N.T.R. గారిని "హిందూ జీవన విదానానికి" దూరం చేసిందెవరు?
ఆంద్రుల అభిమాన నటుడు,నాయకుడు, తెలుగువారి ఆత్మ గౌరవానికి ప్రతీక గౌరవనీయులు నందమూరి తారక రామరావు గారు.ఆయన పక్కా హిందూ వాది. హిందూ జీవన విదానమయిన "ఆశ్రమ జీవన విదానం" పట్ల అనురక్తి ఉంది. అందుకే తాను ఎన్నో సార్లు "ఆశ్రమ జీవన విదానం" లోని మూడవ ఆశ్రమమయిన వానప్రస్తం లో ఉన్నానని ఇంకా "సన్యాసం" స్తాయికి రాలేదని చెపుతూ, అసెంబ్లీ లో చొక్క ఎత్తి, తన పంచె కట్టు ని చూపించారు. ఈ ఒక్క ఉదాహరణ చాలు ఆయన పక్కాగా "ఆశ్రమ జీవన విదానం" అనుసరించ దలచిన వ్యక్తి అని . కాని విది ఆడిన నాటకంలో ఆయన ఆ విదానం నుండి దూరం కాక తప్పలేదు. హిందువు "గ్రుహస్తాశ్రమ" దర్మాచరణాణికి మాత్రమే "వివాహం" చేసుకోవాలి. మూడు, నాలుగు ఆశ్రమాలయిన వానప్రస్తం ,సన్యాసం లలో "వివాహం" కూడదు. బార్య ఉన్నా, లేకపోయినా అమే తలపుల సహవాసం తోనే ఈ ఆశ్రమ ధర్మాలు నిర్వహించాలి.కాని అనూహ్యంగా ద్వితీయ వివాహ మాడి , హిందూ జివన విదానానికి దూరమయ్యారు