"మోస్ట్ పాపులర్ ఫాదర్" మరో మగపిల్లవాడు కోసం "లింగ నిర్దారణ పరిక్ష" చేయించాడట!
మొన్ననే ఆయన గారిని పదకొండు వేల మంది మహిళలు మోస్ట్ పాపులర్ ఫాదర్ గా ఎన్నుకున్నారు. ఈ రోజు ఆయన గారి గురించి ఒక విశేషం ప్రకటించారు. ఆయనకి ఇద్దరు సంతానం.అందులో ఒకరు మగ, రెండవవారు ఆడ. వారంటే ఆయనకి ఎనలేని ప్రేమట. పిల్లలు పెద్దవారైతే వారిని స్నేహితులు లాగా చూడాలని విజ్ణులు చెప్పినట్లే ఆయన అభిప్రాయం కూడా అట. మొన్న ఫాదర్స్ డే సందర్బంగా ఒక మారేజ్ సంస్త వారు ఒక అభిప్రాయ సేకరణ చేసి బారత దేశంలో ఆయనని అత్యంత ప్రజాదరణ పొందిన తండ్రిగా తేల్చిపారేశారు.ఇలా తేల్చడానికి వారికి ఉపయోగపడింది ఎవరో తెలుసా? అచ్చంగా మహిళలు.మరి అటువంటి మహిళ లను కించ పరచేలా మరో "మగబిడ్డ" కోసం ముందస్తు నిర్దారణలు చేయిం...