"సుంకాలమ్మ తల్లి" గుడి పడగొట్టిన, "గాలి పార్టి" గాలిలో కలిసింది!.
మనిషి ఎంత గొప్పవడైనా కావచ్చు. ఎన్ని కోట్లైనా సంపాదించవచ్చు.తాను ఎల్ల జగతికి మకుటం లేని మహారాజు కావచ్చు. కాని భక్తులు కొలిచే ఒక అమ్మవ్వరి గుడిని తన అక్రమ సంపాదన కోసం కూల్చివేసి, చెప్పలేని మహా అపరాదం చేస్తే ఏమీ కాదనుకోవడం అది భ్రమే అవుతుంది అని నిరూపించాయి నేటి కర్ణాటక ఎన్నికల పలితాలు. గాలి జనార్ధన్ రెడ్డి, ’ది గ్రేట్ మైనింగ్ కింగ్’. ఆయన అనుమతి లేనిదే కన్నడ ప్రబుత్వం కాలు కదపలేదు. నోరు మెదపలేదు. దేశంలోని ప్రతిపక్ష పార్టీని ఒక పదకం ప్రకారం కన్నడ దేశంలో అదికార పార్టీగా మార్చి, తాను అదిపతి అయి,ఇటూ ఆంద్రా లోని అధికార పార్టికి చెందిన తన సామాజిక వర్గం వారి అండదండలతో, అనతి కాలంలోనే, ...