చేప ప్రసాదంలో "మందు విలువలు"మాత్రమే లేవు కాని , విజ్ణానులు దగ్గర అసలు ఆస్మాకి మందే లేదు!
పాపం కొంత మందిని చూస్తే వారికి జ్ణానం ఉండవచ్చు కాని ఇంగిత జ్ణానం మాత్రం ఏ మాత్రం లేదేమో అనిపిస్తుంది. జనవిజ్ణాన వేదిక వారు "చేప ప్రసాదం" మీద అంత లొల్లి చేసి సాదించినది ఏమిటో అర్థం కావటం లేదు. కేవలం పబ్లిసిటి తప్పా!రాజ్యాంగ నియమాలు ప్రకారం ఏ వ్యక్తి అయినా తను నమ్మిన విశ్వాసాలను ఆచరించవచ్చు, ప్రచారం చెసుకొవచ్చు . కాకపోతె ఆ విశ్వాసం మనిషి అరోగ్యానికి కాని, దేశ బద్రతకు కాని బంగం కలిగించకూడదు. గతంలొ చెప ప్రసాదం మీద కొర్టుల్లో జనవిజ్ణాన వేదిక వారు పిటిషన్ లు వేసినప్పుడు హై కోర్టు వారు స్పష్టంగా చెప్పారు.చెప మందు లేక ప్రసాదం అని చెప్పబడుతున్న దానిలో మనిషికి హాని చెసే పదార్దములు ఏమి లేవు కాబత్టి, దానిని ప్రసాదంగా పంపిణి చెసుకోవచ్చు అని. బత్తిన సోదరులు కూదా అది తమ పూర్వికులకు ఒక సాదువు ఇచ్చిన వరప్రసాదం అని, దానిని సేవించిన వారు ఆస్మా నుండి ఉపశమనం పొందుతున్నారు అని చెపుతున్నారు . కాబట్టి వారు నిరబ్యంతరంగా ప్రసదాన్ని పంపీణి చెయవచ్చు. ఇది వారి మతపరమైన రాజ్యాంగ హక్కు. ఇక పొతే సదరు బత్తిన సోదరుల పంపిణి కార్యక్రమానికి ప్రబుత్వం వారు సహయ సహకారాలు అందించదం గూర్చి