తమ్ముడ్ని పెండ్లాడి, అన్న మీద మనసు పడితే చివరకు జరిగేది ఇదే!.

                                                       
                                                                                   

చలంగారు చెప్పిన కధల్లో మాదిరి మనుషుల జీవితాలు సాగితే చలం గారు కూడా దేవుడే అయి ఉండేవాడు. కాని చలం గారు ఒక మనిషి మాత్రమే! అందుకే అయన కోరుకున్న విదంగా సమాజం ఉండదు . ఆయన్ని నడిపించిన విది  ప్రకారమే సమాజం ఉంటుంది. ఆ విదే  విదాత. అతనికి గల మరో పేరే దేవుడు! మనస్సు నచ్చినట్లు ఎప్పుడూ చెయ్యటం కాదు మనిషి  కి ఉన్న స్వేచ్చకు అర్దం. ఇచ్చిన మాటకు కట్టుబడి, ఇతరుల స్వేచ్చకు బంగం కలిగించకుండా , తన పరిదిలో తానుండటమే   నిజమైన స్వేచ్చ. అటువంటి పరిదిని దాటిన వారు ఈ  సమాజం లో జీవించలేరు అని ఈ   క్రింది ఉదంతం తెలియ చేస్తుంది.

  ఖమ్మం నగరానికి 25 కిలో మీటర్లు దూరం లో ఉన్నది కూసుమంచి మండలం హెడ్ క్వార్టర్  కూసుమంచి . దానికి దగ్గర లో ఉన్న ఒకా నొక గ్రామం లో వెంకట్  అనే 35 సంవత్సరాల వ్యక్తీ మరియు అతని తమ్ముడు ఎంతో అన్యోన్యంగా ఉండే వారు. వారివువురూ వివాహితులు. వెంకట్ కు ఒక మగ పిల్లవాడు మరియు ఒక ఆడపిల్ల సంతానం. అతని తమ్ముడుకు ఇరువురూ ఆడపిల్లలు.వెంకట్ ఆటో డ్రైవర్ కాగా అతని తమ్ముడు గ్రానైట్ పాక్టరీలో కార్మికుడు.

   దురదృష్టవశాత్తు అతని తమ్ముడు బార్య తో  వెంకట్ కు అక్రమ సంబందం ఏర్పడింది. వారివురూ ఆ సంబందాన్ని కలిగి ఉండడం గమనించిన వెంకట్ బార్యా మరియు వెంకట్ తమ్ముడు ఇరువురిని మందలించి పెద్ద గొడవ చేసినా లాభం లేక పోయింది. చివరకు ఈ  గొడవలకు మనస్తాపం చెంది వెంకట్ కూతురు ఇంట్లో ఉరి వేసుకుని చనిపోయింది . ఆ దెబ్బతో పెద్దల సలహాతో వెంకట్ బార్యను తీసుకుని కూసుమంచి వచ్చి అక్కడే వేరు కాపురం పెట్టి జీవించ సాగారు.

    కాని రుచి మరిగిన ప్రాణం ఆగనట్లు , వెంకట్ తమ్ముడి బార్యకు ,వెంకట్ కు తాము కలుసుకోకుండా ఉండడం దుర్లబం అనిపించింది. అందుకే వెంకట్ మరదలు మొన్న శనివారం కూసుమంచి వచ్చి వెంకట్ ని కలిసింది . ఇరువురూ కలసి ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయించుకుని  ఆటోలో నల్గొండ జిల్లా , మోతే మండలం ఉర్లుగొండ గ్రామం కు చేరుకున్నారు. సాయంత్రం వరకు గ్రామం చివర చేలలో ఏకాంతంగా గడిపారు. ఆ తర్వాత తమ వెంట తెచ్చుకున్న పురుగుల మందు త్రాగి అపస్మారక స్తితికి చేరుకుంటే , అది చూసిన పశువుల కాపర్లు వారిని సూర్యా పేట ఆసుపత్రికి తరలించినా పలితం లేక పోయింది . వారిరువురూ  మరణించారు. అదీ కద!

      కుటుంబం లో సబ్యుల మద్య సంబందాలు ఆరోగ్య కరంగా ఉన్నప్పుడే వారి మద్య ఉన్న బందం బలపడుతుంది. కేవలం క్షణికావేశాలకు లొంగి పోయి , వావి వరసలు గమనించక ప్రవర్తించేవారు ఏ నాటికైనా నాశనం కాక తప్పదు. తుచ్చమైన శరీర సుఖాల కోసం కుటుంభ సొఖ్యాలు బలి ఇవ్వబూనడం మూర్కాతి మూ ర్కం. అటువంటి వారికి సమాజం లో స్తానం లేదు . అడవుల లోకి వెళ్లి జంతువులు లాగా బ్రతకాల్సిందే. అందుకే , అలా సమాజం బ్రతక లేకనే వెంకట్ అతని మరదలు ఆత్మహత్య చేసుకున్నారు. అంతకు మించిన మార్గం వారికి లేదు కాక లేదు. వారే కాదు కుటుంబ కట్టు బాట్లు, సామాజిక కట్టు బాట్లు అతిక్రమించిన వారికి చివరకు అదే గతి అని పై ఉదంతం వలన తెలుస్తుంది .   ఇటువంటి పరిస్తితులు తల ఎత్తినప్పుడు ఇరువైపులా తమ తప్పిదం గ్రహించి మొదట్లోనే వేరుగా దూరంగా  వెళ్లి ఉన్నట్లైతే ఇంత అనర్దానికి దారి తీసేది కాదు.    
                                                   (Republished post. OPD:07/01/2014).             

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

కలికాలం.. రివర్స్ కాలం..కాలజ్ఞానం