"గడ్డ పగిలిపోవును గాక ! గడ్డ పగిలిపోవును గాక " అని గొంతెత్తి విజ్ఞాన వేదిక లను సవాలు చేస్తున్న "దేవుని బిడ్డలు".
హిందువులు ఒక యజ్ఞం చేస్తుంటే అజ్ఞానం అంటారు. దేవుని కి అభిషేకం చేస్తుంటే పాలు ఎందుకు వేస్ట్ చెయ్యడం అంటూ సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెట్టెస్తుంటారు. వందల యేండ్లుగా నయా పైసా తీసుకోకుండా ఉబ్బస వ్యాది ఉపశమనానికి ఉచితంగా "చేప ప్రసాదం " ఇస్తుంటే సభలు పెట్టి మరీ నానా యాగీ చేస్తుంటారు. దేశం లో సైన్స్ తెలిసిన మేమే పెద్ద విజ్ఞానులం , పూజలు చేసే హిందువులు అంతా పెద్ద పిచ్చి పువ్వులే అని పిచ్చి పిచ్చి ప్రేలాపనలు చేస్తుంటారు.సైన్స్ వేరు . నమ్మకం వేరు. దీనిని భారత రాజ్యాంగం కూడా అంగీకరించింది. అయినా సరే పదే పదే హిందువుల మనోబావాలను తీవ్రంగా గాయపరుస్తూ విదేశి శక్తుల మెప్పును పొందుతుంటారు.ఇదీ, తాము మాత్రమే జనానికి విజ్ఞానం అందించే పని చేస్తున్నామని ప్రజలని నమ్మింప చూస్తున్న కొంతమంది "విజ్ఞాన బాబుల " నిత్యక్రుత్యాలు. పైకి వీరు చేసేది విజ్ఞాన బొదలె అని జనానికి అనిపించినా , నిజానికి వారు చేస్తుంది మాత్రం, విదేశి మతాలు చేసే మత మార్పిడులకు పరోక్షంగా సహాయం చేయడం . అదెలాగో చూడండి.
భారత రాజ్యాంగం ప్రకారం మనిషి ఆరోగ్యానికి భంగం కలిగించనంత వరకు తాము నమ్మిన మతాచారాలు తో కూడిన సాంప్రదాయ వైద్య ప్రక్రియలు గురించి ప్రచారం చేసుకోవడం లో తప్పులేదు. కాని క్యాన్సర్ వంటి బయంకర వ్యాదులకు కూడా ఏ మందులూ వాడకుండా కేవలం తమ దేవున్ని ప్రార్దిస్తే అంతా నయం అయిపోతుందని బాహాటంగా సభలు పెట్టి ప్రచారం చేస్తూ, కొంతమందికి ట్రైనింగ్ ఇచ్చి తమ భూటకపు ప్రచారానికి వాడుకుంటూ , పబ్లిక్ గా "అద్శునిక వైద్య విదానం " ని గేలి చేస్తుంటే , ఈ సోకాల్డ్ విజ్ఞానవాదులకు కనిపించడం లేదా? కనిపిస్తే వారి మీద కోర్టుల్లో కేసులు ఎందుకు వేయరు? వేస్తే వారికి వచ్చే విదేశి దన సహాయం ఆగుతుందని బయమే కదా? ఈ దేశం లో విదేశి మతస్తులు మత మార్పిడులు చేసే ప్రక్రియలో బాగంగానే ఇటువంటి భూటకపు ప్రదర్శనలు ఇస్తున్నారు. అన్యమతాల వారికి పరోక్షంగా సహకరిస్తున్నారు కుహనా విజ్ఞాన వాదులు అనడానికి ఇంతకంటె నిదర్శనం ఏమి కావాలి ?. నిరంతరం పనికట్టుకుని కేవలం హిందూ మతాచారాలు మీద విరుచుకు పడుతూ , విదేశి మత విదానాలు గురించి పల్లెత్తు మాట అనని సోకాల్డ్ విజ్ఞాన వాదుల దుష్ట సంకల్పాన్ని హిందువులు అంతా ఖండించి తీరాలి.
ఏదైనా ప్రాణహాని కలిగించే రోగాలు వచ్చినప్పుడు. "మందులు తీసుకొండి దానితో పాటు దేవుని మీద నమ్మకం కలిగి ఉండండి " అని చెప్పేదే హిందూ జీవన విదానం . దీని వలన రోగి తీసుకునే మందులు కూడా చాలా ప్రబావ వంతంగా పని చేస్తాయి అనేది చాలామంది విషయం లో రుజువు ఆయింది. కాని అసలు రోగానికి ఏ మందూ తీసుకోవద్దు , కేవలం తమ దేవుని ప్రార్ధనలే రోగాలను నయం చేస్తాయి అని పబ్లిక్ గా నాటకాలు ఆడుతూ , తమ ప్రదర్శనలకు అమాయకులను రప్పించి , వారి ముందు ఈ భూటకపు ప్రదర్శనలు చేస్తూ, వారిని తమ మతం లోకి మార్పిడి చేస్తున్న ఈ విదేశి మతాచారాల ముటాల మీద తగిన చర్యలు తీసుకోవలసిన అవసరం ప్రభుత్వాల మీద ఎంతైనా ఉంది. 6 నెలలుగా రొమ్ము మీద గడ్డతో బాదపడుతున్న రోగిని సరి అయిన మెడిసిన్స్ తీసుకోనియకుండా కేవలం తమ స్వస్తత ప్రార్థనలు చేస్తే సరి పోతుందని నమ్మించి మోసం చేస్తూ , చివరకు ఆ గడ్డ పగిలితే , అదేదో తమ దేవుడు పగలగొట్టాడని " యేసు నామమున గడ్డ పగిలిపోవును గాక " గడ్డ పగిలిపోవును గాక " అని వారు గొంతెత్తి ఆధునిక వైద్య విదానాలను గేలి చేస్తున్న విదానాన్ని ఈ క్రింది వీడియో లింక్ లో చూడవచ్చు.అలా పబ్లిక్ గా " మీ విజ్ఞానపు గడ్డలు ను మా ప్రార్ధనలతో పగుల గొడతాం అని అని తొడకొట్టి సవాలు చేసే వారి పట్ల విజ్న్నాన బాబులు ఎందుకు ఉదారంగా వ్యవరిస్తున్నారు? దమ్ముంటే వారిని నిరోదించాడానికి ముందుకు రావాలని జన విజ్ఞాన వేదికలు లాంటి వారిని హిందూ సంస్తలు సవాల్ విసురుతున్నాయి. మరి ఆ సవాల్ ని స్వీకరించే దమ్ము విజ్ఞాన బాబులకు ఉందా?
one of my friends father visited such a fake christian healers at chennai and finally spoiled his knee cap.very recently[just 3 months back only]he changed his knee cap wth an allopathic ortho surgeon..
ReplyDeleteమీ మిత్రుని తండ్రి గారి విషయం లో జరిగిన దారుణం మరేవరి జీవితం లో జరుగ రాదు.కాబట్టి ఇటువంటి భూటకపు స్వస్థత కూటములను ప్రభుత్వం నిషేధించాలి.
ReplyDeleteవిజ్ఞాన బాబు వారల్
ReplyDeleteఅజ్ఞానములకు జిలేబి ఆహా యిచ్చెన్
ఈ జ్ఞాన డోసు! యొహొవా
సుజ్ఞానము లంచు రోగ చూపరి జాదూ
CV21 June 2016 at 12:36
ReplyDeletehttps://saviourwords.blogspot.in/2016/06/blog-post_20.html?showComment=1466492420233#c4966031903844246304 పై లింక్ ని ఒకసారి చుడండి వారి అజ్ఞానం ఎలా చ్పిస్తున్నారో
రక్షకుని మాటలనుచున్
ReplyDeleteఅక్షరమగు హిందు సంప్రదాయముల పయిన్
కక్షల పలుకులు యనిరే !
తక్షణ దీపకుడు జెప్ప థామసు గాయబ్ !