మేము దుస్తులు ఎలా దరించాలో చెప్పోద్దు, వాళ్లను రేప్ చెయ్యొద్దని మాత్రమే చెప్పండి!
మేము దుస్తులు ఎలా దరించాలో చెప్పోద్దు, వాళ్లను రేప్ చెయ్యొద్దని మాత్రమే చెప్పండి!
ఈ స్లోగన్ మొన్న డిల్లీ రేప్ ఘటన కు నిరసనగా గళమెత్తిన వేలాది మంది ఆడపిల్లల అభిప్రాయం. వారు ఈ స్లోగన్ ని ప్రత్యెకంగా ప్లకార్డుల మీద ప్రదర్శిస్తూ తమ నిరసనను జాతికి తెలియ చేసారు. నిజమే కట్టు బొట్టు విషయం లో స్త్రీలకు స్వేచ్చ ఉంది. కాని ప్రాశ్చాత్య నాగరికత మోజులో కొంత విబ్బిన్న దోరణులు చోటు చేసుకుంటున్నాయి. కొత్త పాత మద్య సంది దశలో ఉన్నాం. మన ఇండ్లల్లో స్త్రీలు మన పిల్లల్ని ఎలా డ్రెస్ చేసుకోవాలో చెప్పి కొంత కట్టడి చేస్తారు. అది స్త్రీలే అంటే, తల్లి,లేక ఇతర కుటుంబ సభ్యులు నేర్పుతారు. కేవలం వస్త్ర దారణ వళ్ల రేప్ లు జరుగుతున్నయి అనుకోవడం తప్పే అవుతుంది.ఇది కేవలం డిల్లి అమ్మాయిలు వస్త్ర దారణ గురించి కాకుండా తమ ప్రైవేట్ లైఫ్ విషయం లో ఎవరూ జ్యొక్యం చేసుకోవద్దని, హెచ్చరిస్తున్నారు. ఇది కొంత నేటి యువ తరం వాస్తవ పరిస్తితులను అర్థం చేసుకోలేని తన్నాన్ని. సూచిస్తుంది. అసలు నేటి యువతరం లో స్త్రీల పట్ల ఎటువంటి అభిప్రాయం ఉన్నది అనేది వాస్తవిక ద్రుక్పదంతో చూడాలి.
నేను ఒక రోజు ఖమ్మం లో ఒక హోటల్ లో కూర్చుని మిత్రులతో చాయి సేవిస్తున్నాను. అక్కడికి వచ్చిన నలుగురు కుర్రాళ్లు ప్రక్కనే ఉన్న టేబుల్ వద్ద కూర్చుని టిఫిన్ కి ఆర్డర్ ఇచ్చారు. అందులో ఒకడు తన సెల్ ఫోన్ తీసి అవతల తన గర్ల్ ఫ్రెండ్ కీ పోన్ చేసాడు. అవతలి నుండి ఆ అమ్మాయి రెస్పాన్స్ రాగానే,అమే తో రొమాన్స్ దోరణిలో మాట్లాడుతూ, ఆ సంభాషణ అంతా, స్పీకర్ ఆన్ చేసి తన తత్తిమా మిత్రులకు వినిపిస్తూ ఆనందిస్తున్నారు. ఆ విదంగా చేస్తుంటే నాకు ఆశ్చర్యం వేసింది. తన ప్రైవసీని కాపాడలేని ఆ కుర్రాడ్ని ఆ అమ్మాయి నమ్మి ఎలా స్నేహం చేస్తుంది అని. ఆ విషయమై ఆ కుర్రాడ్ని మందలిస్తే, ఇదంతా కామన్ అని, అసలు అటువంటి బిడియం బయం ఉన్న అమ్మాయిలు ’బోయిఫ్రెండ్స్" అనే వాటికి దూరంగా ఉంటారని, అన్నిటికి ఇష్టపడే స్నేహాలు కొనసాగిస్తారని చెప్పాడు. నాకు చాలా ఆస్చర్యం వేసింది. ఆడపిల్లలు ఇంత యెదిగిపోయారా అనుకున్నాను.
కుర్రాల్లే కాదు ఒక వయసు వచ్చిన వారిలోను కొంత మంది స్త్రీల పట్ల సదభిప్రాయం లేదు, వాల్ల ముందు "ఏమండి" అని గౌరవంగా సంబోదిస్తూ, వారి పరోక్షంలో ’అది, ఇది, అని అమర్యాదగా మాట్లాడటం చూశాను. అది తప్పని చెపితే వారి చరిత్ర మీకేమి తెలుసూ, ఏవో కథలు చెపుతారు. పైకిస్త్రీని గౌరవించే చాలా మందిలో స్త్రీ పట్ల చిన్న చూపు ఉంది.మరి ఇటువంటి మగబుద్దుల్లున్న జీవుల మద్య నివసిస్తూ, నా ఇష్టం వచ్చినట్లు నేనుంటా నాకు కష్టం కలగ కుండా చూడాల్సిన బాద్యత మీదే అన్నంత మాత్రానా ఒక్కసారిగా మగబుద్దిని చట్టాలు మార్చేస్తాయా?
ఓ.కె. పిల్లలు పెద్దలు అంతా గొడవ చేసారు, కాబట్టి ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి, నిందితులను సత్వరమే శిక్షిస్తుంది. మగాడిలో బుద్ది వస్తుందా? నేరాలు ఆగి పోతాయా? ఏ ప్రభుత్వం అయినా రేప్ లు చేసే మగాడిని కేస్ లు పెట్ట కుండా వదలి పెట్టిందా? మరి నేరాలు ఎందుకు అగటం లేదు?ఒక చిన్న ఉదాహరణ చెపుతాను. మనం రైల్లో ప్రయాణం చేసేటప్పుడు, స్త్రీలు మెడలో బంగారం ఉన్నవారు కిటీకి ప్రక్కన కూర్చోవద్దన్ని, చెపుతారు. అలాగే మెడ చుట్టూ పైట కప్పుకోమనీ చెపుతారు. మరి స్త్రీలకు పురుషునితో సమానంగా కిటికి ప్రక్క సీట్లో కూర్చునే హక్కు లేదా? ఉంది! పురుషుడు అయినా సరే మెడలో బంగారం ఉంటే ఆ నియమమ్ అతనికి వర్తిస్తుంది. ఇక్కడ పురుషుడా స్త్రీయా అని కాదు, దోచుకోబడే వస్తువు ఏదయినా మన దగ్గర ఉన్నపుడు మన జాగ్రత్తలో మనముండాలి. లేదు నా ఇష్టం నేను కిటికి ప్రక్కనే కూర్చుంటాను, రక్షించాల్సినా బాద్యత నీదే అంటే పోలిస్ ఏమి అనడు. అలాగే అమ్మా అంటాడు. బంగారం పోయాక ఏడుస్తూ కంప్లైంట్ ఇస్టె మామూలుగా అయితే సాదారణ దర్యాప్తు, ఇంప్లూయన్స్ ఉంటే సత్వర దర్యాప్తు చేసి, మన బంగారం మన కిప్పించ వచ్చు, కాని దొంగతనం జరిగేటప్పుడు అయిన గాయాల తాలుకు బాద అనుభవించక తప్పదు కదా!అది బంగారం కాబట్టి. మరి రేప్ కేస్లో? కాబట్టి చట్టానికి నేరాలు జరుగకుండా సహకరించడం ప్రతి పౌరుని విధి.
అంతేమరి. బాగాచెప్పారు.
ReplyDeleteబూతు వార్తలేనా, ఆశ్రమ కబుర్లకి ఏమైనా సమయం కేటాయిస్తారా? :P
మీ ద్రుష్టిలో ఆశ్రమ కబుర్లు అంటే, భజనలు, పూజలు మాత్రమే అనుకుంటే వాటి గురించి నాకన్నా బాగా చెప్పగలిగిన వారి బ్లాగులున్నాయి. సమాజానికి ఉపయోగపడేది, నాకు తెలిసింది, చెప్పటమే నా పని.అది బూతా, అబూతా అనేది ఆలోచించే మనసును బట్టి ఉంటుంది. "శునకము, శునక మాంసం తిను వాని యందును పండితుడు సమ ద్రుష్టి కలిగి యుండును". నేను ఇలా అన్నానని "గొర్రె" గొర్రె మాంసం తినువాడు ఒకటేనా అని ప్రశ్నించవద్దు సుమా! అన్ని విశయాలు సమానమే అనటానికి మత్రమే ఈ ఉదాహరణ
Deleteప్రకృతి దర్మం: కుక్కపని కుక్క గాడిద పని గాదిద చేయద్దు అంటే ఎలా
ReplyDeleteపాపం వాటితో పోల్చి వాటినెందుకు అవమానం చేస్తారు.వాటికి ఒక సీజన్ ఉంటుంది. సీజనూ,రీజనూ లేని వాడు మనిషి ఒక్కడే.,అనుకుంటా ఈ భూమండలంలో.
Deleteఅమ్మడు చాలా బాగా చెప్పారు. సిగ్గు విడచి తిరుగుతాం సమానత్వం అంటూ....
ReplyDelete// దోచుకోబడే వస్తువు ఏదయినా మన దగ్గర ఉన్నపుడు మన జాగ్రత్తలో మనముండాలి //
ReplyDeleteWell said.
దన్య వాదాలు,kishore గారు.
Deleteమీరెన్ని చెప్పండీ....కటినమైన చట్టాలు...సభ్యత సంస్కారం లేని ప్రజల దగ్గర ఈ పప్పులు ఉడకవు...అమ్మాయిలు అసలు మన జనాల మైండ్ సెట్ తెలియ కుండా మాట్లాడుతున్నారు.....రేప్ లు చేసేది....కాలేజీ స్టూడెంట్ లు కాదు...మోటార్ ఫీల్డ్ అన బడే పచ్చి బేవార్స్ గా తిరిగే జనాల వంటి వాళ్ళ వల్ల...వాళ్ళకు తల్లీ చెల్లీ తేడా తెలియదు...సమస్య చిన్నది కాదు...
ReplyDelete"రేప్ లు చేసేది....కాలేజీ స్టూడెంట్ లు కాదు...మోటార్ ఫీల్డ్ అన బడే పచ్చి బేవార్స్ గా తిరిగే జనాల వంటి వాళ్ళ వల్ల...వాళ్ళకు తల్లీ చెల్లీ తేడా తెలియదు."
Deleteఏ అదారం వలన మీరు ఈ అభిప్రాయానికి వచ్చారో తెలుపుతారా!
hyderabad లొ I MAX ఏదురుగా lake view garden (park) దీనికి ఆనుకొని ఒక ప్రాద్దమిక పాటశాల . ఆక్కడి నుండి చూస్తె జంట ల శ్రుంగారం (కామం) పిల్లవాడికి కనిపిస్థుంది.
ReplyDeleteకావాలంటె ఒక్క సారి వెళి పరిశీలించండి. ప్రతి రోజు ఆ ........చుసె పిల్లలు యువకులెనకా వారు ఏలా మారుతారు
ఇది నిజమా!? హైదరాబాద్ ప్రజలు సిగ్గుపడాల్సిన సంగతి చెప్పారు
Deleteఆ పార్కు ఎంట్రి ఫీజు 10.00 రూపాయలు
ReplyDeleteఅక్కడి సిబ్బంది టిక్కెట్ట్ ఇవ్వకుండా జంటను బట్టి టిక్కెట్ట్ వసుల్ చెస్తారు
ఎవరో చెబితె పరిసీలించినాను
ఒక్క సారి వీలున్న వారు పరశీలించగలరు
ReplyDeleteడోంట్ టెల్ మీహౌ టుడ్రెస్ !
వోంట్ టెల్ డోంట్ నో జిలేబి వోరగ బో! బో!
పోటుల్ దింటే వింటేజ్
బాటిల్ డమ్మాల్ ! హుషారు భద్రం జర్రా !