"మగబుద్ది" గురించి 'మనవు' చెప్పిన విషయాన్ని నిజమని రుజువు చేసిన "తెహెల్కా " చీఫ్ ఎడిటర్ తరుణ్ తేజ్ పాల్ అత్యాచార ఉదంతం
నేను ఇంతకు ముందు పోస్టులో మగ బుద్ది అనేది చంచల మైనది, అది జన్మతః వస్తుంది , కానీ అబ్యాసం అంటే విద్యా సంస్కారాలు చేత దానిని కంట్రోల్ చేయవచ్చు అని చెప్పటం జరిగింది. అంతే కాదు మగవారు సంస్కార హీనులుగా మారకుండా ఉండదానికి సమాజం లో స్త్రీలు కూడా కొన్ని కట్టుబాట్లు పాటించాల్సి ఉంటుంది. కానీ స్వేచ్చా తప్పా మరేది చెప్పొద్దనే వారు వాస్తవాలను పరిగణన లోకి తీసుకోకుండా అలవిమాలిన ఆదర్శ సూత్రాలు వల్లే వేస్తూ చివరకు సమాజములో "నేరము -శిక్ష" అనే ఏకైక పందానే మగవారిని నియంత్రించి స్త్రీలకు రక్షణ ఇవ్వగలుగుతుందని నమ్ముతున్నారు. ఈ సందర్భంగా నేను ఇదివరకు ప్రచురించిన టపా"మగబుద్దిని కంట్రోల్ చెయ్యాలంటే మగువలను దూరంగా ఉంచడం లాంటి సాంప్రదాయక విదానమే బెస్టా?" అనే దానిలో
"అసలు స్త్రీల పట్ల చాలా మంది మగాళ్ళు ఎందుకు చంచల బుద్దితో ప్రవరిస్తారు ? దీనికి పైకి చెప్పే కారణం ఒకటే . సంస్కార హీనులైన వారే అలా ప్రవర్తిస్తారు అని. కానీ ఎన్నో ఏండ్లుగా సంస్కారవంతులుగా చలామణీ అయిన వారు సహితం, స్త్రీల ఔన్నత్యాలు గురించి, పురుషుల కుసంస్కారాలు గురించి ఎడతెగని లెక్చరర్లు దంచిన వారు సహితం ఏదో ఒకనాడు హట్టాతుగా ఒక స్త్రీ పట్ల అనుచితంగా ప్రవర్తించాడు అన్న ఆరోపణలకు గురై అందరిని విస్మయ పరుస్తాడు. స్త్రీ పురుషుల మద్య ఆరోగ్యకరమైన సంబందాలు కొనసాగింపు విషయం లో మన పూర్వీకులకు ఉన్న అవగాహనలో అరవైయ వంతు కూడా అడునికులకు లేదు అనిపిస్తుంది. కడుపున పుట్టిన కూతురైనా సరే , తండ్రి తో ఒకే మంచం మీడ పడుకోవటానికి అనుమతించరు పెద్దలు. ఎందుకని? ఆ తండ్రి మీద అనుమానం కాదు,అతనిలో ఉన్న "మగ బుద్ది " ని కంట్రోల్ లో పెట్టి కుటుంభ బందాలు ఆరోగ్యకరంగా సాగేందుకు ఏర్పరచుకున్న పద్దతి. అంతే !" అని చెప్పటం జరిగింది
నేను అంత ఘంటా పదంగా ఆ విషయం చెప్పడానికి కారణం నాలోని సాంప్రదాయ బావాలు కావు. యా బైయేండ్లు ఒక మగవాడిగా నాకున్న అనుభవం, నేను పరిశిలించిన సమాజం ఇవ్వన్నీ నా లో ఆ అభిప్రాయాన్ని కలిగించాయి. నేను శాస్త్ర వేత ను కాకపోయినా శాస్త్రీయ ద్రుక్పదాలను మాత్రం గుడ్డిగా వ్యతిరేకించను. "బ్రహ్మ కైనా పుట్టు రిమ్మ తెగులు".అని మన పెద్దలు ఎంతో అనుభవ పూర్వకంగా చెప్పిన దానిని వారి వారసులమయి న మనం అంగీకరించక పోతే వాస్తవాన్ని గ్రహించడం లో విపలంయ్యాము అనే అనుకోవాలి . పూర్వం విశ్వామిత్రుడు అనే రాజరిషి బ్రహ్మ గురించి ఘోర తపం చేస్తున్న వేళ అయన తపోభంగం కోసం ఇంద్రుడు "మేనక " అనే దేవవేశ్య ను పంపుతాడు. అంత గొప్ప రుషి కూడా అల్పమైన సుఖం కోసం , తానూ చేసే తపం వదిలేసి ఆమెతో కూడి తపోబంగం చేసుకుంటాడు . అయన కంటే గొప్పవారేమి కాదు కదా ఇప్పట్టి సామాన్య మగవాడు. ఆ.. అది పుక్కిట పురాణం అనుకునే వారు , ఈ గ్రేట్ మగవాడి ఉదంతం ను చదవండి.
సంచలనాత్మక పరిశోదానా జర్నలిజం కి మారుపేరైన "తెహెల్కా " వీక్లీ న్యూస్ మేగజైన్ వ్యవస్తాపక చీప్ ఎడిటర్ "తరుణ్ తేజ్ పాల్", పరిశోదన జర్నలిజం లో ఉన్న యువ జర్ర్నలిస్టులుకు స్పూర్తి ప్రదాత మరియు ఆదర్శ ప్రాయుడు. మరి అటువంటి ఆదర్శ మూర్తి తన దగ్గర పని చేసే లేడి జర్నలిస్ట్ మీద లైంగిక దాడికి పా ల్పడతడని అయన గురించి తెలిసిన వారెవ్వారూ ఊహించని విషయం. ఒక బ్లాగు మిత్రుడి మాటల్లో
"ఆధునిక భారతదేశంలో పరిశోధనాత్మక జర్నలిజానికి కొత్త ఊపు తెచ్చిన తరుణ్ తేజ్ పాల్ తన దగ్గర పనిచేసే ఒక మహిళా జర్నలిస్టుపై గోవా ట్రిప్ లో లైంగిక దాడికి పాల్పడడం నివ్వెర పరుస్తోంది. తెలుగు నేల మీద ఎడిటర్లు, మీడియా యజమానుల రూపంలో ఉన్నకామ పిశాచుల కోవలోకి తరుణ్ లాంటి గొప్ప జర్నలిస్టు రావడం దారుణం. జర్నలిజానికి ఇదొక పాడు రోజు. వినూత్న స్టింగ్ ఆపరేషన్స్ తో ఎన్నో కుంభకోణాలను, పాడు పనులను వెలుగులోకి తెచ్చి ఒక తరం జర్నలిస్టులకు వృత్తి పట్ల కొత్త ఆశలను రేపిన తరుణ్ ఇలాంటి దారుణానికి పాల్పడడం బాధాకరం కాక మరేమిటి? "
(Republished post. OPD:21/11/2013)
Comments
Post a Comment