Posts

Showing posts with the label NEET

లక్ష మంది విద్యార్దులు మరియు వారి తల్లి తండ్రులు Vs ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వము

                                                                                                                                     జులై రెండవ తారీకు దాక ఏ మద్యంతర ఉత్తర్వులు ఇచ్చేది లేదన్న బారత సర్వోన్నత న్యాయస్తానం హఠాత్తుగా నిన్న "నీట్’ పై వెలువరించిన మద్యంతర ఉత్తర్వులతో, ఆంద్రప్రదేశ్ లోని లక్షమంది వైద్య విద్య ప్రవేశ పరీక్షలు రాసిన విద్యార్థులు మరియు వారి తల్లి తండ్రుల ను పెద్ద "నీట్" గండం నుంది బయట పడేసారు. లేకుంటే గత నాలుగు నెలలుగా ఏమి చదవాలో, ఏమి రాయాలో తెలియని ఆయోమయ పరిస్తితిలో విద్యార్థులు, వారు పడుతున్న టెన్షన్ చూసి, బాదతో తల్లడిల్లిన తల్లితండ్రులు మరియు మనసున్న లెక్చరర్లు అందరూ మరొక రెండు నెలలు టెన్షన్ కు గురి కావల్సి వచ్చేది. అసలు ఇలా జరగడానికి కారకులు ఎవరు?.    వైద్య విద్యా విదానంలో జాతీయ స్తాయిలో ఒక సమగ్ర విదానం ఉండాలన్న ఆలోచనకు అనుగుణంగా బారత వైద్యమండలి, జాతీయ స్తాయిలో" నీట్" పరీక్షను తప్పని సరి చేస్తూ, ఈ సంవత్సరం నుండే ఇది అమల్లోకి వస్తుందని ప్రకటించడంతో,ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న సైన్స్ విద్యార్దులకు గుండెల్లో రాయి పడింది. కారణం