స్నేహితురాలిని, భర్త అతని స్నేహితుని చేత ’గాంగ్ రేప్’ చేయించిన బార్య!.
స్త్రీల మీద లైంగిక దాడులు ఈ మద్య ఎక్కువ అవుతున్నాయని జాతి మొత్తం ఎలుగెత్తి ఘోషిస్తున్నా మదాందులకు కించిత్ అయినా బెరుకు కలగడం లేదు. "నిర్భయ" లాంటి కఠిన చట్టాలు సైతం వారిని భయ పెట్ట లేక పోతున్నాయి. ఇక పోతే స్త్రీల మీద చేసే లైంగిక దాడుల్లో అక్కడక్కడా స్త్రీల పాత్ర కూడా ఉండటం కొత్తేమి కాదు. వ్యభిచార గ్రుహాలు నడిపే వారు, విటులకు అమ్మాయిలను సరపరా చేస్తూ, మాట వినని వారిని తమ అనుచరుల చేత లైంగిక దాడి చేయించటం సినిమాలలో చూస్తుంటాం . కనీ సాక్షాతు బార్యయే దగ్గరుండి మరీ, తన స్నేహితురాలి మీద తన భర్త మరియు అతని స్నేహితునితో "గాంగ్ రేప్" చేయించిందంటే అటువంటి మహా ఇల్లాల్ని ఏ తీరుగ కొనియాడాలి?!
మద్య ప్రదేశ్ లోని మొరీన జిల్లాలో, మొరీనా పట్టణానికి 75 కిలోమీటర్ల దూరం లో సబల్ గర్ అనే ప్రాంతం లో ఒక దేవాలయం ఉంది. ఆ దేవాలయంలో వంటమనిషి ఉద్యోగం కొరకు ఒకామే దరఖాస్తు చేసుకుందట. ఆమె స్నేహితురాలైన "పిస్తా దేవి" అనే ఆమె ఆ ఉద్యోగం ఇప్పిస్తాను అని చెపితే నమ్మి బలి మేక లా ఆమె వెంట ఆ దేవాలయానికి వెళ్లిందట.అయితే అప్పటికే ఒక ప్లాన్ ప్రకారం పిస్తా దేవి భర్త ’కల్లు జోగి, అతని స్నేహితుడు రవి అనే వారు తోడేళ్ళు లా పొంచి ఉండి బలి కాబోయే మేక కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నారట.
పిస్తా దేవి తో కలిసి ఆమె అక్కడకు రాగానే ఆమె ను ఒక గదిలో బందించి రెండు రోజుల పాటు ఆమె పై అత్యాచారం చేసారట. ఆ విదంగా తాను పిస్తా దేవి మాటలు నమ్మి మోస పోయాను అని గ్రహించిన ఆ అబల ఎలాగో వారి చెరనుండి తప్పించుకుని ఇంటికి చేరుకుని తన వాళ్ళకి జరిగిన సంగతంతా చెపితే వారు పోలిస్ కేసు పెట్టారు . పోలిసులు పిస్తా దేవి, ఆమె భర్త మరియు అతని స్నేహితుడి మీద కేసు నమోదు చేసి వారిని అరెస్ట్ చేసారు. ఇది మొన్న మూడవ తారీకున జరిగిన సంఘటణ. కేసు దర్యాప్తులో ఉంది. అదీ విషయం.
కాబట్టి స్త్రీలే కదా అని వారి గుణ గణాలను తెలిసికోకుండా, స్నేహితులు అని నమ్మితే ఇలాంటివి జరిగే అవకాశం ఉంది.స్త్రీల మీద లైంగిక దాడులు చేసేది పురుషులే అయినా వారికి సహకరిస్తూ ఉండే ఇలాంటి నీచపు స్త్రీలను సైతం కఠినంగా శిక్షిస్తే తప్పా నేరాలు కట్టడి కావు. స్త్రీలందరూ అమాయకులు,, పురుష లోకమే పాపిష్టిది అనే బావాన్ని పారదోలి, సమాజం లో అబలల మీద జరుగుతున్న అన్ని రకాల హీంస, ముఖ్యంగా లైంగిక దాడులను ఎలా అరికట్టాలో మనిషన్న ప్రతి వారు ఆలోచించాల్సిన బాద్యత ఉంది.
( Republished Post. OPD:10/10/2013).
Comments
Post a Comment