"మేనక " లు ముందు "యోగా " పని చేస్తుందా , మురళి మనోహర్ జోషి గారూ !!!?


                                                                       

నిన్న BJP పార్టీ వృద్ద నేత ,మాజీ మంత్రి వర్యులు అయిన శ్రీ మురళీ మనోహర్ జోషి గారు ,దేశంలో లో పెరిగిపోతున్న అత్యాచారాల నివారణకు ఒక కొత్త చిట్కా చెప్పారు . పురుషులు గనుక రోజూ యోగా చెస్తే ,వారిలో ని మృగత్వం నశించి మానవత్వం పరిడవిల్లు తుందని ,దాని వలన దేశంలో అత్యాచారాలు పూర్తిగా అగకపోయినా ,వాటి రేటు గణనీయంగా పడి పోతుందని సెలవు ఇచ్చారు .చాలా బాగుందే చిట్కా అనుకున్నాను .

   కాని అంతలోనే ఒక డౌట్ వచ్చింది . మరి అదే నిజమయితే యోగా గురువులు ఉన్న ఆశ్రమాలలో అత్యాచారాలు ఎందుకు జరుగుతున్నాయి? దానికి కారణం ఒకటే . కొంత మంది స్త్రీలు ప్రవర్తించే తీరును కొంత మంది పురుషులు తప్పుగా అర్ధం చేసుకోవడం ఒక కారణమయితే , మితి మీరిన స్వేచ్చా బావనలు ,మితి మీరిన స్త్రీ పురుషుల సన్నిహితత్వం  వారిని ఒక బలహీన పరిస్తితుల్లోకి నెట్టడం లాంటివి స్త్రీల మీద అత్యాచారాలు జరగడానికి అవకాశం కల్పిస్తున్నాయి . స్త్రీ పురుషుల మద్య ఉండే సహజ లైంగిక ఆకర్షణలు పట్టించుకోకుండా ,స్త్రీ అయినా , పురుషుడు అయినా స్నేహం స్నేహమే అని ,వారు కలసి ఉన్నంత మాత్రానా ,తప్పులు ఎందుకు జరుగుతాయి ? అని ప్రశ్నించె "అసహజ వాదం  " ,అత్యాచారాలకు కేవలం పురుషులనే బాద్యులుగా చేస్తూ ,స్త్రీలను వెనకేసుకు రావడం వలన ,దేశంలో స్త్రీల మీద లైంగిక దాడులు విపరీతంగా పెరుగుతున్నాయే తప్పా తరగడం లేదు .

 స్త్రీల ప్రవర్తన ,అది ఏ రూపంలో అయినా సరే ఓవర్ గా అనిపిస్తే ,దానిని ఇండియాలోని సగటు మగాడు తప్పుగానే అర్ధం చేసుకుంటాడు . స్త్రీలు ఎప్పుడూ తమలోని ఇష్టాన్ని డైరెక్టుగా చెప్పరని,వారి చేష్టలు ద్వారాయే వారిని అంచనా వేయాలని సగటు మగాడి స్ట్రాంగ్ పీలింగ్ . అందుకే చాలా మంది మగాళ్ళు తమతో తిరిగే గర్ల్ ప్రెండ్ లను కాని , చనువుగా ఉండే పరాయి స్త్రీలను  కాని  నీచమైన బావO తోనే చూస్తారు . అలాగే బాయ్ ప్రెండ్లు ఉన్న స్త్రీలను కూడా ఎక్కువ మంది పురుషులు "కారెక్టర్ లెస్ గర్ల్ ' గానే కౌంట్ చేస్తారు . బాయ్ ప్రెండ్స్ తో తిరిగే గర్ల్ ప్రెండ్స్ మీద అత్యాచారాలు ఎక్కువుగా జరగటానికి ఇదే కారణం కావచ్చు . కార్పోరేట్ కల్చర్ ఉన్న నగరాల్లో ఎక్కువుగా ఈ తరహ కేసులే నమోదు అవుతున్నాయి .

 ఇంకొక విషయం ఏమిటంటే అత్యాచార నేరాల్లో ,బాదిత స్త్రీల ప్రవర్తనను పరిగణలోకి తీసుకోరాదు అనే వాదం కూడా లోప భూయిష్టమైనదే.అమాయకురాలు అయిన  గృహిణి మీద జరిగే అత్యాచారానికి , వ్యభిచారం తో జీవనం సాగించే స్త్రీ మీద జరిగే అత్యాచారానికి ఒకటే శిక్ష అంటే దానికంటే అసహేతుకత మరొకటి ఉండదు . నా వ్యక్తీ గత అభిప్రాయం అయితే మొదటి కేసు విషయంలో మ్రుగాడికి "ఉరిశిక్ష " విదించాలి ,రెండవ కేసు విషయంలో 2 సంవత్సరాలు జైలు శిక్ష విదించాలి . అలా నేర స్మృతులు  ఉంటే తప్పకుండా సమాజంలో గణనీయ మైన  మార్పులు కనపడే అవకాశ ముంది . నైతిక జీవనం అనేది వ్యక్తీ గత అంశం కాదు సమాజపు అవసరం . తమను తాము నియత్రించుకోని వారికి సంపూర్ణ స్వేచ్చను సమాజం నుండి కోరే హక్కు ఉండరాదు .

 పూర్వం దేవతల రాజు అయిన ఇంద్రుడు ,తన పదవికి విశ్వామిత్రుడి తపో దీక్ష వలన గండం ఉందని ,"మేనక" అనే దేవ వేశ్యను , ముని కి తపో బంగం చేయమని పంపుతాడు . అత్యంత నిష్టా గరిష్ఠుడైన అ తాపసి ,మేనక ఒలికించే వయ్యారాలకు ,వంపు సొంపులకు తాళలెక ,ఎంతో శక్తి వంతం కానున్న తన తపో దీక్షను చాలించి ,ఆమె మోహంలో బందీ అవుతాడు . అటువంటి గొప్ప మునీశ్వరుడే ఆడదాని ఒంపు లకు వO గిపోతే ఆప్ట్రాల్ సగటు మగాళ్ళేo త? ఈ నాటి కొంత మంది స్త్రీలు మానసికంగా "మేనక "లు కాకపోయినా ,బయట సమాజంలో వారు ప్రవర్తిస్తున్న తీరు ,వారు అటువంటి వారే అన్న అపోహ కలిగించడం వలన ,వారికి మ్రుగాళ్ళ వలన కష్టాలు ఎదురవుతూ ఉన్నాయి .వీటి మీద ఒక సమగ్ర సర్వే నిర్వహిస్తే చాలా విషయాలు బయట పడతాయి  , వాటిని విశ్లేషించి ,  స్త్రీ పురుషుల ప్రవర్తనలను నియంత్రించే కొన్ని నిబందనలు చట్టం లో పొందు పరచుకోవడం  అందరికీ శ్రేయో దాయకమ్. .లేకుంటె భారతదేశం లో స్త్రీ రక్షణ అనేది రాజకీయ పార్తీలకు మాత్రమే పనికొచ్చే  అంశం  లాగా మారి పోయే ప్రమాద ముంది .  

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన