కోర్కేలు లేని సంసారి, కోర్కెలు ఉన్న సన్యాసి, ఇద్దరూ "హిందుత్వ"కు దూరంగా ఉన్న వారే.
Unlike other religions in the world,the Hindu religion does not claim any one prophet it does not worship any one god; it does not believe in any one philosophic concept; it does not follow any one act of religious rites or performances; in fact, it does not satisfy the traditional features of a religion or creed.IT IS A WAY OF LIFE AND NOTHING MORE.......
APEX COURT OF INDIA
హిందూ అనేది అన్ని మతాల వలే కాదని, దానికొక ప్రత్యేకమైన ప్రవక్త,బోధనా లేవని, అది కేవలం ఒక జీవన విదానం తప్పా అన్యదా కాదని ఒక చారిత్రకమైనా తీర్పులో భారత అత్యున్నత న్యాయస్థానం ఉద్ఘాటించింది. కాన్ దీనిని హిందూ మత ప్రవచనాలు బోద చేసే వారు, పెద్దగా పట్టించుకున్నట్లు లేదు. అందుకే ఎవరి అరాద్య పురుషుడ్ని వారు తమ దేవుడే గొప్ప దేవుడు, ఆయన చెప్పిందే కరెక్ట్, వేరెవ్వరూ చెప్పినా అది వేస్టే అన్నట్లు చెపుతుంటారు.
అసలు హిందూ తత్వం అంటే "ప్రక్రుతి నిర్దేశించిన విదానానికి అనుకూలంగా మన జీవన విదానం ఎలా ఉండాలో తెలియ పరచే తత్వం" అని నా ఉద్దేస్యం. ఒక్క మాటలో చెప్పాలంటే "ఏ వయసులో ఆ ముచ్చట" అనేదే హిందూ జీవన విదానం. ఇరవై యేంద్లకే పెండ్లి, గిల్లి లేకుండా సన్యాసి కావడం, లేకుంటే అరవై యేంద్లు వచ్చినా పడుచు అమాయిల కోసం ఆబర్లాడటం ఇవ్వన్నీ ప్రక్రుతి విరుద్ద మైన పనులే. అందుకే అరవై లోపు వారు జ్ణాన మార్గంలో, అరవై దాటిన వారు భక్తి మార్గంలో నడిస్తే ఒంటికి, ఇంటికి మంచిది.
ఇదంతా ఎందుకు చెప్పాల్శి వస్తుందంటే ఈ మద్య ఒక టి.వి. చానల్ వారు ఒక గురువు గారు చెప్పిన ప్రవచనాలు అంటే "తుచ్చమైన కొరికలతో పారాయణం చెయ్యకండి" అనే దాని మీద ఒక కార్యక్రమం నిర్వహిస్తే అందులో కొంత మంది సాయిబాబా భక్తులు అటువంతి ప్రవచనం మీద అభ్యంతరం వ్యక్తం చేసారు. ఇక్కడ ఒకటే అసలు పారాయణం చెయ్యాల్సింది ఏ వయసు వారు? యువకులకు పారాయణాలు కాదు, సంసారాయాణాలు సక్రమంగా చేస్తే అదే నిజమైన దైవ మార్గం .కుటుంభ పరంగా అన్ని బాద్యతలు తీరాకా మల్లీ ఆ కుటుంబ సుఖాల మీద ద్రుష్టి మళ్లకుండా దైవాన్ని స్తుతిస్తూ ఏ కోర్కెలూ లేకుండా చేసే తత్వ విచారణలు, పారాయాణాలు, భజనలు మనిషిన అలౌకిక ఆనంద మార్గం వైపు నడుపుతాయి. ఇదే నిజమైన హిందూ జీవన విదానం. కాబట్టి వయసులో జ్ణాన మార్గం(సామాజిక నిబందనలకు లోబడి, సంసార బాద్యతలు నిర్వహించడం), ముదిమిలో భక్తి మార్గం( దైవ తత్వ విచారణ, గ్రంద పారాయణాలు, భజనలు) సర్వ విదాలా శ్రేయస్కరం. దీని మీద ఇంకా సమాచారం కొరకు ఈ లింక్ మీద క్లిక్ చెయ్యండి.
http://ssmanavu.blogspot.in/2012/12/blog-post_13.html
బాల్యంనందు జ్నానార్దివైన బ్రహ్మ స్వరూపుడవై,
యవ్వనమందు,సంసార సారదిగ,సకలపోషకుడిగ,విష్ణుస్వరూపుడవై,
మలి వయసులొ జ్నాననేత్రదారిగ,శక్తిసహిత శివ రూపుడువై ,
ముదిమివయసులొ,సర్వసన్గ పరిత్యాగివైన,భగవత్ స్వరూపుడవై,
నడయాడు మనిషే నిజమైన హిందువు.. (ఇదే మనవిజం Manavuism)
18/7/2013 Post Republished).
Comments
Post a Comment