తన ప్రేమను తిరస్కరించారని తల్లితండ్రులను చంపి , వారి శవాల సమక్షంలో ప్రియుడితో 72 రోజులు గడిపిన కసాయి కూతురు!
తమ పిల్లలు కులం కానివాడినో , లేక తాము కాద్దన్న వాడినో ప్రేమించి అతనితో పెళ్ళికి సిద్దపడితే , వారిని చంపిన కసాయి కుటుంబ సబ్యుల హత్యోదంతాలు మన దేశం లో అక్కడక్కడా జరిగాయి . వాటికి "పరువు హత్యలు" గా పేరు పెట్టి సదరు కుటుంబ సబ్యులకు "ఉరి శిక్ష " లు కూడా విదించిన సందర్బాలు ఉన్నాయి . ఇటుంవంటి దగుల్బాజీ పనులను సబ్యసమాజం ఒప్పుకోదు. అయితే పిల్లల ప్రేమ ను తిరస్కరించి వారిని చంపడం "పరువు హత్య" అయితే , తల్లితండ్రులు బాయిప్రెండ్తో తిరుగుళ్ళు మాని బుద్దిగా చదువుకోమన్నందుకు వారినే మట్టుబెట్టడం ని ఏమనాలి? మన దేశంలోనే ఇది జరిగింది. దిగజారిన పిల్లల మానసిక స్తాయి కి అద్దంపట్టే ఈ ఉదంతం వదోదర లో జరిగింది .
ఆ అమ్మాయిని పదిహేనేళ్ళ క్రితం చేరదీసి పెంచిన తల్లితండ్రులు వారు . ఇప్పుడు ఆమెకు 16 యేంద్లు. చదువు ని నిర్లక్ష్యం చేసి 21 సంవత్సరాల కుర్రాడితో ప్రేమలో పడింది . అది తెలిసిన తల్లితండ్రులు బాయి ప్రెండ్తో సహవాసం మాని బుద్దిగా చదువుకొమ్మని మందలించారు . అంతే! కస్సుమంది ! ఏకంగా ప్రియుడితో కలిసి వారిని పాశవికంగా హత్య చేసింది . అయితే అ శవాలను ఎలా బయట పదేయాలో తెలియక ,లేక కుదరక ఇంట్లోనే ఉంచింది. తానూ ప్రియుడితో కలిసి ఆ ఇంట్లోనే ప్రేమాయణం సాగించింది . శవాలు వాసన బయటకు తెలియకుండా ఉండడం కోసం బోల్డన్ని సుగంద ద్రవ్యాలు వాడింది .అలా 72 రోజులు గడిపింది ఆ ప్రేమోన్మాది! అయినా ఆమె అఘాయిత్య రహస్యం ఆగలేదు . వారింటికి బందువు రావడంతో బట్టబయలైంది ఆమె కస్సాయి తనం. పోలిసులు ప్రియుడితో సహా ఆమెను అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు . అదీ విషయం. ఇప్పుడు చెప్పండి . ఇటువంటి హత్యలకు ఏమి పేరు పెట్టాలి?
పూర్తీ సమాచారం కొరకు క్రింది వీడియోను చూడవచ్చు.
(Republished post. RPD.20/11/2014.)
ReplyDeleteపెంచిరి పిల్లను! తను పిలి
పించెను ప్రియుడిని, జిలేబి పీకల కోసేన్ !
ఉంచెను నింటన! కులికెను
కాంచన! కట్టెను సుగంధ కాదుల గోరీ !
జిలేబి
కళియుగానికి అంతం మెుదలైంది.
ReplyDeleteకళియుగానికి అంతం దగ్గరలోనే ఉందన్న మాట
ReplyDelete