కరెంట్ కోత,దోమల మోత,ఇదీ మన తల రాత.
మన తెలుగు ప్రజల దౌర్బాగ్యం ఏమిటోగాని, బొత్తిగా ప్రజాసంక్షేమం పట్టించూకోని ప్రజానాయకుల ఏలుబడిలో ఉన్నాం.గత 15ఏండ్లుగా ఎన్నడూ పీల్చనంతగా, పీల్చి పిప్పిచేస్తున్నాయి. ఎవరనుకున్నారు! దోమలండి,దోమలు!అవి కుడుతుంటే ప్రజలు చేసే ఆక్రందనలు ఈ పాలకులకు వినిపించటంలేదు.ఇదివరకు అప్రకటిత కోత ఉంటే చాలు తక్షణం స్పందించే రాజకీయ పార్టీలు సైతం ఈ విషయం లో కిమ్మనకుండా ఉన్నాయ్. పాపం వాళ్లకి మన ముఖ్య మంత్రి గారిని చూస్తే జాలేస్తుంది కాబోలు. ఏందుకంటే, అయన ఏ అవినీతి కుంభకోణంలో బాగస్వామి కాకపోయిన అవినీతి మంత్రులను కాపాడడానికే అయన తెగ కష్టపడాల్సి వస్తుంది. ...