తన ప్రేమను తిరస్కరించారని తల్లితండ్రులను చంపి , వారి శవాల సమక్షంలో ప్రియుడితో 72 రోజులు గడిపిన కసాయి కూతురు!
తమ పిల్లలు కులం కానివాడినో , లేక తాము కాద్దన్న వాడినో ప్రేమించి అతనితో పెళ్ళికి సిద్దపడితే , వారిని చంపిన కసాయి కుటుంబ సబ్యుల హత్యోదంతాలు మన దేశం లో అక్కడక్కడా జరిగాయి . వాటికి "పరువు హత్యలు" గా పేరు పెట్టి సదరు కుటుంబ సబ్యులకు "ఉరి శిక్ష " లు కూడా విదించిన సందర్బాలు ఉన్నాయి . ఇటుంవంటి దగుల్బాజీ పనులను సబ్యసమాజం ఒప్పుకోదు. అయితే పిల్లల ప్రేమ ను తిరస్కరించి వారిని చంపడం "పరువు హత్య" అయితే , తల్లితండ్రులు బాయిప్రెండ్తో తిరుగుళ్ళు మాని బుద్దిగా చదువుకోమన్నందుకు వారినే మట్టుబెట్టడం ని ఏమనాలి? మన దేశంలోనే ఇది జరిగింది. దిగజారిన పిల్లల మానసిక స్తాయి కి అద్దంపట్టే ఈ ఉదంతం వదోదర లో జరిగింది . ఆ అమ్మాయిని పదిహేనేళ్ళ క్రితం చేరదీసి పెంచిన తల్లితండ్రులు వారు . ఇప్పుడు ఆమెకు 16 యేంద్లు. చదువు ని నిర్లక్ష్యం చేసి 21 సంవత్స...