదుల కాలం వచ్చాక ,వివాహ వ్యవస్థ విశిష్తతకు ప్రతిక గా జరుపవలసిన వాలెంటైన్స్ డే ని క్రూరుడైన క్లాడియస్ రాజు బావాలకు అనుగుణంగా మార్చేసారు .యువతలోని  ఒంట్లో కామ తీటకు ప్రేమ అనే పేరు ఒకటి పెట్టుకుని ,ఇన్ని పూలు , ఎవడో రాసిన కొటేషన్ లతో ఉన్న రెడి మేడ్ కార్డులు పట్టుకుని మోహ ప్రదర్శనకు రోడ్లెక్కి ,తమలోని విచ్చల విడి తన్నాన్ని చూపించటమే వాలెంటైన్స్ డే అనే ప్రేమికుల దినం లక్ష్యం అయింది . ఇది ఖచ్చితంగా వాలెంటైన్స్ ఆశయాలకు విరుద్దం . నిజంగా వాలెంటైన్స్ మీద గౌరవ అభిమానాలు ఉన్న వారు ,తాము ప్రేమిస్తున్న వారిన్ని పిబ్రవరి 14 న వివాహం చేసుకోవాలి . కాని ప్రేమికులు  అని రొడ్లెక్కుతున్న వారు అ పని చేయటం లేదు కాబట్టే , నిజమైన వాలెంటైన్ అభిమానులు పుస్తెలు పట్టుకుని తిరుగుతూ ప్రేమికులను పెండ్లి చేసుకొమ్మని కోరుతున్నారు .

  ఇప్పుడు చెప్పండి .పిబ్రవరి 14 న ఎవరు  వాలెంటైన్స్ కి నిజమైన నివాళులు  అర్పిస్తున్నారు. పువ్వులు పట్టుకు తిరిగే వారా ?పుస్తెలు పట్టుకు తిరిగే వారా ? ఈ క్రింది వీడియోను చూస్తె   వాలెంటైన్స్ డే అంటె పువ్వులు పట్టుకుని తిరగడం కాదు ! పుస్తెలు పట్టుకుని తిరగడం !   అని అనిపించడం ఖాయం .


               
                           

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

పెళ్లి అంటే"పిచ్చి పని", మగాడు అంటే "సెక్స్ కోసం వాడి పారేసే వేస్ట్ పేపర్".అంటా!