విమానం లో "మానం " పోగొట్టుకున్న పెద్ద బిసినెస్ మాన్ !
అయన గారు ఒక పెద్ద బిసినెస్స్ మాగ్నెట్ . ఒరిస్సా రాష్ట్రం లోని భువనేశ్వర్ కు చెందిన వ్యక్తీ . వయసులో పెద్దవాడు .కాని ఆయనలో ఉన్న మగబుద్ది కి సంబందించిన మానసిక రోగం అతనిని కొంచపు వాడిని చేసింది . అంత మందిలో అయన చేసిన పని ఆయన్ని తల వంచుకునేలా చేయటమే కాక, బాదితురాలు అని చెప్పబడుతున్న ఆమె చేసిన ఒక తెలివి గల పని వలన ప్రపంచం ద్రుష్టిలో దోషిగా మారి పోయాడు .ఆయన చెప్పిన సారీ ఆమెను కరిగించ లేక పోయింది . తండ్రి వయసున్న అతనిది ఒక మానసిక రోగమని గుర్తించ లేక పోయింది .పబ్లిక్ గా ప్లైట్ లోనే అతనిని ఉతికి ఆరేసిన ఆమె, తన సెల్ తో అయన తల వంచుకున్న విదానాన్ని ,అయన చెప్పిన సారి ని ,చిత్రీకరించి సోషల్ మీడియాలో పెట్టి లక్షల లైక్ లు సాదించింది . ప్రపంచ వ్యాప్తంగా అయన స్నేహితులు ,బందువులు ద్రుష్టిలో అయన మానం (పరువు ) కోల్పో...