Ex బాయ్ ప్రెండ్ ని కాదని ఫ్రెష్ బాయ్ ప్రెండ్ తో రొమాన్స్ చేస్తే, రోమ్ లో కూడా కాల్చి చంపడం ఖాయమట !!


ఇదిగో మరొక రుజువు దొరికింది. అదేనండి ప్రపంచం లో ఏ దేశం లో అయినా బాయ్ ప్రెండ్ , బాయ్ ప్రెండే , వాడిలో ఉండే  మగబుద్ది ఎక్కడైనా ఒకటే అనే దానికి రుజువు.కొంత మంది మనస్తత్వం ఎలా ఉంటుంది అంటె , పెళ్ళాం విడాకులు ఇచ్చి మరొక వ్యక్తిని పెండ్లి చేసుకున్నా పెద్దగా బాదపడరేమో కాని, గర్ల్ ప్రెండ్ కొంత కాలం తనతో తిరిగి , ఏదో కారణం తో మరొక బాయ్ ప్రెండ్ ను చూసుకుంటే చచ్చినా ఒప్పుకోరు. "దాన్ని చంపి నేను చస్తా " అంటారు. అంతేగా మరి! సంసార బందం కంటె బలియమైనది రంకు సంబందం. దానినే మై చాయిస్ వాదులు ప్రేమ బందం అంటారు కాబోలు!

                      సరే, ఇంతకి అసలు విషయం ఏమిటంటే సో కాల్డ్ ఈ  ప్రేమ విషయాలలో బాయ్ ప్రెండ్లు  చాలా సీరియస్ గా  ఉంటూ గర్ల్ ప్రెండ్స్ తమ సొత్తు అయినట్లు , వారు తమని కాక వేరెవరి వంక చూసినా తట్టుకోలేక అతి కిరాతకంగా డాడి చేసి చంపడానికి కూడా వెనుకాడరు . ఇందుకు ఉదాహరణ , మన రాష్ట్రం లో జరిగిన శ్రీ లక్ష్మీ, మనోహర్ కేసు, వరంగల్ ఎన్ కౌంటర్ కేసు. అదే కోవలోకి వస్తుంది ఇటీవల రోమ్ లో అతి కిరాతకంగా వెంటాడి గర్ల్ ప్రెండ్ ను సజీవ దహనం చేసిన బాయ్ ప్రెండ్ ఉదంతం. వివరాలులోకి వెలితే 

   రోమ్ నగరం లోని ఒక విశ్వవిద్యాలయం లో చదువుకుంటుంది 22 ఏండ్ల Sara Di Pietrantonio ఆమె బాయ్ ప్రెండ్ పేరుVincenzo Paduano, . ఇతని వయస్సు 27 యేండ్లు . చేసే పని సెక్యూరిటీ గార్డు. కుదిరినంత కాలం జామ్ జామ్ గా ఎంజాయి చేసారు. కాని ఎందుకో ఆ గర్ల్ ప్రెండ్ కి బాయ్ ప్రెండ్ మీద విరక్తి కలిగి , ప్రెష్ గా ఇంకొక బాయ్ ప్రెండ్ ను చూసుకుని అతనితో చెట్టా పట్టాలు వేసుకుని తిరగసాగింది. దీనితో మాజీ బాయ్ ప్రెండ్ కి మనసు రగిలి పోయింది. నాకు దక్కనిది మరొకరికి దక్కుటకువీలు లేదని గాడంగా తీర్మానించుకుని , గర్ల్ ప్రెండ్ ని ఎలాగైనా ఖతం చేయాలి అనుకున్నాడట. 

                                                                     
   

                                      మొన్న ఆదివారం తెల్లవారు ఝామున 3 గంటలకు తన డ్యూటి ముగించుకుని , అక్కడనుండి సరాసరి తన గర్ల్ ప్రెండ్ యొక్క ప్రేష్ బాయ్ ప్రెండ్ ఇంటి ముందు కాపు కాయడం మొదలు పెట్టాడు. కొంత సేపు తర్వాత తన గర్ల్ ప్రెండ్ కారు ఆ ఇంటిలో నుంచి రావడం చూసి ఆమెను తన కారులో వెంబడించి , కొంత దూరం వెళ్లేసరికి ఎలాగో బలవంతంగా ఆమె  కారును ఆపేలా చేసాడు. కారు ఆగడం టూక ఉదుటున ఆమె కారులోకి ఎక్కాడు. దానితో వారిద్దరి మద్య వాగ్వాదం జరిగింది. బాయ్ ప్రెండ్ పట్ట రాని  కోపం తో  తన వెంట తెచ్చుకున్న మద్యం బాటిల్ లోని అల్కాహాల్ ను ఆమె మీద , కారు లోపల పోసేసరికి ఆమె బయం తో కారు దిగి పారిపోసాగింది . అతగాడు కారును సిగరెట్ లైటర్ తో వెలిగించే సరికి అది తగలబడ సాగింది. 

    అక్కడనుండి అతడు ఆమెను చెస్ చేసి 100 మీటర్లు వెళ్ళాక ముందే ఆమెను చేజిక్కించుకున్నాడు. ఆమె ముఖం పైన అల్కాహళ్ పోసి ఉండటం వలన , అతను వెలిగించిన సిగరెట్ లైటర్ ఆమెనుకూడా దహించడం మొదలు పెట్టి చివరకు ఆమె సజీవ దహనం అయ్యేలా చేసింది. ఈ  సంఘటణ చూస్తూ రెండు కార్లు అటుగా వెళ్ళాయి కాని ఎవరూ కారు ఆపి ఆమెను రక్షించడానికి ప్రయత్నించలేదట. బహుసా బాయ్ ప్రెండ్ , గర్ల్ ప్రెండ్ విషయం లో ఇది కామనే అనుకున్నారో ఏమో? ఆ తర్వాత పోలిస్ ఎంక్వరి లో మొదట బాయ్ ప్రెండ్ తన నేరం ఒప్పుకోకపోయినప్పటికి , 8 గంటల విచారణ తర్వాత మెల్ల మెల్లా గా పైన చెప్పిన కధ మొత్తం గ్రక్కాడు అట. దానితో అతని మీద కేసు పెట్టి కట కటాలోకి నెట్టారు పోలిసులు. 

   ఇక ఈ  కేసు గురించి రొం లో మహిళా సంఘాలు కూడా సేమ్ ఇండియాలో మహిళా సంఘాలు మాదిరే స్పందించారు అట. మగాళ్ళు మైండ్ సెట్ లో మార్పు రానంత కాలం ఇలాంటి దురాగతాలు జరుగుతుంటాయి అని అనగలిగారు తప్పా "మగాళ్ళు మైండ్ సెట్ లో మార్పు వచ్చే వరకు మ్రుగాళతొ జాగర్తగా ఉండాలి  అని చెప్పలెదట.కాకపోతే బాయ్ ప్రెండ్ లు బెదిరిస్తే పోలీసులకు చెప్పాలి అని  మాత్రం అన్నారట. ఇదే విషయం గురించి  ఇటలీ డెపూటి ప్రెసిడెంట్ గారు ప్రస్తావిస్తూ " ఇలాంటి సందర్బాలలో నేరం చేసిన మ్రుగాళ్ళు సిగ్గుపడాలి తప్పా , దారుణాలకు బలి అయిన స్త్రీలు కాదు " అన్నారట. చాలా సంతోషం ! ఆడపిల్లలు బలి కాగానే వారి కి కొవ్వోతుల నివాళులు అర్పించి , దిక్కులు పిక్కటిల్లేలా జోహార్లు నినదించి ఆ తర్వాత ఎవరింటికి వారు పోయి " ఛి ఈ మగ వెదవల మైండ్ సెట్ లుఇంతే అని ఒక నిట్టుర్పు విడచి నిద్ర పోతే సరి! 

   "మగపిల్లలకు అవకాశం ఇచ్చే  అతి చనువు పనికి రాదు, చదువుకునే పిల్లలు చదువు మీదద్రుష్టి పెట్టాలి తప్పా బాయి ప్రెండ్స్, గర్ల్ ప్రెండ్స్  మీద కాదు" అని చెప్పగలిగే వారు కుటుంబాలలో , సమాజం లో లేనప్పుడు , పిల్లల ప్రవర్తన మీద పెద్దల పర్యవేక్షణ కొరవడినప్పుడు ఇలాంటి దారుణాలె జరుగుతాయి అని నా అభిప్రాయం .  చేతులు కాలాక ఎన్ని ఆకులూ పట్టుకున్నా ఉపయోగం లేదు .   


Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!