ఇకనుంచి, విడిగా ఉంటున్న భార్యను "రేప్ " చెస్తే , విపరీతమైన పబ్లిసిటి ఇస్తారట!
ఏమిటొ గాని రోజు రోజు కు కేంద్ర హోమ్ శాఖకు , భారతీయ న్యాయ వ్యవస్థ మీద నమ్మకం సన్నగిల్లుతునట్లు కనపడుతుంది. ఇండియాలో కోర్టులు కేసులు తొందరగా పరిష్కరించక పోవడం , అత్యాచార కేసులలో నిందితులు పెద్దమనుషులు లాగా సొసైటీలో చలామణి కావడం హోం శాఖకు ఏ మాత్రం నచ్చడం లేదు. భారతీయ న్యాయసూత్రాలలో ప్రదానమైనది "నేరం రుజువు కానంతవరకు నిందితుడు అమాయకుడే " . అలాగే నేరం రుజువు చేయాల్సిన బాద్యత ప్రాసిక్యూషన్ వారిదే. ఇదిగో ఈ కారణాలు చేతనే నిందితులు నేరస్తులుగా రుజువు అయ్యే వరకు కాలర్లు ఎగరేసుకుని తిరుగుతున్నారు . అందరి సంగతి ఏమో కాని రేపిస్ట్ లు కూడా అలా కాలర్ లు ఎగరేసుకు తిరగడాన్నికేంద్ర హోం శాఖ సహించలేక పోతుంది. అందుకే నేరం రుజువు అయిందని కోర్టులు ఇచ్చే తీర్పులతో పని లేకుండానే , చార్జిషీట్ లో ఉన్న ప్రతి నిందితుడు నేరస్తుడే అనే తీర్మానానికి వచ్చి, ఇక నుండి వారి పేర్లు , వారి రేప్ చరిత్రలను వెబ్సైట్ల...