విదేశి "స్వస్తత ప్రార్థనలు" కు కళ్లొస్తాయి, కాళ్లొస్తాయి, కాన్సర్ కూడా తగ్గుద్ది అంటే పట్టించుకోని విజ్ణానులకు హిందూ "చేప ప్రసాదం" మీద అంత కోపం ఎందుకు?

                                                              
                                   


   చట్టం  అనేది అన్ని  కులాలకు, మతాలకు సమానం గా వర్తిస్తుంది అని మన రాజ్యాంగం చెపుతుంది. మరి మన బత్తిన సోదరులు ఇచ్చే చేప ప్రసాదం వల్ల ఉబ్బసం తగ్గడం అనేది హంబగ్ కాబట్టి  ఆ కార్యక్రమానికి ప్రబుత్వ పరంగా ఏ సహాకారం ఇవ్వ రాదని కోరుతూ గత రెండు మూడెండ్ల నుండి కక్ష కట్టినట్లు "జన విజ్ణాన వేదిక వారు "చేప ప్రసాదం" పంపీణీ కార్యక్రమానికి తీవ్ర అడ్డంకులు కలిగిస్తున్నారు. దీని మీద అంద్ర ప్రదేశ్ ఉన్నత న్యాయస్తానం ఒక అభిప్రాయం వెలిబుచ్చినప్పటికి, దానిని వారు ఖాతరు చేస్తున్నట్లు లేదు. మొత్తం ఈ తతంగం వెనుక ఏదో గూడుపుటాణి ఉందనిపిస్తున్నది.

  లేకుంటే శాస్త్రీయత, అనేది కేవలం హిందూ మత విదానాలకే వర్తిస్తుందా? ఇతర మతాల వారి కార్యక్రమాలకు వర్తించవా? విడేశి మతానికి చెందిన వారు వారాల తరబడి ప్రబుత్వ సహాకారంతో వివిద గ్రౌండ్స్ లలో "స్వస్తత కూటములు" ఏర్పాటు చేసి, అక్కడికి వచ్చి ప్రార్థనలు చేస్తె కళ్లొస్తాయి! కాళ్లోస్తాయి! కాన్సర్, మధుమేహం లాంటి మహమారిలు అంతులేకుండా పోతాయి అని చెప్పేసి,లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజలను ఊదర కొట్టేసి రప్పించుకుంటుంటే, ఈ జన విజ్ణాన వేదికల వారికి కనపడడం లేదా? వారి మీద వెయ్యని పిటిషన్లు కేవలం హిందూ సంస్తలు, వ్యక్తులు మీదే ఎందుకు వేస్తున్నారు? హిందువులైతే నోరు మూసుకు పడి ఉంటారు, వేరే వారైతే ఊరుకోరు అని బయం కావచ్చు!లేదు హిందూత్వం అశాస్త్రియతతో కూడుకున్నది అని ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం చేసే దుష్ట సంకల్పం లో బాగం కావచ్చు. ఏది ఏమైనా ఈ ద్వంద నీతి ప్రమాణాన్ని తీవ్రంగా గర్హిస్తున్నాం.

   ప్రబుత్వాలకు ఆదేశం లిప్పించి హిందూ మత విశ్వాసాలను అడ్డుకోవాలనుకోవడం మూర్ఖత్వం అవుతుంది. మనం తినే తిండి లో సాస్త్రీయత లేదు? మనం కట్టె బట్టలో శాస్త్రీయత లేదు! మనం తాగే తాగుడులో శాస్త్రీయత లేదు! వాగే వాగుడులో కూడ అసలు శాస్త్రీయతే లేదు. ఇన్ని శాస్త్రీయత లేని పనులు చేస్తూ, ఏదో తర తరాలుగా ఒక హిందూ కుటుంబం , ఆరోగ్యానికి  హాని చెయ్యని "చేప ప్రసాదం’ వంటి ఒక ప్రక్రియను ఏమి ఆసించి అడ్డుకుంటున్నారో తెలియ చెప్పాళ్సిన బాద్యత జన విజ్ణాన వేదిక వారి మీద ఉంది. లేకుంటె ఇది కేవళం హిందూ వ్యతిరేక బావ జాల ప్రచారంలో బాగంగా జరుగుతున్న కుట్ర అని బావించాల్శి ఉంటుంది.

Comments

  1. These swasthatha mahasabhas all are high dramas.The organisers already arrange some prople who wil act very nicely[to be frank NTR AND ANRS acting talents are mere waste in front of their acting.]If they are real i wil send people who are suffering wth real bodily aliements to such mahasabhas.

    ReplyDelete
  2. How chepa-mandhu works on ASTHMATIC people?here is the scientific explonation..pl.read-

    In zodiac Gemini sign is airy in nature,which shows jupitaerian element called akasha[the sky].Air originates from akasha element.The airy parts in human body are lungs.These parts ruled by jupiter.The sign Gemini had 3 stars called mrugasira-arudra-punarvasu ruled by Mars-Rahu-Jupiter.

    Mars represents the musculature of lungs,Rahu represents the chitinous-cartilagious rings arouend tracheal tubes,jupiter represents the Alveoli of lugs[air stores of lungs]..

    The traditinal fish medicin contains[as they said its a family and business secret..iam not talking much on it now readers]..a chemical that acts on cartilagious rings and passifies them.so there is no constriction of these rings which actualy cause the asthmatic attack..

    Why rahu mainly taking the lead in causing asthma?is the question here...let me elobrate..

    Rahu represents oral cavities in livining things.Respiratory systems starts wth nose and nostrills and ends wth Alveoli..Rahu has a peculiar power of engulfing the other planets strength.so he always dominates mars and jupiter and takes the lead to cause this disease..

    The above facts are all from charaka samhitha,the oldest ayurvedic text..in it they had also mentioned with what previous karmas this disease originates in pranis...

    ReplyDelete
  3. బాగా చెప్పారు.

    చేప మందు కార్యక్రమానికి ప్రభుత్వం ధనసహాయం వగైరా చేస్తోందనుకోను (నా వ్యక్తిగత అభిప్రాయం). వేలమంది జనం వస్తారు కాబట్టి శాంతిభద్రతల కోసం ప్రభుత్వం పోలీసు ఏర్పాట్లు చెయ్యాలి; అలాగే రవాణాకి అదనపు బస్సులు/సిటీబస్సులు ఏర్పాట్లు చేస్తుంది, ట్రాఫిక్ నియంత్రణకి ఏర్పాట్లు చేస్తుంది. సినిమా వాళ్ళ ఫంక్షన్లు (వీట్లకి మరీ వేలంవెఱ్ఱిగా వస్తారుగా జనం), రాజకీయ పార్టీల మీటింగులు పబ్లిక్ స్ధలాల్లో నిర్వహిస్తే దానికి కూడా పోలీస్ ఏర్పాట్లు చేస్తుందిగా ప్రభుత్వం. స్వామీజీల సభలకి, క్రికెట్ మాచ్ లకి కూడా అంతేగా. శాంతిభద్రతలు ప్రభుత్వం వారి బాధ్యత. అంతమాత్రాన ఆ కార్యక్రమానికి ప్రభుత్వం మద్దతిస్తోంది అనలేం. కాదంటే మొత్తంగా నిషేధించడమే ప్రత్యామ్నాయం - సినిమా వాళ్ళ ఫంక్షన్లు, పార్టీ మీటింగులు, స్వామీజీల సభలు, స్వస్ధతాకూటములు, క్రికెట్ మాచ్‌లతో సహా.

    అస్థ్మా కి చేపమందు లాగానే, పచ్చకామెర్ల (jaundice) కి "వెల్ల మందు" మీద ప్రజలకి విశేషమైన నమ్మకం. తూర్పు గోదావరి జిల్లాలో కాకినాడ దగ్గరున్న వెల్ల గ్రామంలో ఓ కుటుంబం తరాలుగా చేస్తున్న వైద్యం ఇది. ఆ మందు వివరాలూ రహస్యమే మరి. ఇక్కడ గమనించవలసినది ఆ మందుతో పాటు నెలరోజుల పథ్యం కూడా చెయ్యాలని చెబుతారు ఆ కుటుంబం. జాండిస్ కి పథ్యం చాలా ముఖ్యం. అలాగే చేపమందుతో పాటు ఏమైనా ఆహారనియమాలు కూడా చెబుతున్నారేమో ? తమకి ఉపశననం కలిగిందని చెబుతున్న రోగులున్నారుగా మరి.
    చేపమందు మీద ధ్వజమెత్తడానిక్ వెనక డాక్టర్లు / హాస్పిటల్స్ కూడా ఉన్నారేమో అనుకోవాలా (వాళ్ళ వ్యాపారం దృష్ట్యా)?

    ఏమైనా హిందువులని విమర్శించడం ఓ ఫాషన్ అయిపోయింది ఈ రోజుల్లో. ఏమనుకోకండి ఎకానీ, "వెఱ్ఱివాడి పెళ్ళాం వాడకంతా వదిన" అని ఓ ముతక సామెత ఉంది చూశారూ, అలా తయారు చేసిపెట్టారు హిందువుల పరిస్ధితిని రాజకీయ నాయకులూ, "మేధావులూ".

    ReplyDelete


  4. చేతుము దండిగ కూటపు
    జోతలు ప్రభువుకు ! నలతలు జోరుగ బోవున్ !
    కూతల వేదిక మెక్కెను
    ఖాతా నిండుగ ! జిలేబి గప్చుప్పయ్యెన్ !

    ReplyDelete

Post a Comment

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

కలికాలం.. రివర్స్ కాలం..కాలజ్ఞానం