భాయ్ ప్రెండ్ కొనిచ్చిన బహుమతితోనే అతడిని 25 సార్లు కొట్టి ,కొట్టి చంపిన ముదురు గర్ల్ ప్రెండ్ !
అమెరికాను చాలా మంది "భూతల స్వర్గం "అంటుంటారు . అదే భూతల స్వర్గం ఇప్పుడు "భూతాల స్వర్గం " అయినట్లు కనిపస్తుంది . అక్కడ ప్రజలలో ఎక్కడ ఎవరికీ ఎటువంటి పిచ్చి ఎప్పుడు పుట్టుద్దో అంతుబట్టడం లేనట్లుంది . అప్పటిదాకా మంచిగా ఉండేవారే హటాతుగా "డ్రాక్యులా"సినిమాలో మాదిరి సైకోలుగా మారి పక్కనున్న వారి ప్రాణాలు తీస్తుంటే దానిని భూతాల దిబ్బ అంటారు కాని భూతల స్వర్గం అని ఎవరంటారు ? ఒక్క సైకోలు తప్పా !
ఈ రోజు పేపర్లో చూసాను . భూతాల స్వర్గం లోని పిట్స్ బర్గ్ లోని ముర్రెస్ విల్లె అనే ప్రాంతంలోని ఒక స్కూల్లో ఒక అమెరికన్ విద్యార్ది కత్తితో స్కూల్లో కి వచ్చి వికత్తట్టాహాసం చేస్తూ , విచక్షణా రహితంగా 20 మంది విద్యార్దులను పోడి చాడట . దానితో స్కూల్ అంతా తీవ్ర గందర గోళమై , పిల్లలు రక్తపు గాయాలతో పరుగులు తీసారట ! అందులో అప్పటికప్పుడు ఆపరేషన్ లు చేయాల్సిన పరిస్తితి. ఇలాంటి సంఘటనలు అమెరికాలో తరచుగా జరుగుతూనే ఉన్నాయి . దీనికి ఉన్న కారణాల్లో అక్కడి కుటుంబాల్లో ఉన్న అభద్రతా బావం కూడా ఒకటి .దాని గురించి ఇంకో సారి వివరంగా వేరే టపాలో పెడతాను . ఇప్పుడు విషయం ఏమిటంటే పై తరహ ఉన్మాదం ఒక ప్రియురాలికి కలిగి తన ప్రియుడు ఇచ్చిన బహుమతితోనే అతడిని 25 సార్లు కొట్టి చంపిoదట అ ఆదునిక ఉన్మాది . అ కదేమిటంటే :
టెక్సాస్ కు చెందినా అనా త్రాజిల్లో, ఆల్ప్ సైపాన్ అండర్సన్ బాయి ప్రెండ్ , గర్ల్ ప్రెండ్ అట . ఇందులో బాయి ప్రెండ్ కి 59 ఏండ్లు కాగా గర్ల్ ప్రెండ్ కి 45 ఏండ్లు అట . అంటే ఆయనలో బాయి , ఆమెలో గర్ల్ మాయమై చాలా ఏండ్లు గడచి పోయింది అన్న మాట . అయినా లవ్ గేజ్ కొలవాలంటే ఏజ్ తో పనిలేదు కాబట్టి వారిద్దరూ బాయి, గర్ల్ ప్రెండ్స్ అయ్యారు. అటువంటి బాయి ప్రెండ్ అయిన అండర్సన్ తన గర్ల్ ప్రెండ్ కి ఒక రోజు నీలిరంగు హైహిల్ షూస్ , ఖరీదైనవి బహుమతిగా ఇచ్చాడట . వాటిని కోనేటప్పుడు అండర్సన్ ఊహించి ఉండడు అవే హై హిల్స్ ని ప్రపంచ ప్రజలందరూ చూసే రోజు ఒకటి వస్తుందని , దానికి తనే చావే కారణ మవుతుందని .
ఒక రోజు సదరు బాయి ప్రెండ్ , గర్ల్ ప్రెండ్ మద్య వివాదం ఒకటి ఏర్పడి అది చిలికి చిలిక్ గాలివాన అయిందట . దానితో గర్ల్ ప్రెండ్ కాస్తా గరం ప్రెండ్ అయి కాలికున్నబాయిప్రేండ్ బహుమతిగా ఇచ్చిన హైహిల్ తీసి అతడి మిద కొట్టిందట . అలా 25 చెప్పుదెబ్బలు కొట్టెసరికి అండర్సన్ హరీ అన్నాడట ! దానితో కోపం చల్లారిన ఆమెను ఆ తర్వాత పోలీసులు అరెస్ట్ చేసి ప్రాసిక్యూట్ చేస్తే మొన్ననే కోర్టువారు ఆమె దోషి అని నిర్దారించారు. ఇక ఆమెకు ఏమి శిక్ష పడుతుందో అని వేచి చూస్తున్నారు అమెరికన్లు . అప్పటిదాకా ఖాలిగా ఉంటె జనం టెన్షన్ పీల్ అవుతారని మీడియా వారు ప్రియురాలు హత్యాయుదం అయిన అండర్సన్ బహుమతి ని అదేనండి , ఆమె హైహిల్ జోడును తమ చాన్నల్ల్లో చూపిస్తూ ఆ బ్రాండ్ కు విపరీత ప్రచారం చేస్తున్నారట . అది చూసిన అమెరికన్ గర్ల్ ప్రెండ్స్ అవి తమకు ఎంత వరకు ఉపయోగ పడతాయా అని ఆలోచిస్తున్నారట ! అదీ విషయం.
\ (10/4/2014 Post Republished).
Comments
Post a Comment