చీ..చీ..చీ,, ఇంత ఘోర కలి ఈ భూమి మీద ఉందా!?
ఇటువంటి సంఘటనలు గురించి చెప్పాలంటే మనస్కరించడం లేదు. ఎంతో మందిని ఎన్కౌంటర్ చేయగకలిగిన పోలీస్ వారు, ఎందుకు ఇటువంటి కేసుల నిందితుల పట్ల ఉపేక్ష వహించి, కోర్టు విచారణల పేరుతో కాలయాపన చేసి, నిందితులకు జీవించె హక్కు కల్పించడం?మీకు చేతకాకపోతే వారిని ప్రజల మద్యకు పంపించండి. వారే విదిస్తారు తగిన శిక్ష. రాజ్యాంగరక్షణ అనేది మనుషులకు మాత్రమే.జంతువులకు కూడ ఇవ్వొచ్చు. కాని మానవ రూపంలో ఉన్న మ్రుగాలకు మాత్రం ఎట్టి పరిస్తితుల్లో ఇవ్వ రాదు. అవసరమైతే వీరి కోసం షరియా చట్టాలు మాదిరి అమలు చేసినా తక్కువే!. నిన్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి సమక్షానికి ఒక ఇరవై నాలుగేళ్ళ అమ్మాయి వచ్చి తన గోడు వెళ్ళ బోసుకుంటుంటే అక్కడ ఉన్నవారంతా కొయ్యబారీ పోయారట. ఆ అమ్మాయిని గత తొమ్మిదేళ్ళుగా, అమ్మాయి తండ్రి, అన్న ఇద్దరూ అత్యాచారం చేస్తూ, తమ పశువాంచ ను తీర్చుకుంటున్నారట. దానికి ఆ తల్లి వత్తాసు కూడ ఉందట. దీని మీద స్పందించిన లక్నో పోలిసులు నిందితుల