"అయ్యా , ఈ 50,000 తీసుకుని నా మొగుడి కాళ్ళు చేతులు విరగొట్టించండి " అని ప్రాధేయపడిన భార్య !!?



     అది కలకత్తా లోని లాడన్ వీధిలో ఉన్న ప్రైవేట్ ఇన్వెస్టిగేటింగ్ ఆపీస్ . ఆ ఆపీస్ లోకి అడుగు పెట్టింది 65 ఏండ్ల వృద్ధ మహిళ . ఆ సమయం లో ఆ ఆపీస్ లో ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ కి సంబందించిన ఉద్యోగులు కొంత మంది ఉన్నారు . అందులో పెద్ద ఉద్యోగి గా కనిపిస్తున్న వ్యక్తి దగ్గరకు వెళ్లి , అతని ముందు ఉన్న టేబుల్ మీద , తన చేతిలో ఉన్న సంచి నుంచి డబ్బులు నోట్ల కట్టలు తీసి పెట్టింది ఆ వృద్ధురాలు. ఆ ఉద్యోగి ఏమిటా అని అడగబోయే లోపు " అయ్యా ఈ  50,000 రూపాయలు తీసుకుని ఎవరినైనా గుండాలను పంపి నా మొగుడి కాళ్ళు చేతులు విరగ గొట్టించండి . కేవలం కాళ్ళు చేతులు మాత్రమే విరగాలి తప్పా , అయన ప్రాణానికి ఏ మాత్రం మోసం రాకూడదు " అని ప్రాధేయ పడిందట . ఆ మాటలతో అదిరిపడి చూసారు ఆ ఆఫీసులోని ఉద్యోగులంతా

      అంతకు ముందు ,    మొదట ఆ వృద్ధురాలు తన 75 ఏండ్ల మొగుడి యొక్క వివాహేతర సంబంధం గురించి ఎంక్వయిరీ చేయమని ఆ ఏజెన్సీ ఆఫీసుకు వచ్చినప్పుడు , ఆమె   మైండ్ సరి లేదేమో అని అనుమానించారు . కానీ ఆ తర్వాత ఆవిడా చెప్పిన విషయాన్ని ఓపికగా విన్న తర్వాత ఆమె మాటలు నమ్మ తగినవే అని  భావించి ఆమె గారి కేసును టేకప్ చేసి ఇన్వెస్టిగేటింగ్ ప్రారంభించారు. వారి ఇన్వెస్టి గెటింగ్ లో ఆమె గారి ముసలి మొగుడి గురించి చాలా ఆసక్తికర విషయాలు తెలిసాయి . అవేంటి అంటే :

      రోజూ ఒకానొక ప్రత్యేక సమయానికి ఆమె  75 ఏండ్ల ముసలి  మొగుడు ఎదో వంక తో వారి ఇంట్లోని కిటికీ వద్ద నుంచుని చూస్తూ ఉంటాడు . అదే సమయంలో ఒకావిడి వారి ఇంటి వద్దకు వచ్చి వీధిలో నిలబడి ముసలోడి కి సైగలు చేస్తుంది. అలా కాసేపు సైగలు చేసుకున్నాక , "నేను అలా కాసేపు బయటకు వెళ్లి వస్తాను " అని భార్య తో చెప్పి బయటపడతాడు ముసలోడు . అలా వెళ్లిన వాడు ఒక ట్రైన్ పట్టుకుని గరియా అనే స్టేషన్ లో దిగి , ఆ సైగ చేసిన ఆవిడ  ఇంటికి వెళతాడు . అక్కడ వారివురు సరస సల్లాపాలు ఆడుతూ చాలా సేపు మైమరచి పోతారు. అలా ఆ ముసలోడి ముచ్చట తీరాక తీరికగా ఇంటికి తిరిగి వస్తాడు . ఇలా అతగాడు ఆమె తో ముచ్చట తీర్చుకుంటున్నందుకు అతని పెన్షన్ డబ్బులో కొంత భాగం ప్రియురాలికి ఇస్తున్న్నాడు అని ఇన్వెస్టిగేటింగ్ అధికారులు ఆ వృద్ధురాలైన భార్యకు తెలిపారు .

   అది వినగానే ఆమె మనసు కోపంతో కుత కుతలాడి పోయింది.  "ముసలోడు ఎదో  ఆరోగ్యం కోసం సిటీ లో తిరిగి వస్తున్నాడు అనుకుంటే , ఏకంగా ఎవతితోనో తైతక్కలాడటమే కాకుండా దానికి డబ్బు కూడా ఇస్తున్నాడా? ఆయనకి  75 ఏండ్లు వచ్చినా పరాయి దానితో సరసాలు కావాల్సి వచ్చిందా? ఇదంతా అయన కాళ్ళు చేతులు చక్కగా ఉండబట్టే కదా . వాటినే విరిచేస్తే కామ్ గా ఇంట్లో పెట్టినది తిని పడుంటాడు " అని భావించిన  ఆ భార్య  పై విదంగా ఇన్వెస్టిగేటింగ్ ఉద్యోగులను అర్ధించింది .

     చివరకు ఈ విషయం విన్న కొంతమంది సైకియాట్రిస్టులు ఆ వృద్ధ దంపతులకు తగిన కౌన్సిలింగ్ క్లాసులు ఇప్పిస్తే వారి సమస్యకు పరిష్కారం దొరుకుతుందని సజెస్ట్ చేశారట. అది సంగతి.

SOURCE:http://timesofindia.indiatimes.com/city/kolkata/Wife-finds-husband-to-be-cheating-arranges-money-to-break-his-bones/articleshow/54695030.cms?utm_source=toimobile&utm_medium=Facebook&utm_campaign=referral

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!