కట్టుకున్న మొగుడిని కడతేర్చి , కట్టుకున్న ఇంట్లోనే పాతిపెట్టి, ఇల్లు అమ్మి సొమ్ము చేసుకున్న " ఇల్లాలు వర్ష "

                                                                               

                                     
                                 భార్యా భర్తల మద్య ఉండె బందం పేరు నమ్మకం . తాము ఒకరి కోసం ఒకరు జీవిస్తున్నాం అనే నమ్మకం తో తమ మద్య ఉన్న అనురాగ బందాన్ని ద్రుడపర్చుకుంటూ , సంసారం అనే బండికి రెండు చక్రాలుగా మారి ఒక తరం నుండి మరొక తరం కి కుటుంబం ని చేర్చే వారే బార్యా బర్తలు. మరి అటువంటి భార్యా భర్తల మద్య ఆ నమ్మకం అనేది సడలితే ఆ బందం కుప్పకూలి పోతుంది , అనుమానం వలన భర్తలు , అక్రమసంబందం వలన స్త్రీలు తమ జీవిత బాగ స్వాములు పట్ల కిరాతకులుగా మారుతున్నారు  అని చెప్పే ఉదాహరణలు ఈ  సమాజం లో ఇటివల ఎక్కువైనవి. నేరాలు  చేస్తున్న వారిలో స్త్రీ పురుషులు ఇరువురూ ఉన్నారు. కాని గృహహింస పేరిట స్త్రీల మీద జరుగుతున్న ఆకృత్యాలకు లభిస్తున్నంత ప్రచారం పురుషుల పట్ల స్త్రీలు చేసేవాటికి లభించడం లేదు. దానికి కారణం మన సమాజం అనాదిగా పురుష స్వామ్యం గా ఉండడం, మీడియా , పత్రికలూ స్త్రీ వాదానికి ఇచ్చిన ప్రాముఖ్యత , సమవాదానికి ఇవ్వకపోవడం.

              మొన్నీ మద్య ఒక కానిస్టేబులు తన భార్యను అతి కిరాతకంగా చంపి , తన స్నేహితుడి సహాయంతో దూరంగా ఒక అడవిలోకి తీసుకు వెళ్లి పాటి పెట్టిన సంఘటణ ప్రజలను నిర్ఘాంత పరచింది. అటువంటి వాడికి ఎటువంటి శిక్ష వేసినా చాలా తక్కువే . ఇదే విషయాన్ని అన్నీ పత్రికలూ కోడై కూశాయి. అతని దాషిటకం గురించి యూ ట్యూబ్ లో సైతం పెట్టారు . కాని ఒక సామాన్య ఇల్లాలుగా ఉన్న స్త్రీ ఆర్మీ జవాన్ అయిన తన భర్తను నిద్ర మాత్రలు ఇచ్చి పడుకోబెట్టి , కత్తితో పొడిచి చంపి, విషయం బయటకు పొక్కకుండా , ఇంట్లో బాత్ రూం లోనే పాతి  పెట్టి , ప్లాస్టరింగ్ చేసి, కట్టిన ఇంటిని, కట్టుకున్న మొగుడు  శవం తో సహా అమ్మి వేసిన ఘోరమైన ఇల్లాలు గురించి ఎన్ని పత్రికలూ రాసాయి? ఏ మీడియా పోకస్ చేసింది? ఆఖరుకు న్యాయస్తానం జీవిత ఖైదు విదించాక , ఏదో ఒకటో రెండు పత్రికలూ రాసి ఉంటాయి అంతే!వివరాలు లోకి వెళితే 

                     ఆమె పేరు వర్ష! ఆమె భర్త రాజేంద్ర పటేల్ ఆర్మీ లో జవాన్ . ఆతను కుటుంభ జీవనం కోసం , దేశ భద్రతను కాపాడే ఉద్యోగం లో చేరి అష్ట కష్టాలు పడుతుంటే , ఇంట్లో ఉన్న వర్ష బుద్దులు పెడ దారి పట్టాయి అట. తన సుఖాని కి అడ్డుగా ఉన్నాడు అని తలచిందో ఏమో ఒక రోజు అంటే 2012 మార్చి నెలలో 24 వ తారీకున  తన భర్తకి నిద్రమాత్రలు కలిపి ఇచ్చిన పాలను త్రాగిస్తే , భార్య మీద నమ్మక్కం తో రాజేంద్ర వాటిని త్రాగి గాడ నిద్ర లోకి వెళ్లాడు . అంటే ! ఒక్క సారిగా వర్ష లోని వికృత రాక్షసి నిద్ర లేచి పదునైన కత్తితో , అర్ధరాత్రి , మొగుడి గొంతు కోసి చంపింది. ఆ తర్వాత ఏ మాత్రం బెదరకుండా తమ ఇంటి బాత్ రూం లో  భర్త శవాన్ని పూడ్చి పెట్టి , ప్లాస్టరింగ్ చేసింది . ఆ తర్వాత మూడు రోజులకుఅంటె 27 వ తరీకున ఆ ఇంటిని మంజు అనే ఆమెకు అమ్మి వేసింది. 

      తానొకటి తలస్తే దైవమొకటి తలుస్తాడు అనే మాట "వర్ష " విషయం లో నిజమైంది . ఇల్లు కొన్న మంజు కు , ఇంటి బాత్ రూం విషయం లో అనుమానం వచ్చి చూస్తే రాజేంద్ర శవం కనిపించడం తో అవాకై పోలీసులకు సమాచారం ఇచ్చింది. దానితో పోలిసులు రాజేంద్ర శవాన్ని పోస్టు మారటం కి పంపి , వర్షను అదుపులోకి తీసుకుని నాలుగు పీకితే అసలు విషయం అంతా కక్కింది. ఇల్లున అమ్మిన రోజునే వర్ష అకృత్యం బయటపడి జైలుకు వెళ్ళడం , ఆమె చేసిన పాపానికి దేవుడు విదించిన శిక్ష .అప్పటి నుండి కేసు నడచి నడచి చివరకు మొన్నీ  మద్యనే తీర్పును వెలువరించారు సంబందిత కోర్టు వారు. వర్షకు జీవిత ఖైదు విదించారు . ఆమె చేసిన పనికి ఉరి శిక్ష విదించినా తక్కువే. అయినా భారతీయ న్యాయ సూత్రాలు ప్రకారం ఆమెకు తగిన శిక్షే పడింది. అదీ విషయమ్.   

                          భార్యా భర్తను చంపాలన్నా, భర్త భార్యను కడతేర్చాలన్నా క్షణం లో పని. కాని అటువంటి నీచమైన, ఘోరాతి ఘోరమైన పని  ఎవరు  చేస్తారు? పరమ కర్కోటకులు తప్పా? భారతీయ వివాహ వ్యవస్తకు మాయని మచ్చను తెస్తున్న , పైన చెప్పిన కానిస్టేబుల్ లాంటి భర్తలు, వర్ష లాంటి భార్యలు ఈ  సమాజం లో అక్కడక్కడా ఉన్నారు. పంట చేలో కలుపు మొక్కలను పీకి వీసినట్లు వీరిని కూడా వేరి వేయాల్సిందే . లేకుంటే భారతీయ కుటుంభ వ్యవస్తకు ప్రమాదం. 





Comments


  1. నమ్మిన మొగుణ్ణి నిద్రన
    వమ్ములు జేసెను జిలేబి వాలము కోసెన్ !
    గమ్మున సమాధి జేసెను
    అమ్మెను యింటిని తెలిసెను అసలు రహస్యం!

    ReplyDelete

Post a Comment

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!