దేవాలయాలు కంపెనీలు లాంటివా? బ్రాంచీలు పెట్టడానికి !

                                                               
                                                                   
                                                    

  తిరుమల తిరుపతి దేవస్తాన అధికారులకు ఈ మద్య భక్తి ఎక్కువవుతున్నట్లుంది. స్వామివారి మోడల్ దేవాలయాలు దేశం నలుమూలల ఏర్పాటు చెయ్యాలని బావిస్తున్నారట! బగవంతుడి మీద భక్తో, లేక వేరే మతలబులు ఏమన్నా ఉన్నాయేమో తెలియదు కాని స్వామివారి సొమ్మును ఏదో రకంగా ఖర్చు రాసేదామనే చూస్తుంటారు. మరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి కలలో కనపడి తనకు నలు దిక్కుల గుళ్ళను కట్టమని వీరిని అడిగాడా? ఎందుకు వీరికంత మంచి బుద్ది పుట్టింది. !

                 తిరుమల అనేది ఒక పవిత్ర క్షేత్రం. ఆళ్వారుల దర్శనం  ప్రకారం సూర్యమండలం నుండి  ఒక దివ్య తేజస్సు తిరుమల మీదకు ప్రసరించిందని, కాబట్టి అది తిరు(పవిత్ర)+ మలై (కొండ) అని వారు శ్లాఘించారు. మన పురాణాల ప్రకారం శ్రీనివాసుడు పద్మావతి పరిణయం తర్వాత, లక్శ్మీ దేవి తో జరిగిన సంవాదం చేత ఆ కొండపైనే శిల గా మారాడని చెపుతారు. ఏది ఏమైనా తిరుమల కేవళం విగ్రహ అర్చనా రీత్యా కాక ఆ కొండ ప్రాంతమంతా ఒక అలౌకిక ఆనందం కలిగించే విదంగా ఉండతం వలన అనేక దూర ప్రాంతాలు, దేశ విదేశాలనుండి భక్తులు రావడం జరుగుతుంది. అంతే కాని అక్కడి అధికారులు చేసే మర్యాదలకు మురిసి పోయి మాత్రం కాదు అనేది వాస్తవం.

                       అటువంటి క్షేత్రం అంటే ఆ సుందర అద్బుత మంగళాకారుడిని దర్శించ్కోవడానికి ,ఏదుకొండలు కూడ ఎక్కి వచ్చి దర్శించుకోవడానికి  భక్తులు ఉబలాట పడుతుంటే , అలా దర్శించుకోవడంలోనే తమకు నిజమయిన అలొఊకిక అనందం కలుగుతుందని వారు బావిస్తుంటే, ఈ అధికార్లు దేశం నలుమూలల ఆ దేవదేవుని ఆలయాలు కడతామని తలపోయడమేమిటి? దీని వలన భక్తుల ఆనందాన్ని హరింపచేసినట్లే. హిందువులంతా జీవితంలో ఒక సారైన కాశి వెళ్ళాలి అనుకుంటారు. అంతే కాని కాశి లో విశ్వనాదుని తీసుకువచ్చి ఒక గుడి మన రాష్ట్రంలో కడదామని కాశిలోని అధికార్లు అనుకుంటారా! మన అధికారులే అక్కడ ఉంటే, విశ్వనాదునే కాదు గంగ నదిని  కూడ ఇక్కడకు తీసుకువచ్చేవారేనేమో! దీని వలన క్షేత్ర పవిత్రత పోతుంది.

   ప్రతిది వ్యాపార ద్రుష్టితో చూసే వారిని దేవాలయాలో నియమిస్తే ఇలాంటి తలకు మాసిన ఆలోచనలే చేస్తారు. దేవాలయాలో ప్రతిదానికి టికట్లు పెట్టి అదాయాన్ని ఆర్జించేసరికి వాళ్లకి గుడి ఒక కార్పోరేట్ కంపెని లాగా అనిపిస్తుంది కాబోలు. అందుకే దేశవ్యాప్తంగా బ్రాంచ్ లు ఏర్పాటు చేసి అక్కడ తమ అస్మదియులను  నియమింపచేసి, దేవుడి అదాయానికి ఖర్చులు రాదామని చూస్తునట్లుంది. దీనికంటే  ఆ దేవదేవుని పేరు మీద సేవా కార్యక్రమలు,తద్వారా  హిందూ ధర్మ ప్రచారం చెస్తే మంచిది. ముందు మనరాష్ట్రం లో అనాదశరణాలయాలు, వైద్యాలయాలు ఆ స్వామి పేరు మీద స్తాపించండి. ఆ కేండ్రాలలో ఆ స్వామి వారి విగ్రహాలు ప్రతిష్టింప చేసి, ఆ చుట్టుపక్కల ప్రజలలో బక్తిబావాలు పెంపోదేలా చేయంది. ఇతర మతాల సేవాసంస్తల కన్నా మెరుగైన సేవలు అందించండి. అలా "మానవసేవే మాదవ సేవ" అనే నానుడుని నిజం చెయ్యండి.అలాగే మన రాష్ట్రం లోని ప్రతి దేవాలయం లో ఆ స్వామివారి పేరు మీద  దేవాలయ సందర్శకులకు ఉచిత బోజనం, ఉచితంగా మంచినీరు అందేలా చెయ్యంది. మత సేవలు అంటే ఉచిత సేవలు అని తెలిసేలా చెయ్యండి. ప్రతి సంవత్సరమ్ విదిగా ప్రతి హిందువు తిరుమల తిరుపతి వెళ్ళేలా చూడండి. అలా శ్రీ వారి సేవాసంస్తలు క్రమానుసారం దేశం నలుమూలల విస్తరించేలా చూడండి. అలా మత వ్యాప్తికి ఆలోచన చెయ్యలి తప్ప మోడల్ దేవాలయలు ఏమిటి! వినడానికే ఎబ్బెట్టుగా ఉంది.       



(14/6/2013 Post Republished).
   

Comments

Post a Comment

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

కలికాలం.. రివర్స్ కాలం..కాలజ్ఞానం