లాభాపేక్ష లేని "మేదో సంస్థకు అధిపతి అయిన 74 ఏండ్ల 'పచౌరి గారు', 29 ఏండ్ల చిన్న దాని చేతిలో చిత్తవడానికి "కామాపేక్షే " కారణమా?!!!

                                                                         

                                   నేను ఇదే బ్లాగులో "మగబుద్ది " గురించి టపాలు ప్రచురించడం జరిగింది. అందులో ఒక దానిలో :
ఎనిమిది ఏండ్ల వాడైనా , ఎనబై ఏళ్ళ వాడైనాసరే , వాడి కుండే "మగబుద్ది " తీరే అంత ! సందు దొరికితే చాలు ఆడదాన్ని కాటు వేయాలనే చూస్తుంది . పైకి ఎంత సంస్కార వంతులుగా, పెద్దమనిషిగా  కనిపించినా ,స్త్రీల పొందు విషయంలో మాత్రం వచ్చిన అవకాశం చచ్చినా వదులుకోడు . ఎందుకంటె పరాయి స్త్రీల పొందు వాడిలోని  మగ ఇగో ను సంతృప్తి పరస్తుంది . అందుకె ఇంట రంబ వంటి భార్య ఉన్నా , మగ వాడి చూపు వీదుల్లొ వెళ్ళె ఇంతుల పైనే ఉంతుంది . మగవాడి మనస్తత్వం విషయం లో మన పెద్దలు వాస్తవ ద్రుష్టి కలిగినవారు కాబట్టే ,తప్పుడు పనుల విషయంలో పురుషులను శిక్షిస్తూనె , స్త్రీలకు స్వయం రక్షిత విదానాలు కొన్ని సూచించారు . అవి ఒక్కొక్క సారి కష్టంగా అనిపించినాస్త్రీ  రక్షణ కోసం పాటించక తప్పదు .అందులో బాగమే వస్త్ర విదానం , సామాజిక కట్టుబాట్లను పాటించటం  వగైరా , వగైరా

      స్త్రీలకు బగవంతుడు ఇచ్చిన సహజ వరం ఒకటి ఉంది . అదేమిటంటే  కొత్తగా ఎవరైనా పురుషుడు పరిచయమైతే , అతని చూపులో మనసులో ఉన్న దుర్బుద్దిని  ఆతను చూచే చూపు ద్వారా లేక తన ఒంటిని తాకే విదానం ద్వారా .  వెంటనే పసి గట్ట గలుగుతుంది. తద్వారా  అతనికి దూరంగా ఉంటూ తనను కాపాడుకోగలుగుతుoది. రేప్ కేసులను కనుక మనం పరీలించినట్లైతె అదిక శాతం స్త్రీలు తమకు తెలిసిన లేక సన్నిహితుల వలననే అత్యాచారాలకు గురి కాబడ్డారు . పురుషులు కూడా స్త్రీలను నమ్మించటానికి తమలో లేని గుణాలను ఉన్నట్లు బ్రమింపచేస్తూ మాటలతో దగ్గరై , మగ బుద్ది  సంతృప్తి చెందాక దూరం అవుతారు . కాబట్టి ఇంట్లోను బయట "మోరల్ పోలిసింగ్ " ఉంటె చాలావరకు స్త్రీల  అగాయిత్యాలను అరికట్టవచ్చు ." అని చెప్పడం జరిగింది  (ఎనబై ఏండ్ల "తాత" ఏమి చేస్తాడులే అని ఇంట్లోకి రానిస్తే , "మగబుద్ది" చూపించి 15 యేండ్ల అమ్మాయిని "అమ్మ " ను చేసాడట !)

                                                                           

                                                         
                                                      పైన నేను నా టపాలో చెప్పిన బావాలను బల పరచే సంఘటణ మరొకటి ఇటివలే జరిగింది .దానికి సంబందించిన సమాచారమే పై చిత్రం.  అదేదో మామూలు సాదా సీదా మగవాడు చేస్తే  మనం అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు . దేశం లో ఉన్న మగవెదవల్లో వీడొ కడు అనుకునే వారు . కాని ఆయనొక వృద్ద మేదావి . పేరు రాజేంద్ర కుమార్ పచౌరీ . వయసు 74 యేండ్లు . టెరీ (TERI) అనే లాభాపేక్ష లేని మేదో సంస్థకు అధిపతి అతను. నోబెల్ బహుమతిని గెలుచుకున్న వాతావరణ మార్పుల అంతర ప్రుభుత్వ కమిటికి చైర్మన్ గా చేసిన ఘనత అతని సొంతం. ఇలా ఎంతో కీర్తీ ప్రతిష్టలను సంపాదించారు . అయితేనేమి ? తన క్రింద పని చేసే 29 ఏండ్ల మహిళా ఉద్యోగి చేతిలో చిక్కుపడి విల విల లాడుతున్నారు . కారణం ఆయనలోని మగబుద్ది . ఆయన తన లోని లాభాపేక్ష ను జయించగలిగాడేమో కాని కామాపేక్ష (మగబుద్ది ) ని జయించ లేకపోయాడు అనడానికి పైన చిత్రం లో ఉన్న సమాచారమే రుజువు. పోని ఆ అమ్మాయి ఏమన్నా తప్పుడు కేసు పెట్టిందా ? అంటె అలా ఆలోచించడానికి వీలు లేని రుజువులు ఉన్నట్లుంది. అందుకే టెరి సంస్త నియమించిన క్రమశిక్షణ కమిటి కూడా అయన ను దోషి గానే తేల్చి ఆయనను పదవి నుంది తప్పించదానికి వారు ఇచ్చిన రిపోర్ట్ ఆదారమయింది. 

      74 యేండ్ల వృద్ద మేదావి సైతం పోకిరి పోరగాళ్ళ మనస్తవం కలిగి ఉన్నారు అంటె అది దేని ప్రబావం? ఆయనలోని మగ బుద్ది ప్రబావం. జ్ఞానం లో ఎంత  డాక్టరేట్  లు అయినా , దీనిని కంట్రొల్లో పెట్టడం లో మాత్రం వారికి సాద్యం కావటం లేదు. ఇలా ఎందుకు జరుగుతుంది అనే దాని మీద ఇదివరకు ఒక టపాలో నా అభ్ప్రాయం చెప్పాను . అదేమిటంటే :

                                              "అసలు స్త్రీల పట్ల చాలా మంది మగాళ్ళు ఎందుకు  చంచల బుద్దితో  ప్రవరిస్తారు ? దీనికి పైకి చెప్పే కారణం ఒకటే . సంస్కార హీనులైన వారే అలా ప్రవర్తిస్తారు అని. కానీ ఎన్నో ఏండ్లుగా సంస్కారవంతులుగా చలామణీ అయిన వారు సహితం, స్త్రీల ఔన్నత్యాలు గురించి, పురుషుల కుసంస్కారాలు గురించి ఎడతెగని లెక్చరర్లు దంచిన వారు సహితం ఏదో ఒకనాడు హట్టాతుగా ఒక స్త్రీ పట్ల అనుచితంగా ప్రవర్తించాడు అన్న ఆరోపణలకు గురై అందరిని విస్మయ పరుస్తాడు. స్త్రీ పురుషుల మద్య ఆరోగ్యకరమైన సంబందాలు కొనసాగింపు విషయం లో మన పూర్వీకులకు ఉన్న అవగాహనలో అరవైయ వంతు కూడా  అడునికులకు లేదు అనిపిస్తుంది. కడుపున పుట్టిన కూతురైనా సరే ,  తండ్రి తో ఒకే మంచం మీడ పడుకోవటానికి అనుమతించరు పెద్దలు. ఎందుకని? ఆ తండ్రి మీద అనుమానం కాదు,అతనిలో ఉన్న "మగ బుద్ది " ని కంట్రోల్ లో పెట్టి కుటుంభ బందాలు ఆరోగ్యకరంగా సాగేందుకు ఏర్పరచుకున్న పద్దతి. అంతే !

  ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే  మొన్నీ మద్య సుప్రీంకోర్ట్ మాజీ న్యాయమూర్తి గారి మీద ఒక న్యాయ విద్యార్దిని లైంగిక ఆరోపణలు చేసింది. ఆమె గారు యేడాది క్రితం తను శిక్షణలో ఉన్న కాలం లో తనకు గురువుగా వ్యవహరించిన అప్పటి సుప్రీం కోర్టు జడ్జ్ అయిన ఒకాయన, తను అయన బస చేసిన హోటల్ రూం  కు వెళ్ళగా   తనతో అనుచితంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు చేసింది. దానికి స్పందించిన సుప్రీం కోర్టు వారు ముగ్గురు జడ్జ్  లతో   కూడిన ఒక విచారణ కమిటీ వేసారు. ఆ అమ్మాయి చెప్పిన దాని ప్రకారమే తను చేసే ఆరోపణలకు ప్రత్యక్ష సాక్షులు ఎవరూ లేరు. మరి ఆ ఆరోపణలు ఎలా రుజువు కావాలి? ఇది ఇలా ఉండగా ఇంకొక  మహిళా న్యాయవాది కూడా , తను శిక్షణలో ఉండగా కూడా  సదరు న్యాయమూర్తి గారు తనతో ఇలాగే ప్రవర్తించాడు అని పేస్ బుక్ లో చెప్పిందట! అది గడచి కూడా  కొన్ని సంవత్సరాలు అయింది అట . దానికీ  సాక్షులు లేరు. మరి ఈ  అమ్మాయిల ఆరోపణలు ఎలా రుజువు కావాలి? ఒకవేళ రుజువు కాలేక పోయినా, ఆ ఆరోపణలు నిజమైనా , కాకపోయినా  సంఘం లో సదరు న్యాయమూర్తి గారి పరువు ఖచ్చితంగా పోతుంది. అదే వారోపించిన వారి ఉద్దేశ్యం అయితే వారు సక్సెస్ అయినట్లే అని చెప్ప వచ్చు. ఆ ఆరోపణ చేసే అమ్మాయిలూ కూడా  కోరుతుంది ఏమిటంటే ఆ చంచల స్వబావుడైన న్యాయమూర్తి వద్దకు న్యాయ విద్యార్దిణులను బవిష్యత్ లో పంపించ వద్దని. అది జరిగినా చాలనే తమ లేట్ పిర్యాదుల ఉద్దేశ్యం అంటున్నారు.

    అసలు ఆ ఒక్క న్యాయ మూర్తే కాదు ఏ పురుష గురువులు , తమ స్త్రీ విద్యార్దినులతో ఏకాంతం గా కలిసే ఉండే విదానమే తప్పు అనే ఒక నిబందన ఉంటే ఇంత అవమానం ఆ గురువు కు కానీ, ఆ విద్యార్దినులకు కానీ జరిగి ఉండేది కాదుగా?   కానీ అలాంటి విదానం ఉండటానికి మనలోని అబ్యుదయ బావనలు ఒప్పుకోవు. ఆరోపణలు రుజువు కాకుండానే ఒక వ్యక్తిని నానా యాగీ చేసి పరువు తీయడానికి  మాత్రం అబ్యుదయం అడ్డు  రాదు.రేటింగ్ ల కోసం వెంపర లాడుతున్న మీడియా ఉన్న ఈ  కాలం లో అది అసాద్యం కూడా   స్త్రీ పురుషులు బహిరంగంగా  ముద్దు పెట్టుకోవడం   కామన్ అనే ప్రాశ్చ్యాత బావనలు మనం అంగీకరించనపుడు ,పరాయి  స్త్రీ పురుషులు ఏకాంతంగా   కలిసి ఉండడాన్ని మాత్రం ఎందుకు వ్యక్తీ  స్వేచ్చలో బాగంగా పరిగణించాలి? పురుషుని లోని "మగబుద్ది " ని కంట్రోల్ చేసే మన సాంప్రదాయ బావాల  లో బాగంగా మన చట్టాలు ఏర్పడి ఉంటే మనకు ఇటువంటి అవస్తలు ఉండేవి కావనుకుంటా? విదేశి బావ ప్రబావితం  తో ఏర్పరుచుకున్న చట్టాలు కాబట్టి , తప్పు చేసినా చేయక పోయనా శిక్ష మాత్రం అనుభవించి తీర వలసిందే".("మగబుద్దిని కంట్రోల్ చెయ్యాలంటే మగువలను దూరంగా ఉంచడం లాంటి సాంప్రదాయక విదానమే బెస్టా?).  

     అదీ విషయం. ఏ దేశంలో అయినా  చట్టాలు  వారి వారి  సంప్రాదాయాల   విదానాల  నుండి  ఏర్పడి ఉంటాయి. అంతే కాని ఎవడినో కాపీ కొట్టి చట్టాలు చేసుకుని , వాటినే అనుసరించాలి అంటే, ఇదిగో ఇలాగే చెప్పేదొకటి , చేసే దొకటి అవుతుంది. మన దేశం లోని మగ బుద్దిని సంస్కరించి తీరవలసిందే . అందులో ఎటువంటి అనుమానం లేదు. దానికి కొన్నీ ఏండ్లు పడుతుంది. అది సాద్యం కాదు అనే వారు కూడా లేక పోలేదు. సాద్యం అయినా అవక పోయినా , "పరాయి స్త్రీలు తల్లి లాంటి వారు " అనే మన సాంప్రదాయ బావనకు విలువ ఇచ్చి ఆ దిశగా మగ బుద్దిని ఆలోచించేలా చేయాలి. అప్పటి వరకు స్త్రీలకు  కూడా కొన్ని నియమ నిబందనలు ఉండాలిసిందే . అల్లాంటి నిబందనలు మేము ఒప్పుకోం . మా ఇష్టం వచ్చినట్లు మేము ఉంటాం . అని అంటె జరిగే నష్టాలు జరుగుతుంటాయి. మగవారికి శిక్షలు విదించగలరేమో కాని , వారి లోని మగ బుద్ది ని మార్చ లేరు. 

    ఏ మ్రుగాడు అయినా  ఒక అమ్మ కన్నకొడుకే . ఒక చెల్లికి అన్నే. వాడి లోని మగబుద్ది వాడికి మన సమాజం ఇచ్చిన వార్తసత్వ వ్యాది. దాని నుంచి వాడిని విముక్తుడిని చేయాల్సిన బాద్యత ఈ సమాజం పై ఉంది. కాబట్టి సమాజం లోని చివరి మ్రుగాడు మారేదాక స్త్రీలు కూడా సాంప్రదాయ కట్టు బాట్లల లో  అవసరమైన మేరకు అంటె స్వీయ రక్షణకు ఉపయోగ పడేవి ఆచరిస్తే మంచిది అని నా అభిప్రాయం .దానికి తోడు శిక్షలు కూడా కటినంగా , సత్వరమే అమలు అయ్యేలా చూస్తే , వీటి వలన మంచి పలితాలు వస్తాయి.  

     మగ బుద్ది పై నేను ప్రచురించిన ఇతర పోస్ట్ ల కోసం క్రింద "మగబుద్ది " లేబుల్ ని క్లిక్ చేసి చూడ గలరు. 


                                                    (24/7/2015 Post Republished).

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

మన రాష్ట్రంలో ట్రెజరీ జీతాల కోసం "చర్చ్ పాధర్ " లు రోడ్లెక్కిన సందర్బాలు ఎప్పుడైనా చూసారా ??

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన