Posts

Showing posts with the label my dress my choice

నా బట్టలు ,నా ఇష్టం ! మీ కేంట్రా ? అంటున్న ఈ కామెడీ ని చూడండి !!!.

Image
                                                                                                        మై డ్రెస్ ,మై చాయిస్ అనే నినాదం తో మోడ్రన్ స్త్రీ వాదం తన లోని విశ్రుంఖల స్వేచ్చా వాంచను తెలియ చెయ్యడం ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పరిణామం . భారత దేశం లో  కూడా అటువంటి విపరీతపు అలోచనా దోరణి వైపు యువతను ఆకర్షించేలా మోడ్రన్ స్త్రీ వాదం ప్రయత్నిస్తుంది . దాని కోసం మన దేశం లో స్త్రీల మీద జరుగుతున్నా అత్యాచారాల కు వ్యతిరేకంగా జరిగే అందోళనలో ,తమ అనుకూల వర్గాలు చేత ప్ల కార్డులు పట్టి ప్రదర్శనలు నిర్వ హిస్తూ ఉంటారు .           సాంప్రాదాయ స్త్రీ వాదం స్త్రీలకు పురుషులతో  పాటు సమాన గౌరవం ,రక్షణ కోరుకుంటుంటే ,దానికి వ్యతిరేకంగా మోడ్రన్ స్త్రీ వాదం విశ్రుంఖల స్వేచ్చను ఆసిస్తుంది .దానికి కారణం సింపుల్ . సాంప్రదాయ స్త్రీ వాదం వలన మల్టీ నేషనల్ కంపెనీలకు నష్టం . ఇక్కడ చౌక గా లభించే స్త్రీ శ్రమ లభించదు . ప్యాషన్ ల పిచ్చి లో జరిగే కోట్ల కొలది బట్టల వ్యాపారాలకు మోడ్రన్ స్త్రీ వాదం ఉపయోగ పడి నట్లు సాంప్రదాయ స్త్రీ వాదం ఉపయోగ పడదు . అలాగే స్త్రీలను సెక్స్ బానిసలుగా మార్చి వారిద్వారా కోట్లాది ర

మేము దుస్తులు ఎలా దరించాలో చెప్పోద్దు, వాళ్లను రేప్ చెయ్యొద్దని మాత్రమే చెప్పండి!

Image
                                                                               మేము దుస్తులు ఎలా దరించాలో చెప్పోద్దు, వాళ్లను రేప్ చెయ్యొద్దని మాత్రమే చెప్పండి!  ఈ స్లోగన్ మొన్న డిల్లీ  రేప్ ఘటన కు నిరసనగా గళమెత్తిన వేలాది మంది ఆడపిల్లల అభిప్రాయం. వారు ఈ స్లోగన్ ని ప్రత్యెకంగా ప్లకార్డుల మీద ప్రదర్శిస్తూ తమ నిరసనను జాతికి తెలియ చేసారు. నిజమే కట్టు బొట్టు విషయం లో స్త్రీలకు స్వేచ్చ ఉంది. కాని ప్రాశ్చాత్య నాగరికత మోజులో కొంత విబ్బిన్న దోరణులు చోటు చేసుకుంటున్నాయి. కొత్త పాత మద్య సంది దశలో ఉన్నాం. మన ఇండ్లల్లో స్త్రీలు మన పిల్లల్ని ఎలా డ్రెస్ చేసుకోవాలో చెప్పి కొంత కట్టడి చేస్తారు. అది స్త్రీలే అంటే, తల్లి,లేక ఇతర కుటుంబ సభ్యులు నేర్పుతారు. కేవలం వస్త్ర దారణ వళ్ల రేప్ లు జరుగుతున్నయి అనుకోవడం తప్పే అవుతుంది.ఇది కేవలం డిల్లి అమ్మాయిలు వస్త్ర దారణ గురించి కాకుండా తమ ప్రైవేట్ లైఫ్ విషయం లో ఎవరూ జ్యొక్యం చేసుకోవద్దని, హెచ్చరిస్తున్నారు. ఇది కొంత నేటి యువ తరం వాస్తవ పరిస్తితులను అర్థం చేసుకోలేని తన్నాన్ని. సూచిస్తుంది. అసలు  నేటి యువతరం లో

'దీపికా పడుకునే ' కు విప్పదీసి చూపడమే " చాయిస్ " అయితే , "సజీవ సమాదే " శివగంగై వారి చాయిస్ అంట !

Image
మనిషి జన్మ ఎత్తాక ,కొంచం సిగ్గూ, శరం ,  మానం ,అభిమానం అనేవి ఉండాలి .ఇవి స్త్రికైనా ,పురుషుడికైనా తప్పదు . ఈడొచ్చిన మగపిల్ల వాడు అయినా సరే ,  ఒంటి మీద  కనీసం తువ్వాలు కప్పుకోకుండా,అర్ధ నగ్నంగా  వీదుల్లొకి  వెళ్ళడానికి  ,సంస్కారవంత మైన కుటుంభాలు ఒప్పుకోవు ! అలాంటిది ఒక స్త్రీ తన ఇష్టం వచ్చిన డ్రెస్ అంటె అర్ద నగ్నత్వాని  ప్రదర్సించేది  వేసుకుని వీదుల్లొ అంగ ప్రదర్శన చేస్తాను అంటే ఎలా కుదురుతుంది ? అది ఖచ్చితంగా బరి తెగింపు తనం అవుతుంది . నీ ఇష్టం వచ్చినట్లు నీ ఇంట్లో నీవు వుంటె ఎవ్వరికి ఆక్షేపణ ఉండదు .కాని బయట ప్రపంచంలో మాత్రం ,సమాజం నిర్దేశించిన విధంగానే ఉండాలి. అందుకె 'తిండి నీ ఆరోగ్యం కోసం తిను , బట్ట సమాజం కోసం కట్టు " అంటారు పెద్దలు . ఆ మాత్రం  తెలియని దీపికా పడుకునే అనే బాలీఉడ్ నటి "మై చాయిస్ " అనే పేరుతో ఒక లఘు చిత్రం తీసి జనం మీదకు వదిలింది . నా ఇష్టం వచ్చినట్లు ఉంటాను అని అర్ధం వచ్చేలా స్త్రిలలోని వికారపు బంగిమలు అన్ని ప్రదర్శింప చెసింది . ఆమె ఎదో మానసిక సమస్యతో బాదపడుతున్నట్లు ఈ  మద్య  పేపర్లో ప్రకటించారు . దానిలో బాగమే ఈ  లఘు చిత్ర ప్రదర్శన అనిపిస్తుంది