గోవుల్ని కాపాడలేని వారు, గోవిందుని ఆస్తులు కాపాడగలరా?


                                                             
                                                              

  ఈ రోజు మన దేవాదాయ శాఖా మంత్రి గారి స్టేట్మెంట్ చూస్తే చాల ఆశ్చర్యం వేసింది. సింహా చలం అప్పన్న సాక్షిగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారి నిర్లక్ష్యానికి, చేతకాని తనానికి గుర్తుగా దేవస్తాన గోశాల లోని  గోవులు మరణిస్తే, ఇక రాష్ట్రంలో  దేవాలయల గోశాలలో ఉన్న గోవుల్ని కాపాడడం తమ డిపార్ట్మెంట్ వల్ల కాదని తేలుస్తూ,సదరు గోవుల్ని కాపాడడానికి స్వచ్చంద సంస్తలు ముందుకు రావల్సిందిగా విజ్ణప్తి చేసారు మన రాష్ట్ర దేవాదాయ దర్మాదాయ శాఖామాత్యులు! ఈ విషయంలో నిజాన్ని నిజయీతిగా ఒప్పుకున్నందుకు మంత్రి గారికి రాష్ట్రంలోని హిందువులంతా దన్యవాదాలు తెలపాలి.

   ఏదైనా సరే ఆదాయం వచ్చేవాటికి ఎండొమేంట్ డిపార్ట్మెంట్ వారు పెద్దకొడుకుల్లాగా ముందుకొస్తారు. భక్తుల ఆద్వర్యంలో సమర్దవంతంగా నిర్వహించబడుతున్న మత సంస్తలైనా సరే, చాటు మాటు రాజకీయాలను ప్రేరెపించి సంస్తలను ఎండోమెంట్ పరిదిలోకి తీసుకు వచ్చే దాక నిద్రపోరు ఘనమైన అదికార్లు. కాని అదే డిపార్ట్మెంట్ వారు ఆదాయం లేని గుళ్ళను కనీసం కన్నెత్తి చూడరు సరికదా అటువంటి వాటి నిర్వహణ కోసం దత్తతలు ఇచ్చే పదకాలు పెట్టి,భక్తులకు అప్ప చెపుతారు.చేత కాని ఈ అధికారుల ద్వంద నీతి వల్ల దేవాలయ వ్యవస్త బ్రష్టు పట్టి పోయింది.

  ఇప్పుడు సాక్షాత్ దేవతా రూపంగా హిందువులు ఆరాదించే "గోమాత" లకు అదే దుర్దశ పట్టింది. గోవులను వదించే కసాయి వాడికన్నా పరమ పాపులు సింహాచలం లోని గోశాలా పర్యవేక్షణాదికారులు. వారికి రౌరవాది నరకం తప్పదు.ఏదో  కంటి తుడుపు చర్యగా ఒకరిద్దర్ని సస్పెండ్ చేసినంత మాత్రానా వాళ్ళ పాపాలు  పరిహారం కావు.గోవుల్ని కాపడలేని వీరా దేవాలయ అస్తులు, అసక్తులు కాపాడెది? ఇటువంటి అదికారుల్ని నమ్మా, హిందువులంతా గుండెల మిద చేతులు వేసుకుని నిద్ర పోతున్నది?.

  ప్రతి పట్టణంలో ముఖ్య కూడళ్ళలో దేవాలయాల ఆస్తులు, స్తలాలు ఉన్నాయి. కాని అవి రికార్డుల ప్రకారమే తప్ప ఎక్కడా దేవాలయ ఆదీనంలో కనపడవు. అధికారుల అండతో వాటిని ఆక్రమించిన బడా బాబులను డిపార్ట్ మెంట్ ఏమిచెయ్యలేదు. పైపెచ్చు వారు విదిలించే నజరానాలకు ఆసపడి వారికే వత్తాసు పలుకుతుంటారు. కోర్టులు కేసులు అన్నీ తూ తూ మాయలే.మరి ఇటువంటి వారి అవసరం మన హిందూ మతానికి ఉందా? మన సంస్తలను కాపాడుకోలేని చేత కాని స్తితిలో మన మున్నామా? అన్య మతస్తులు, సేవా కార్యాక్రమాలు పేరిట ఎకరాలు ఎకరాలు పొందుతుంటే మనం మాత్రం ఉన్నవి పోగొట్టుకుని దిక్కులేని వాళ;లాగా డిపార్ట్మెంట్ మీద ఆదారపడుతున్నాం. రాజకీయాలకు మతానికి సరి అయిన విభజన రేఖ గీయక పోతే మత సంస్తలను కాపాడు కోవడం కష్టం.

   అంద్ర ప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ దర్మాదాయ శాఖామాత్యులకు హిందువులంతా ముక్త కంఠం తో కోరాల్సింది ఒకటే "అయ్యా! మీరు తక్షణమే మా గోవుల్నే కాదు, మత సంస్తలు అన్నింటిని భక్తులకు స్వయం ప్రతి పత్తి అధికారాలతో అప్ప చెపితే మేము వాటిని కాపాడుకోవడానికి, అభివ్రుద్ది పరచడానికి,  ఎల్లప్పుడూ సిద్దంగా ఉన్నాం" అని.    

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన