ఈ ఇల్లు కొన్న వారికి ,ఆ ఇంటావిడ "ఫ్రీ " అట !!!?

                                                                               

స్త్రీ స్వేచ్చా , స్త్రీ స్వేచ్చా ,ఎంతవరకు వచ్చిందే నీ పయనం అంటె , ఇంటితో పాటు ఇంటావిడను కూడా అమ్మే వరకు " అందట . అలా ఉంది ఈ ఇండోనేషియన్ ఆధునిక ఇల్లాలు చేసిన పని. అదేమిటో చూదామా ?

    ముందు ఇల్లును చూసి,ఆ తర్వాత ఇల్లాలును చూడాలి అని మన పెద్దలు అంటుటారు .దీనిలో విశేషం ఏమిటంటే ఒక ఇల్లాలి అభిరుచులు , నైపుణ్యం ,సమర్ధత అనేది ఆమె నిర్వహించే గృహ నిర్వహణ లో తెలుస్తుందని మన పెద్దల అభిప్రాయం . ఇక పొతే ,సంప్రాదాయ' ఇల్లు -ఇల్లాలు 'కాన్సెప్ట్ ని నిరసించే స్త్రీ వాదులు   స్త్రీలను పురుషులతో సమానంగా ఎదగకుండా చేస్తున్న అంశాల్లో, ఇంటి బాద్యతలు స్త్రీలకు అప్పచెప్పడం ఒకటని అంటారు. స్త్రీలను పురుషుల ఆస్తిగా బావిస్తున్నారని , ఆ ఆదిమ  బావన వలననే నేటికి స్త్రీలను గృహ నిర్భందం కు గురిచేసి వారికి గల స్వేచ్చా స్వ్వాతంత్ర్య హక్కులను హరిస్తున్నారు అని తెగ బాధపడి పోయె వారి సంఖ్య తక్కువేమి కాదు . మరి అటువంటి వారికి ఒక స్త్రీ అందులో ఒక ఇంటికి సర్వ హక్కులు కలిగిన యజమాని ,తను కూడా తన ఇల్లు లాగే ఒక ఆస్తి అనే తరహాలో ,అడ్వర్టైస్ మెంట్ ఇచ్చిందంటే ,దానికి స్త్రీ  వాదులు  ఏమంటారు ? ఈ తరహా ప్రకటన పురుషులు ఇవ్వ గలుగుతారా ? వివరాలు లోకి వెళితే

 ఇండోనేషియా కి చెందిన ఆ ఇల్లాలుకి భర్త ,ఇద్దరు పిల్లలు తో పాటు ముచ్చటైన స్వంత ఇల్లు,స్వంత కారు  కూడా ఉన్నాయి  .ఆమె వృత్తిరిత్యా బ్యూటిషియన్ .  ఆమె భర్త గారు ఈ మద్యనే చని పోయారు అట . ఆమె వయస్సు 40 +.  ఆమెకు డబ్బు అవసరమైంది అనుకుంటా . అందుకే బేర సారాలు లేని ఒక సంచలన ప్రకటన ఇచ్చింది . ఒక దీవిలో ఉన్న తన ఇంటిని 75,000 డాలర్లకు అమ్ముతున్నట్లు ఆన్లైన్ లో ఒక ప్రకటన ఇచ్చింది . బేర సారాల్లేకుండా పిక్సేడ్ రేట్ కు అమ్ముతున్నందుకు ,అలా కొనేందుకు ముందుకు వచ్చే "మగ ధీర " లకు ఒక బ్రహ్మండమైన ఫ్రీ గిప్ట్ ఆఫర్ కూడా ప్రకటించింది . తన ఇల్లు కొనే వారు తనను ఫ్రీ గా పొందవచ్చు అనేదే ఆ ప్రకటన సారాంశం . ఆప్కోర్స్ వివాహం అనే మాట కూడా వాడినా ,అది టెక్నికల్ రీజన్ అయుంటుంది . ఆ ఇంటి యొక్క వాస్తవ విలువ అంత ఉండదని ఆమెకు తెలిసే ,ఆ ఇంటి తో పాటు తనను పొందవచ్చు అనే దౌర్భాగ్యపు ప్రకటనతో "మగ కొనుగోలు దారులను " మాత్రమె ఆహ్వానించింది . ఈ విదంగా స్త్రీలు కూడా "హౌస్ ప్రాపర్టి " లోబాగమే  అని ప్రపంచానికి ప్రకటన చేసి నట్లు అయింది .ఈ విషయం సంచలనం అయ్యే సరికి ,లోకల్ పోలిసులు "నీకిదేం పోయె బుద్ది " అని నిల దీసే సరికి 'అయ్యో ,నేను అందరికి చెప్పమన లేదు .లిమిటేద్ గా "మగ ధీరులకు " చెప్పమంటే , ఇల్లు అమ్మి పెట్టేవాడు ,ఆన్ లైన్ లో పెట్టి ఇంత హంగామా చేసాడు, అందట . అంటె మొత్తానికి తనను ఫ్రీ గిప్ట్ గా చూపి తన ఇల్లును అమ్మాకానికి  పెట్టిన మాట వాస్తవమే అని ఒప్పుకుంది ,ఈ ఇద్దరు పిల్లల తల్లి . అదీ విషయం .


క్రింది వీడియోలో ఏదో చెపుతుంది ఆ మహా తల్లి. నాలాంటి సాంప్రదాయ వాదులకు అర్ధం కాదు ఆమె గారి ఆధునిక బావజాలం  . నవ నాగరీకులకు  ఎవరికైనా అర్ధం అయితే "అర్దాంగిగా " చేసుకోవచ్చు . బెస్టాఫ్ లక్ .
                
                   

                                                  Republished Post. 

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మన రాష్ట్రంలో ట్రెజరీ జీతాల కోసం "చర్చ్ పాధర్ " లు రోడ్లెక్కిన సందర్బాలు ఎప్పుడైనా చూసారా ??

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన