మంత్రాలకు చింత కాయలు రాలుతాయో లేదో కానీ , ఆ మహిళల బ్రతుకులు మాత్రం రాలిపోతున్నాయి !!
మంత్రాలకు చింతకాయలు రాలుతాయా ? ఇది మన పెద్దలు తరచూ వాడే మాట . వెనుకటి కాలం లో కొంతమంది హేతు దృక్పధం గలవారు , మంత్రాలు తంత్రాలు మీద నమ్మకం లేని వారి నోటినుండి పుట్టిన మాట కావచ్చు ఇది . చెట్టుమీద ఉన్న చింతకాయలు కావాలంటే చెట్టెక్కి కోసుకోవడమో , పెద్ద గడ పెట్టి కోయడమో చేయాలి కానీ , చెట్టు క్రిందకు వెళ్లి చింతకాయలు ను చూస్తూ మంత్రం పఠిస్తే అవి రాలవు కదా? అని దీనిలోని భావం. చింతకాయలు రాల్చె విషయం లో మంత్రాలు ఫెయిల్ కావచ్చేమో కానీ అన్య మతం ను పాటి స్తున్న మహిళల విషయం లో మాత్రం మంత్రం చాలా పవర్ఫుల్ గా పనిచేస్తుంది . కొన్ని శతాబ్దాలుగా ఆ మంత్రం పఠిస్తున్న ఆ మతం లోని పురుషులకు మంత్రం పారకపోవడం అన్న ప్రశ్నయే ఉత్పన్నం కాలేదు. 30 , 40 ఏండ్లు తనతో కలసి సంసారం చేసిన స్త్రీని అయినా సరే, లేకుంటే పెండ్లి అయి 2 గంటలు గడవని కన్యనైనా సరే , వారి భర్తలు ఆ మంత్రం పఠించి తమ మధ్య ఉన్న సంబంధాలను , అనుబంధాలను , అన్నింటిని పుట్టుకున్న త్రెంచి వేసి విజయగర్వం తో అట్ట