దండలు వేసుకుంటే, పెండ్లి చేసుకున్నట్లయితే,బండలు వేసుకుంటే విడాకులు తీసుకున్నట్లా?
అప్పుడప్పుడు మన కె.సి.ఆర్. అన్న కొత్త కొత్త నిర్వచనాలు ఇస్తుంటారు. అలాంటిదే నిన్న పెండ్లి సందర్బంగా అయన ఇచ్చిన నిర్వచనం. నిన్న ఆయన గారు ఏదో పెండ్లికి అహ్వానిస్తే వెళ్ళి నట్లుంది.అక్కడ తెలంగాణా గురించి కాని, రాజకీయాలు గురించి కాని మాట్లాడడానికి సందర్బం కాదనుకున్నట్లుంది. మరి ఏమి సందేశం ఇవ్వాలా అని ఆలోచించి నట్లుంది. నలుగురికి నచ్చినది తనకు ఎలాగు నచ్చదు, కాబట్టి అసలు ఈ తాళి కడితే నే పెండ్లి అయినట్లు బావించమనే సిద్దాంతం ఎకాడినుంచి వచ్చిందా అని కించిత్ ఆలోచించ గా ఆయనకు చటుకున్న చిన్నప్పుడు చదువుకున్న చరిత్ర గుర్తుకు వచ్చింది. అంతే వెంటనే విషయం విడమరచి చెప్పే సరికి అక్కడున్న వరు తెల్లబోయారట!
ఇంతకి" తాళి కడితేనే ఆలి " అనే సాంప్రదాయం మనకు లేదట! పూర్వం జస్ట్ పూల దండలు మార్చుకుంటే,పెండ్లి అయినట్లు అంట! కాని రాను రాను ముస్లింల డండయాత్రల వల్ల , వారు కన్నెలను మాత్రమె చెరపట్టే గుణముంది కాబట్టి, కేవళం వారికి పెండ్లి అయిన స్త్రీ అని కనపడడం కోసమే తాలిబొట్ల సాంప్రదాయం మొదలైందట! ఆ తాలి బొట్లను చూసి వారు వారిని వదలి వేసే వారట! ఈ విదంగ మన స్త్రీలను మన రాజులు కాపాడలేకపోయినా, వారి భర్తలు కట్టిన తాలి బొట్లు కాపాడాయన మాట! శబాష్!
అయితే నాకిక్కడ ఒక దర్మ సందేహం ఏమిటంటే, కె. సి.ఆర్. గారు ఎప్పుడూ, "సత్య హరిశ్చంద్ర" నాటకం చూడడం కాని, ఆ కథను చదవడం కాని చెయ్య లేదనుకుంటా! బహూశా అది అంద్ర వాళ్ళ విరచితం అని దూరంగా నెట్టేసి ఉంటారు. ఆ "సత్య హరిశ్చంద్ర" లో ఫేమస్ సీన్ "కాటి సీను" . ఆ సీను లో ఒక పద్యం లో( పద్యం నాకు గుర్తు లేదు, ఎవరికైనా వస్తే కామెంట్ గా రాయగలరని మనవి) చివర్లో "అది నీ మాంగల్యం కాబోలు""అది నీ మాంగల్యం కాబోలు" అని నొక్కి నొక్కి పాడతారు. మరి ఈ సత్య హరిశ్చంద్ర కథ "మొగల్ దండయాత్రల తర్వాతిదా అంతకు ముందుదా? కె.సి.ఆర్. చరిత్రకారులు చెప్పాలి.
ఏమి తోచకపోతే పెండ్లికి పిలిచిన వారు పెట్టింది తిని, శుబ్రంగా మీఠా పాన్ వేసుకుని కుషీ చేసి రావాలి కాని, ఇలా కొత్త చరిత్రలు, నిర్వచనాలు సెలవిస్తే ఎలా అన్నా! దండలు మార్చుకుంటే పెండ్లి అయిపోతే ఇప్పుడు రాజకీయాలలో ఉన్న వారు రోజుకు ఎన్ని సార్లు ఎంత మందిని పెండ్లి చేసుకుంటున్నారో! కాకపోతే రేపు కె.సి.ఆర్. గారు తెలంగాణ వచ్చాక ఒక చట్టం చేస్తారేమో! అదేమిటంటే దండలు వేసుకుంటే, పెండ్లి చేసుకున్నట్లు,బండలు వేసుకుంటే విడాకులు తీసుకున్నట్లు అని ? అప్పుడు ఎంచక్కా విడాకులు తీసుకునే వారు "తలాక్" పద్దతి మాదిరి మూడు సారులు బండలు విసురుకుంటే విడాకులు ఇచ్చేసినట్లే!అహా..అహ..అహ..
Comments
Post a Comment