శ్రీ వాణి లాంటి స్త్రీలూ ఉంటారు! తస్మాత్ జాగర్త!

                                                                         

                                                           
                                సత్యమేవ జయతే నానృతమ్
                                సత్యేన పంథా వితతో దేవయానః
                                యేనాక్రమాంత్యా ఋషయోహ్యాప్తాకామా
                                 యాత్ర తత్సత్యస్య పరమం నిధానమ్

అర్థం : సత్యమే జయిస్తుంది, అసత్యం కాదు. సత్యం ద్వారా దివ్య (దేవ)మార్గం అవగతమౌతుంది. ఆ మార్గంలోనే ఋషులు తమ అభీష్టాలను వెరనేర్చుకొని పరమ నిధానాన్ని చేరుకోగలిగారు.
              రాష్ట్రంలో  సంచలనం స్రుష్టించిన అనంతపురం శ్రీ వాణి కేసు అటు పోలిస్ వారిని విస్మయ పరిస్తే, ఆమె కోసం పోరాడుతున్న ప్రజా సంఘాలను తల వంచుకునేలా చేసింది.

  అనంతపురం జిల్లాకి చెందిన శ్రీవాణి అనే యువతి రాఘవ అనే అబ్బాయిని ప్రేమించింది అట. వారి మద్య  చిగురించిన ప్రేమ ఎందుకో చిటపటలాడింది. దానితో ఆ అమ్మాయి ఆ అబ్బాయి మీద కసి పెంచుకుంది. ఈ మద్య అమ్మాయిల మీద ఆసిడ్ దాడులు, లైంగిక దాడులు ఎక్కువుగా జరుగుతుండడం, ప్రజా సంఘాల తీవ్ర నిరసనలతో అలర్ట్ అవుతున్న పోలిసులు సదరు కేసులును సీరియస్ గా తీసుకుని, వెంటనే నిందితులు మీద తగిన చర్యలు తీసుకుంటూండడం చూసిన శ్రీ వాణి కి చట్టుకున ఒక ఆలోచన వచ్చింది. తన బాయి ప్రెండ్ మీద కసి తీసుకునే ప్లాన్ ఆమె మదిలో మెదిలి వెంటనే దానిని అమలులో పెట్టింది.

  తన స్నేహితులు ఇద్దరను పురమాయించి, ఒక యాసిడ్ బాటిల్ తెప్పించుకుని, వారి చేతే తన చేయి మీద పోయించుకుంది.యాసిడ్ అనేది ఎలాగు మండుతుంది కాబట్టి, సహజంగానే ఆమె పెట్టిన పెడబొబ్బలు సీను ను పండించాయి. పోలిసులు రాఘవ మీద కేసు నమోదు చేసి శ్రి వాణి ని హాస్పిటల్ కి తరలించారు.శ్రీ వాణి ఏ మాత్రం నదురు బెదురు లేకుండా రాఘవ మీద స్టేట్మెంట్ ఇచ్చింది. శ్రి వాణికి మద్దతుగా అనంతపురం లోని విద్యార్ది, మహిళా సంఘాలు ఆందోళన చేసాయి. పోలిసులు, అనంతపురం S.P  గారి ప్రత్యేక పర్యవేక్షణలో కేసు ని కూలంకషంగా దర్యాప్తు జరిపి శ్రీ వాణి దాచి పెట్టిన నిజాలను బయటకు తీసి అనంతపురం పోలిసులంటే ఏమిటొ శ్రీ వాణి లాంటి వారికి తెలిసి వచ్చేలా చేసారు.

  అభియోగం మోపబడినంత మత్రానా నిందితులు నేరస్తులు కాజాలరు. ఒక వేళ పోలిసులు కూడా ఎవరి ప్రోదల్బంతోనైనా సరిగా విచారణ చేయకుండా,నిర్దోషులు మీద చార్జ్ షీట్ దాఖలు చేసినా సరే, నిర్దోషులైన వారు బీతిల్లవలసింది ఏమి లేదు. కోర్టు వారు అన్ని విషయాలను కూలంకషంగా విచారణ జరిపి, నిందితుని డిపెన్స్ సాక్ష్యం, వాదనలు పరిశిలించి "దోషి" అని తీర్పు ఇస్తేనే నేరస్తుడు క్రింద లెఖ్ఖ. అంతవరకు వారు నిందితులే.  నిర్దోషులైన నిందితులు కోంచం సహనం వహించి, పట్టుదలతో తమపై మోపబడిన నేరం నిజం కాదని నిరూపించుకోవాలి. దీనికి ఎంతొ వ్యయ ప్రయాసలకి ఓర్చుకోవడమే కాక, పరువు పోయి సమాజం లో నవ్వుల పాలు కావాల్సి వస్తుంది.

   మన దేశ ప్రజల దౌర్బాగ్యం ఏమిటంటే తప్పుడు కేసులు పెట్టే వారికి తక్కువ శిక్షలు తప్పా కఠిన శిక్షలు లేవు. విచిత్రమైన విషయం ఏమిటంటే ఒక వ్యక్తి తప్పుడు సాక్ష్యాదారలు చేత కఠిన శిక్షను పొందితే, అది బవిష్యత్లో ఎదైనా అవకాశాల చేత, తప్పుడు కేసు అని నిరూపించబడితే, అప్పుడు మాత్రమే తప్పుడు కేసులు పెట్టిన వారిని శిక్షింప చేస్తారు తప్పా, లేకుంటే నష్ట పరిహారానికి సివిల్ కోర్టులో దావాలు వేసుకోమంతటారు. ఎందుకంటే తప్పుడు అభియోగాల మీద క్రిమినల్ కేసులు నడపాలంటే ఆ కేసును విచారించిన జడ్జ్ లు కూడా సాక్షులుగా వేరే కోర్టులకు రావాల్సి ఉంటుంది.అంతే కాదు ఒక కేసు తేలటానికి అయిదు ఆరేళ్ళు పడుతుంది. మళ్లీ  తప్పుడు కేసు పెట్టిన వారి మీద కేసుపెట్టి నడపాలంటే మరొక అయిదారేళ్ళు పడుతుంది కాబట్టి, ఆ.. పోయిందేదో పోయిందిలే. మరి ఇంకా రిస్క్ తీసుకోవటం ఎందుకు అని నిర్దోష నిందితులు నిట్టూర్పులు విడుస్తూంటారు. ఇది తప్పుడు కేసులు పెట్టి బ్లాక్ మెయిల్ చేసే వారి పట్ల వరంగా మారుతుంది. అందుకే వారు నిస్సంకోచంగా తప్పుడు కేసులు పెడుతూ తమ ప్రత్యర్దులని హీంసిస్తుంటారు.చివరకు ప్రత్యర్డులు బలవంతులు అయితే వారు కూడా అలాంటి కేసులే కౌంటర్ కేసులుగా పెట్టడం , చివరకు కాంప్రమైజ్ చేసుకోవడం మన న్యాయ వ్యవస్థ లో ఒక తంతుగా మారింది . బల హీనులైతే కాళ్ళ బేరానికి రావడం తప్పా గత్యంతరం లేదు .  దీని వలన అటు పోలీసులకు , ఇటు లాయర్లకు లాభమే కానీ నష్టం లేదు కాబట్టి వారు ఇటువంటి విదానం సంస్కరించ బడాలని కోరుకోరు . 

  భారత దేశం  యొక్క అధికార చిహ్నం అయిన ఆశోకుని దర్మ చక్రం తో పాటు జాతీయ నినాదం "సత్యమేవ జయతే" అని ఉంటుంది. కాని ఆ సత్యాన్ని కాపాడటానికి మన ప్రభుత్వాలు  ఘోరంగా విఫలమయ్యాయి అని చెప్పటానికి సందేహించవలసిన పని లేదు. తప్పుడు కేసులు పెట్టడం ఇండియాలో ఒక లాబసాటి వ్యాపారమయింది అంటే మన ధర్మాన్ని కాపాడడంలో మనం ఎంత విఫల మయ్యామో అర్దం చేసుకోండి . ఒక కేసు తప్పుడు కేసు అని ఒక కోర్టు ఒక అభిప్రాయానికి వచ్చాక దాని మీద చర్యలు తీసుకోవడానికి మరొక కేసు వేసుకోవాల్సిన అవసరం ఉందా? అదేమిటంటే టెక్ణికల్ గా "నేరం నిరూపించడం లో ప్రాసిక్యూషన్ విపలమయింది" అంటున్నారు కానీ ఇది "తప్పుడు కేసు మోపబడింది" అనటం లేదుగా అని అంటుంటారు. ఇటువంటి టెక్నికల్ నేర విచారణలు వల్లా ఎవరికి లాభం? ఒక కేసు విచారణ చేస్తే దానికి సంబందించిన అన్ని విషయాలూ ఒకే చోట, ఒకే సమయం లో తేలి పోవాలి. ఒక వ్యక్తి మీద నేర నిరూపణ కాలేదు అంటే అతడు నిర్దోషి అని అర్దం కాదా? పెట్టిన కేసు తప్పుడు ది అని కాదా? ఈ దిక్కు మాలిన ఇంగ్లీష్ న్యాయ విదానం వల్ల పట్ట పగలు హత్యలు,మానబంగాలు జరుగుతున్న వ్యవస్త అభివ్రుద్ది చెందుతుంది. అందుకే "మన న్యాయం "  మనకు కావాలి. నేరం చేసిన వారికి, తప్పుడు కేసులు పెట్టె వారికి, తప్పుడు సాక్ష్యాలు చెప్పే వారికి కఠిన శిక్షలు ఉంటే తప్పా, నేర గాళ్ళకు భయం కలగదు. రాజ్య దండన అంటే భయమ్ లేక పోవడానికి ముఖ్య కారణం అయిన మనం అనుసరిస్తున్న ఎప్పుడొ ప్రవేశ పెత్టబడిన పరాయి  న్యాయ విదానం అయిన," ఒకే విషయానికి అనేక కోర్టుల విచారణ "   అనే . దానిని సమూలంగా మార్చి, పైన చెప్పిన విదంగా "మన న్యాయ విదానం"     అయిన  "ఏక ద్వార  న్యాయ విదానం " ప్రవేశ పెట్టి మన అధికారిక నినాదం  అయిన "సత్యమేవ జయతే " ని సాదించాలి . లేకుంటే శ్రివాణి లాంటి వారి చేష్టలకు "నిర్భయ" లాంటి  చట్టాలను కూడా ప్రజలు వ్యతిరేకిస్తారు. అంతిమంగా నష్ట పోయేది అబలలే.    
                                     (Republished Post. OPD 20/09/2013.)                      

Comments

  1. ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేసిన స్త్రీలను శిక్షించే కోర్టులుగానీ ప్రభుత్వాలు గానీ లేవు.
    ఇటువంటి నిరాధారమైన ఆరోపణలు చేసినవారెవరిపైన అయినా పరువునష్టం కేసులు వేసే వీలు ఉంది కదా ?

    ReplyDelete
    Replies
    1. పరువు నష్టం కేసు అనేది సివిల్ కేసు. దానిని తేల్చడానికి యేండ్లు పడుతుంది. డిఫమేషన్ క్రింద క్రిమినల్ కేసు కూడా పెట్టొచ్చు. కాని నేను అనేది ఏమిటంటె ఒక కేసు విచారించడానికి యేంద్లకు యేండ్లు పట్టె మన దేశం లో ఒక కేసు లో ఉత్పన్నమయ్యే అంశాలు వాటికి సంబందించిన అన్ని పరిష్కారాలు అదే కేసులో తేల్చి వేస్తే సరిపోతుంది కదా? దీని వలన బాదితులకు సరి అయిన న్యాయం సకాలం లో లభిస్తుంది కదా అని. పోని సివిల్ జడ్జ్ లు , క్రిమినల్ కేసులు విచారించే వేరు వేరుగా ఉనారా అంటె అదీ లేదూ. ఒకే జడ్జ్ అటు క్రిమినల్ కేసులు , ఇటు సివిల్ కేసులూ ఒకే కోర్టులో విచారిస్తున్నారు. కాకపోతే సివిల్ కేసులు విచారించేటప్పుడు జడ్జ్ అని, క్రిమినల్ కేసులు విచారించేటప్పుడు మెజిస్తెట్ అని వ్యవరింపబడుతారు . జిల్లా కోర్టులో అయితే డిస్ట్రిక్ట్ జడ్జ్ , సెషన్ జడ్జ్ అని పిలువబడుతారు. అంతే తేడా! ఒకే వ్యక్తి సివిల్ కేసులూ, క్రిమినల్ కేసులూ చూసే దేశం లో బాదితులకు సివిల్ న్యాయం, క్రిమినల్ న్యాయం ఒకే కేసులో ఒకే సమయం లో అందిస్తే కలిగే నష్టం ఏమిటి?

      Delete

Post a Comment

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

కలికాలం.. రివర్స్ కాలం..కాలజ్ఞానం