తన ప్రేమను తిరస్కరించారని తల్లితండ్రులను చంపి , వారి శవాల సమక్షంలో ప్రియుడితో 72 రోజులు గడిపిన కసాయి కూతురు!

                                                                 


 తమ పిల్లలు కులం కానివాడినో , లేక తాము కాద్దన్న వాడినో ప్రేమించి అతనితో పెళ్ళికి సిద్దపడితే , వారిని చంపిన కసాయి కుటుంబ సబ్యుల హత్యోదంతాలు మన దేశం లో అక్కడక్కడా జరిగాయి . వాటికి "పరువు హత్యలు" గా పేరు పెట్టి సదరు కుటుంబ సబ్యులకు "ఉరి శిక్ష " లు కూడా విదించిన సందర్బాలు ఉన్నాయి . ఇటుంవంటి దగుల్బాజీ పనులను సబ్యసమాజం ఒప్పుకోదు. అయితే పిల్లల ప్రేమ ను తిరస్కరించి వారిని చంపడం "పరువు హత్య" అయితే , తల్లితండ్రులు బాయిప్రెండ్తో తిరుగుళ్ళు మాని బుద్దిగా చదువుకోమన్నందుకు   వారినే మట్టుబెట్టడం ని ఏమనాలి? మన దేశంలోనే ఇది జరిగింది. దిగజారిన పిల్లల మానసిక స్తాయి కి అద్దంపట్టే ఈ ఉదంతం వదోదర లో జరిగింది .

  ఆ అమ్మాయిని పదిహేనేళ్ళ క్రితం చేరదీసి పెంచిన తల్లితండ్రులు వారు . ఇప్పుడు ఆమెకు 16 యేంద్లు. చదువు ని నిర్లక్ష్యం చేసి  21 సంవత్సరాల కుర్రాడితో ప్రేమలో పడింది . అది తెలిసిన తల్లితండ్రులు బాయి ప్రెండ్తో సహవాసం మాని బుద్దిగా చదువుకొమ్మని మందలించారు  . అంతే! కస్సుమంది ! ఏకంగా ప్రియుడితో కలిసి వారిని పాశవికంగా హత్య చేసింది . అయితే అ శవాలను ఎలా బయట పదేయాలో తెలియక ,లేక కుదరక ఇంట్లోనే ఉంచింది. తానూ ప్రియుడితో కలిసి ఆ ఇంట్లోనే ప్రేమాయణం సాగించింది . శవాలు వాసన బయటకు తెలియకుండా ఉండడం కోసం బోల్డన్ని సుగంద ద్రవ్యాలు వాడింది .అలా 72 రోజులు గడిపింది ఆ ప్రేమోన్మాది! అయినా ఆమె అఘాయిత్య రహస్యం  ఆగలేదు . వారింటికి బందువు రావడంతో బట్టబయలైంది ఆమె కస్సాయి తనం. పోలిసులు ప్రియుడితో సహా ఆమెను అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు . అదీ విషయం. ఇప్పుడు చెప్పండి . ఇటువంటి హత్యలకు ఏమి పేరు పెట్టాలి?

                                    పూర్తీ సమాచారం కొరకు క్రింది వీడియోను చూడవచ్చు.

                      

                                          (Republished post. RPD.20/11/2014.) 

Comments


  1. పెంచిరి పిల్లను! తను పిలి
    పించెను ప్రియుడిని, జిలేబి పీకల కోసేన్ !
    ఉంచెను నింటన! కులికెను
    కాంచన! కట్టెను సుగంధ కాదుల గోరీ !

    జిలేబి

    ReplyDelete
  2. కళియుగానికి అంతం మెుదలైంది.

    ReplyDelete
  3. కళియుగానికి అంతం దగ్గరలోనే ఉందన్న మాట

    ReplyDelete

Post a Comment

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన