ఈ లేచిపోయిన "వాట్సాప్ రాజేశ్వరి " కేసులో వాచిపోయింది ఎవరికీ? ??


                                                                             

వారం రోజుల క్రితం హైదరాబాద్ రాజేందర్ నగర్ లో ఒక వివాహిత గుడికి వెళ్లి వస్తాను అని భర్తకు చెప్పి వెళ్ళింది. అలా వెళ్ళిన ఆమె ఎంతకూ తిరిగిరాకపోయే సరికి , కంగారుతో భర్త అక్కడా , ఇక్కడా వెతికి నా ప్రయోజనం లేక పోయేసరికి, పోలీసులను ఆశ్రయిస్తే వారు  మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని ఎంక్యైరి మొదలుపెట్టారు. అ ఎంక్యరి లో ఆమెకు , హైదరాబాద్ లో సెటిల్ అయిన ఒక బిహారి తో వాట్సాప్ పరిచయం ఉందని తేలింది అట . వాట్సాప్ ప్రెండ్షిప్ ద్వారా సదరు బీహారీ , ఆ వివాహిత పోటోలు తో సహా ఎన్నో సందేశాలు షేర్ చేసుకున్నారట. దానితో అనుమానం ఆ బిహారి మీదకు వెళ్ళడం సహజం.

     ఇలా పోలిస్ విచారణ సాగుతున్న తరుణంలో , వివాహిత భర్త గారికి ఒక వాట్సాప్ మెసేజ్ వచ్చింది. అందులో బందితురాలి గా ఉన్న తన బార్య పోటో తో పాటు ఒక సందేశం కూడా ఉందట. అందులో అతని భార్యను కిడ్నాప్ చేసామని , 3 లక్షలు ఇస్తే వదలి పెడతామని , లేకుంటే చిత్రహింసలు పెట్టి ముంబాయి రెడ్ లైట్ ఏరియాలో అమ్ముతామని ఉందట. దానితో కంగారు పడిన భర్త , తన వద్ద 3 లక్షలు లేవని , కొంత సొమ్మును కిడ్నాపర్ చెప్పిన అకౌంట్ కు జమ చేసాడు అట. ఆ అకౌంట్ రిజ్విన్  అనే వ్యక్తిది అట. అలా సొమ్ము జమ చేసినప్పటికీ తన భార్యను కిడ్నాపర్లు విడుదల చేయక పోవడం తో , ఇదే విషయం పోలీసులకు చెప్పాడు ఆ దీనుడైన భర్త. 

    దానితో పోలిసులు, టీం లను ఏర్పాటు చేసి కిడ్నాపర్ ల కోసం గాలింపు మొదలుపెట్టారు. వారు మొదట ఒడిషా లో ఉన్నట్లు ఆ తర్వాత కలకత్తాకు వెళ్ళినట్లు తెలుసుకుని , హుటాహుటిన విమానం లో కలకత్తా వెళ్లి , ఆ వివాహితను, ఆమెతో ఉన్న బీహారీ బాబును పట్టుకుని హైదరాబాద్ తీసుకువచ్చారట. ఇంకొంచెం సేపట్లో మీడియా ముందు కిడ్నాపర్ ని ప్రవేశ పెట్టి కేసు వివరాలు చెపుతారట. కేసు బలంగా ఉండటం కోసం పోలిస్ వారు చెప్పే వివరాలు ఏమైనప్పటికి కొన్ని ప్రశ్నలకు మనకు సమాదానం దొరక్కపోవచ్చు. 

  1). వివాహితకు , బిహారి కి వాట్సాప్ పరిచయం బీబత్సంగా ఉందని తెలుస్తుంది. ఆమెకు పెండ్లి అయి  7 యేండ్లు అయింది. ఆరేళ్ళ పాప ఉంది . ఆమెకు అర్దికపరమైన సమస్యలు ఏమి లేవట. కాని అంతకు మించిన సమస్య  ఎదో ఉండబట్టె బీహారీ తో వాట్సాప్ పరిచయం లో నిండా  మునిగి పోయింది ఉంటుంది . ఈ  విషయం భర్తకు తెలిసి మందలించినా ఆమె ఖాతరు చేయలేదట. మరి అలాంటి వాట్సాప్ ప్రెండ్ తో కావాలనే వెల్లింది అనుకోవటం లో అసహజమేమి లేదు కదా? 
2) ఈ కేసులో నిజమైన బాదితులు ఎవరు? అమెనా ? లేక ఆమె భర్త నా? పరాయివాడితో పరిచయాలు వద్దని చెప్పినా పట్టించుకోని ఆమె , తన కుటుంబ పరువును, పిల్ల బవిష్యత్ ని గాలి కొదిలేసి , గాలికి తిరిగే వాడితో వెళ్లి పోయింది . వారు తమ వద్ద ఉన్న సొమ్ము అంతా అయిపోయిందాక మజా చేసి, డబ్బులు కోసం తిరిగి కిడ్నాప్ డ్రామా అడి , భర్త నుంచి సొమ్ము తెప్పించుకున్న జాణ తనం వారిలో  లో ఉందని అనుకోవడానికి ఆస్కారం ఉంది కదా? మరి అదే నిజమయితే ఆమె బాదితురాలు ఎలా అవుతుంది? అయితే గియెతే భర్త , అతని కూతురు అవుతారు కాని. కాబట్టి మీడియాలో పదే పదే ఆమెను బాదితురాలు , బాదితురాలు అని పోకస్ చెయ్యడం కరెక్టు కాదు. 

3). తమ నీచ ప్రయోజనాల కోసం కుటుంబ స్త్రీలను ట్రాప్ చేసే కామందులకు సరి అయిన శిక్ష ఏమిటంటె 'సీసం కాగపోసి నవరంద్రాల్లో పోయటం. కాని అది అనాగరికమైన శిక్ష అని నాగరీకులమైన మనం అనుకుంటున్నందు వలన "అడల్ట్రీ " క్రింద 5 యేండ్లు జైలు శిక్ష విదించే అవకాశ ముంది . కాని పరాయి పురుషుల మీద వ్యామోహం తో ఏదో ఒక సాకుతో "లేచి పోయే రాజేశ్వరి " లకు మన చట్టాల్లో ఎటువంటి శిక్షలూ లేవు. దానికి కారణం అటువంటి వారికి సమాజమే శిక్ష విదిస్తుంది అనుకోవడం వలన. అది అప్పటి కాలానికి కరెక్టు కావచ్చు కాని, స్త్రీ పురుషులు ఇరువురూ చట్టం ముందు సమానులే అని చాటుతున్న నేటి తరుణం లో కాదు. కాబట్టి లేచి పోయే రాజేస్వరీలకు కూడా పురుషులతో పాటు కఠిన మైన శిక్ష ఉండాల్సిందే . 

4. పై కేసులో వివాహితను , ఆమె వాట్సాప్ స్నేహితుడిని పట్టుకోవడానికి పోలిస్ వారికి లక్షలు రూపాయలు ఖర్చు అయి ఉంటాయి. స్పెశ్షల్ టీం లు, విమాన ప్రయాణాలు ఇవ్వన్ని చూస్తుంటె తీవ్రవాదు లకోసం వెతికితే ఎంత ఖర్చు అవుతుందో , అంత ఖర్చు అయినట్లు కనపడుతుంది. మరి ఇదంతా ఎవరి సొమ్ము? ప్రజలదే కదా? మరి సమాజపు కట్టుబాట్లకు తల వంచని వారికోసం ఇలా ప్రజా దనం వెచ్చించ వలస్దిందేనా? సమాజం నుండి రక్షణ ఆశించే వారు  తప్పకుండా సమాజపు కట్టుబాట్లను గౌరవించ వలసిందే .  అలా గౌరవించని వారికోసం ప్రజా దనం వ్రుదా చేయాల్సిన పనిలేదు. అలా అంటె మన దేశం లో ఎంతో మంది దొంగలకు ప్రజాదనం వ్రుదా చేయడం లేదా అంటారు. అదే మన దౌర్బాగ్యం . మనం శిస్తుల రూపం లో కట్టెదందంతా జారుల , చోరుల రక్షణకే ఉపయోగ పడుతుంది. 
                          ఏది ఏమైనా పై కేసు బలం కోసం కేసులోని నిజాలు అన్నీ బయటకు రావచ్చు, రాక పోవచ్చు.  . మజా చేసింది వాట్సాప్ స్నేహితులు అయినా వాచీ పోయింది మాత్రం ఆమె భర్తకు, ప్రజలకు (ప్రజాదన0). దట్సాల్!

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!