"సుంకాలమ్మ తల్లి" గుడి పడగొట్టిన, "గాలి పార్టి" గాలిలో కలిసింది!.                                                                 

  మనిషి ఎంత గొప్పవడైనా కావచ్చు. ఎన్ని కోట్లైనా సంపాదించవచ్చు.తాను ఎల్ల జగతికి మకుటం లేని మహారాజు కావచ్చు. కాని భక్తులు కొలిచే ఒక అమ్మవ్వరి గుడిని తన అక్రమ సంపాదన కోసం కూల్చివేసి, చెప్పలేని మహా అపరాదం చేస్తే ఏమీ కాదనుకోవడం అది భ్రమే అవుతుంది అని నిరూపించాయి నేటి కర్ణాటక ఎన్నికల పలితాలు.

  గాలి జనార్ధన్ రెడ్డి, ’ది గ్రేట్ మైనింగ్ కింగ్’. ఆయన అనుమతి లేనిదే కన్నడ ప్రబుత్వం కాలు కదపలేదు. నోరు మెదపలేదు. దేశంలోని ప్రతిపక్ష పార్టీని ఒక పదకం ప్రకారం కన్నడ దేశంలో అదికార పార్టీగా మార్చి, తాను అదిపతి అయి,ఇటూ ఆంద్రా లోని అధికార పార్టికి చెందిన  తన సామాజిక వర్గం వారి అండదండలతో, అనతి కాలంలోనే, తిరుగులేని మైనింగ మాఫియా కింగ్ అయి, రెండూ రాష్ట్రాల సరిహద్దులను అక్రమంగా చెరిపివేసి, ఇనుపఖనిజాన్ని కొల్లగొట్టి, కోట్లకు అదిపతిగా మరాడు. ఆ అక్రమ,సంపాదన గర్వంతో తాను ఏమిచేస్తే అదే చెల్లుబాటు అని, మైనింగ్ పనులకు అడ్డంగా ఉందన్న నెపంతో అడవిలోని "సుంకాలమ్మ తల్లి" గుడి ని కూల్చి వేశారు ది గ్రేట్ గాలి బ్రదర్స్. అప్పుడే మొదలైంది వారి పతనానికి ఆరంభ కార్యం.

  ఆ తల్లి ఆగ్రహా పలితమే ఉదయం ఆరుగంటలకు రెండుకోట్ల విలువ చేసే కుర్చీలో కూర్చున్న గాలి జనార్హన్ రెడ్డిని, సాయంత్రం అరయ్యే లోపు ఆంద్రా జైల్లో పడవేసింది. అంతేనా! అది మొదలు ఆయన మైనింగ్ పనులన్నీ సుప్రీమ్ కోర్ట్ రూపంలో చుట్టబెట్టేసింది. ఎన్నిక్కల్లో సత్తా చాటి, ప్రజల్లో తనకెంత బలముందో నిరూపించుకోవాలని ఆశపడిన వారికి పూర్తీగా చుక్కలు చూపించింది. వారి పార్టీ కనీసం సోదిలోకి రాకుండా పోయింది. కేవళం రెండు మూడు సీట్లతో దిక్కులేని పక్షి లాగ మరింది. ఇప్పుడు అటు చట్ట బలం, ఇటూ జనబలం కి దూరమై ’గాలి పార్టీ" గాలి గాలి అయింది. ఎంతవారలైనా దేవుని ఎదిరించి ఏమీ చెయ్యలేరనడానికి గాలి ఉదంతమే మంచి ఉదాహరణ కావాలి.

    సుంకాలమ్మ తల్లీ, పాహిమాం, పాహిమాం!( కర్ణాటక ఎన్నికల పలితాలను దైవ కోణం లో విశ్లేషించడమైనది)      

Comments

Popular Posts

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

తిరుమల దేవస్థానం వివాదాన్ని, కమ్మ ,బ్రాహ్మణ సామాజిక వర్గాల మధ్య జరిగే వివాదంగా చూడటం ఎంతవరకు సమంజసం?

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

తమ్ముడ్ని పెండ్లాడి, అన్న మీద మనసు పడితే చివరకు జరిగేది ఇదే!.

మరిది పెండ్లిలో వదిన ముద్దు పెట్టినందుకు , మరిది పెళ్లి మటాష్ అయి , బందువులంతా బాదుకున్నారట!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

బాయ్ ప్రెండ్ ఇంట్లో పడుకున్న 16 యేండ్ల అమ్మాయి కి , 30 మంది రేప్ చేసాక కాని మెలుకువ రాలేదట!!!?

స్త్రీ స్వేచ్చా , స్త్రీ స్వేచ్చా , ఎంతవరకు వెళ్ళావు అంటే "కొడుకు వయసున్న వాడితో కడుపు తెచ్చుకునే దాకా" అన్నట్లు ఉంది ఈ 'అతి'వ చేసిన పని !!?

స్త్రీ ని నగ్నంగా చూపించటం అశ్లీలం కాదన్న సుప్రీం కోర్టు

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?