నిజంగా కష్టకాలం ఎవ్వరికి? జగన్ కా! షర్మిలకా?


                                                                     

  మనం కొన్న విషయాలను సాదారణ ద్రుష్టో చూస్తే ఒక తీరుగా అనిపించవచ్చు. కాని దానినే ఇంకొక కోణంలొ ఆలోచిస్తే ఇంకొక తీరుగా అనిపించ వచ్చు. మొత్తానికి ఏ విషయం మీదైనా సమగ్ర ద్రుష్టి కావాలంటే, అన్ని కోణాలోనుంచి విషయ పరిశీలన చెయ్యడం అవసరం.

   ఈ రోజు పాపం జగన్ గారి అభిమానులు ఎంతో ఆశగా చూశారు. జగన్ గార్కి బెయిల్ వస్తుందేమోనని!. కాని వారికి నిరాశనే మిగులుస్తూ, సుప్రీం కోర్టు వారు మరో         రోజులు వేచి చూడ మన్నారు. ఏది ఏమైనా జగన్ గారు చట్టానికి సహకరిస్తున్న "నిందితుడు" మాత్రమే, "నేరస్తుడు" కాదు. కాబట్టి త్వరగా దర్యాప్తు ముగించలేకపోవడం "సి.బి.ఐ. వారు చిన్నపుచ్చుకోవలసిన అంశమే తప్పా, జగన్ గారు కాని, వారి అబిమానులు కాని బాద పడాల్సింది ఏమి లేకపోవచ్చు."డబ్బున్న వాడు జైల్ లో ఉన్నా, బెయిల్ పై ఉన్నా ఇండియాలో తేడా ఉండదు" అని అంటుంటారు  అనుభవజ్ణులు . అసలు నన్నడిగితే జగన్ గారు చాలా అద్రుష్ట వంతులు. ఎలాగంటారా?

  అసలే ఈ యేడాది ఎండలు మెండుగా ఉన్నాయి. ఇంట్లో ఉన్న మనకే (ఎ.సి. లేని వారికి), ఠారెత్తి పోతుంది. మరి ఈ ఎండల్లో బయట తిరగాలంటే మాటలా? ఒక వేళా జగన్ గారు బయట ఉంటే ఏమి చెయ్యాలి. ఇప్పుడు షర్మిలమ్మ చేస్తున్న పాద యాత్ర తను చెయ్యాల్శి వచ్చేది. రోజుకు కనీసమ్  పది కిలోమీటర్లు పాదయాత్ర అంటే మాటలా? రంగు మారుద్ది! మరి భగవంతుడు ఆ బాద నుండి తప్పించడానికే జగన్ కి బెయిల్ రాకుండా చేస్తున్నాడేమో! పాపం ఎండ కన్నెరగని, చెల్లెలు షర్మిల అన్న చెయ్యాల్సిన పనిని తాను బుజాన వేసుకుని  పడరాని పట్లు పడుతుంది. చుట్తూ ఎంత  మందీ మార్బలం ఉన్నా, ఎండనుండి కాపాడ లేరుగా. కోరి తెచ్చుకున్నా  కష్టాన్ని ఎవరు మాత్రం తీర్చ గలరు? అందుకే జగన్, షర్మిలాల "రక్తసంబందం" కష్టాలు రక్తి కట్టిస్తే  రానున్న ఎలెక్షన్లో  "జెయిల్లో అన్న, జనంలో చెల్లి" అనే సినిమా హిట్టయి, ఓట్లే ఓట్లు. రానున్న ఐదేళ్లు  అన్నా చెల్లెల్లకు  జనం హారతులే, హారతులు!.


      

Comments

Popular Posts

దర్శకుడు 'ప్రకాష్ ఝా' దర్శకత్వం లో నటుడు తుషార్ కపూర్ నటించిన ఎపిసోడ్ " ఆలి లేని అబ్బ కి అమ్మ లేని బాబు" !!!

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

వైద్యుడు మోసకారి అయితే వైద్య శాస్త్రం మోసమవుతుందా?

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన

గోత్రం తెలియక తాతతోనే డేటింగ్ చేసిన మనవరాలు !

మన రాష్ట్రంలో ట్రెజరీ జీతాల కోసం "చర్చ్ పాధర్ " లు రోడ్లెక్కిన సందర్బాలు ఎప్పుడైనా చూసారా ??

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

ఇంగ్లీష్ దుస్తులు వేసుకుని "Happy New Year " అంటే , కన్నడ కేకలు వేస్తూ వెంటపడి వేధించారు అట !

వారిది"కులబద్దం",వీరిది"రాజ్యాంగబద్దం".

స్త్రీ స్వేచ్చ