10 సార్లు "విజ్ణాన మృగాలు "ఆమె మీద జరిపిన దాష్టికంలొ ,ప్రతి సారి ఆమెకు 20 పక్కటెముకలు విరిగినంత బాదట !
ఆమె ఒక గిరిజన మహిళ . జార్ఖండ్ రాష్ట్రం లోని ,గుమ్లా జిల్లాలో పత్రు అనే గ్రామానికి చేందిన ఈమే జీవిత గాధ కడు దయనియమైనది . మానవత్వానికే మాయని మచ్చగా మిగిలిపోయే దురదృష్ట కర సంఘటనలు ఈమె జీవితంలో జరిగాయి . మనిషికి అబ్బిన శాస్త్రీయ విజ్ఞానం ఈమెను పిల్లల్ని కని ఇచ్చె యంత్రంగా మార్చి పారేసింది . 6 గురు పిల్లల్ని కన్నా ఈమె తల్లి కాలేక పోయింది అంటే అది విజ్ణాన మృగాల మహిమే . విషయం లోకి వెళితే :
పైన తెల్పిన గిరిజన మహిళ వయసు ప్రస్తుతం 31 సంవత్సరాలు .ఆమె తన 13 యేటనుంచే పిల్లల్ని కనడం ప్రారంభించింది .కాని అది సాంప్రదాయ పద్దతిలో పెండ్లి చేసుకుని , తమ కుటుంభం అబివృద్ది కోసం పిల్లలు ను కనే పద్దతి కాదు .పెండ్లి కాకుండానే ,ఇంటి నుంచి డిల్లి నగరానికి తరలించబడి , అక్కడఅరోగ్య రీత్యా పిల్లల్ని కనలేని వారికి, పిల్లల్ని కంటె అందం తరిగి పోతుందనే వారి కోసం "సరోగసి " పద్దతిలో పిల్లల్ని కని ,ఆరు నెలలు పాలు ఇచ్చి పెంచి ఇచ్చేదట .ఇలా 6 సార్లు పిల్లల్ని కని ఏజెంట్ లకు ఇచ్చిం ది అట.
13 యేండ్ల వయసులో ఉన్నప్పుడు ఇంట్లో పనిమనిషిగా కుడురుస్తాం కి అనిచెప్పి ఒక ఏజెంట్ ఈమెను డిల్లికి తీసుకు వెళ్లి పైసలకు పిల్లల్ని కనే యంత్రంగా మార్చి పారేశాడు . ఈ సరోగసి వ్యాపారం లో ఏజెంట్ లకు ,డాక్టర్లకు లక్షలాది రూపాయలు ముడుతుంటే ,బాదిత స్త్రీలకు మాత్రం వేలు రూపాయల్లోనే ప్రతి పలం ఉంటుంది . ఈమె కన్న 6 గురు పిల్లలను ఎవరు కొనుక్కు వెళ్ళారో కూడా ఈమెకు తెలియదట .చివరకు స్వచ్చంద సేవా సంస్తల సహకారంతో ఈమె గుమ్లా లోని చైల్డ్ వెల్పేర్ కమిటికి పిర్యాదు చేస్తే ,వారు ఈమె కేసును దర్యాప్తు చేస్తున్నారు అట.
కొన్ని మహిళా హక్కుల సంస్తల లెక్కల ప్రకారం ఏటా 10,000 మంది ఆడపిల్లలు డిల్లి నగరానికి తరలించబడుతున్నారు అట . వారిలో ఇండ్లలో పనిచేసే వారు తక్కువుగా ,సెక్స్ వ్యాపారం కోసం ఎక్కువుగా వినియొగిo చబడుతున్నారు అట. మరి వారిలో ఎంత మంది సరొగేట్ మదర్ లుగా మారి పోయి తమ ఆరోగ్యాలను ,అమ్మ తనాన్ని పణంగా పెడుతున్నారో తెలియ చేయటానికి సరి అయిన లెక్కలు లేవు .
ఇంకొక కేసులో ఒక అమ్మాయిని 8 సంవత్సారాల వయసులోనే నగరానికి తీసుకు వెళ్లి ,అక్కడ కొంత కాలమ్వేరే పని చెయించాక ,సరోగాసి మదర్ గా మార్చి వేసారు అట . అలా 28 యేండ్లు వచ్చే సరికి ఆమె 10 మంది పిల్లలకు జన్మను ఇచ్చి పరుల పాలు చెసింది . అలా ఒక గిరిజన మహిళా వలన కోట్ల రూపాయల గడించిన డాక్టర్లు ,ఏజెంట్లకు లాభమే తప్పా నష్టం ఏమి లేదు . అలాగే డబ్బు పోసి పరాయి స్త్రీ చేత సంతానం పొందిన వారుకూడా ,ఏమాత్రం నొప్పి లేకుండా పిల్లల్ని పొంది తమ వారసత్వాన్ని వృద్ది చేసుకుంటున్నారు .కాని కేవలం నామ మాత్ర వేల రూపాయలతో నవ మాసాలు మోసి పిల్లలని కనటం ఎంత బాదా కరమో పైన ఇచ్చిన చిత్రంలోని సమాచారం తెలుపుతుంది .పిల్లలని కంటున్న ప్రతి సారి ,తల్లికి 20 పక్కటెముకలు విరిగి నంత బాద కలుగుతుంది అట . మరి 10 సార్లు ఆ గిరిజన మహిళా అలా కని ఇచ్చింది అంటే ఎంత అమానవియామో అర్ధం చేసుకొంది .
సాక్షి మహారాజ్ అనే వ్యక్తీ ,ప్రతి హిందూ మహిళా 4 గురు పిల్లల్ని కనమని మాట అన్నందుకే ,అంతెత్తున ఎగిరి పడి నానా యాగి చేసిన జన విజ్ఞాన వేదిక లాంటి సంస్తలకు ,వైద్యులు ,ఏజెంట్లు రూపంలో ఉన్న 'విజ్ఞాన మృగాలు ' అమాయక స్త్రీల మిద జరుపుతున్న ఇటువంటి దాష్టికాలు గురించి ఎందుకు నోరు మెదపరు? వాటి గురించి ప్రశ్నిస్తే , శాస్త్రీయ విజ్ఞానం పేరున జరుగుతున్న దోపిడీ బయట పడుతుందని ,అలా జరిగితే డాక్టర్ల వ్యాపారాలు దెబ్బ తింటాయని విజ్ఞాన బాబుల బయం . మరి వీరి ఆగడాలు అరి కట్టె రోజు అతి తొందర లోనే వస్తుంది అని ఆశిద్దాం .
సోర్స్: http://www.hindustantimes.com/india-news/tribal-girls-forced-to-conceive-deliver-babies-for-sale/article1-1320239.aspx
Comments
Post a Comment