కరెంట్ కోత,దోమల మోత,ఇదీ మన తల రాత.
మన తెలుగు ప్రజల దౌర్బాగ్యం ఏమిటోగాని, బొత్తిగా ప్రజాసంక్షేమం పట్టించూకోని ప్రజానాయకుల ఏలుబడిలో ఉన్నాం.గత 15ఏండ్లుగా ఎన్నడూ పీల్చనంతగా, పీల్చి పిప్పిచేస్తున్నాయి. ఎవరనుకున్నారు! దోమలండి,దోమలు!అవి కుడుతుంటే ప్రజలు చేసే ఆక్రందనలు ఈ పాలకులకు వినిపించటంలేదు.ఇదివరకు అప్రకటిత కోత ఉంటే చాలు తక్షణం స్పందించే రాజకీయ పార్టీలు సైతం ఈ విషయం లో కిమ్మనకుండా ఉన్నాయ్. పాపం వాళ్లకి మన ముఖ్య మంత్రి గారిని చూస్తే జాలేస్తుంది కాబోలు. ఏందుకంటే, అయన ఏ అవినీతి కుంభకోణంలో బాగస్వామి కాకపోయిన అవినీతి మంత్రులను కాపాడడానికే అయన తెగ కష్టపడాల్సి వస్తుంది.
ఆదెమి విచిత్రమో కాని,మాది దేవుని పాలన అని చెప్పుకుఉన్న వాళ్ల పాలనలో కురిసిన వర్షాలు ఈ ఏడాది కురవలేదు. ప్రజలు కూడ డేవుదు పాలన పోయిందే అని బాద పడే పరిస్తితి వచ్చింది.వర్షాలు లేవు కాబట్టి, డాములలో నీళ్లు లేవు, నీళ్లు లేవు కాబట్టి, కరెంట్ ఉత్పత్తి లేదు. ఆందుకే ఈ బాదంతా. కనీసం పొరుగు రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసి అయినా ప్రజలకు కరెంట్ ఇద్దామన్న అలోచన సర్కారుకు కరువైంది.మరీ దారుణంగా రాత్రివేళ్లలో కరెంట్ కోత ప్రజలను అష్టకష్తాల పాలు చేస్తుంది. ఒంట్లో కరెంట్ లేని పాలకులవల్లే ప్రజల ఇండ్లల్లో కరెంట్ లెని పరిస్తితి దాపురించింది. దీనికి తోడు డెంగ్యు జ్వరాలు,వైరల్ ఫీవర్ లు ప్రజల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే అసలు ఈ రాజకీయ పార్టీలు ఏమి చేస్తున్నాయో అర్థం కావటం లేదు.కేవలం ప్రజల్ని వోటు దాతలుగ పరిగనించబట్టి,వారికి ప్రజసమస్యలు ఎన్నికల సమయంలో తప్ప,ఈ సమయాల్లో, గుర్తుకు రావు. అందుకే ఓ !భగవంతుడా! నీవు ఏమన్నాచెయి,యేటాఎన్నికల్లోచ్చటట్లుచెయిఅనప్రజలుప్రరకోరుకుంటున్నారు.
అయ్యా రాజకీయ నాయకుల్లారా! మీరేమన్నా చేసుకోండి! రాష్త్రాల సరిహద్దులను చెరిపివేయండి,మేము పట్టించుకోం.గనులను దోచేయండి మేము పట్టించుకోం.కోట్లు కోట్లు కూడబెట్టి స్విస్స్ బాంక్లో దాచుకోండి. మేము పట్టించుకోం. మమ్మల్ని ఎలాగూ మీరు పీల్చి (దోపిడి) పిప్పి చేస్తున్నారు. కనీసం ఆ దోమలు మా రక్తాల్ని పీల్చకుండ కాపాడలేరా? మామ్మల్ని ఈ దోమల బాదలనుంచి కాపాడండీ. అది చాలు మాకు.అబ్బా! దోమ కుట్టిందండి.(అవును మరి కుట్టకుండ యెందుకుంటుంది.నేను ఈ టపా పెట్టే సమయంలోనే 5 సార్లు కరెంట్ పోయింది మరి).
రోజుకి పన్నెండు గంట కరంట్ కోత.. జనులకి బాధలే కాని ప్రభుత్వానికి బాధ,రోగం లేనే లేదు. :(
ReplyDeleteనిజం చెప్పారు వనమాలి గారు.నాకొక అనుమానం ఏమిటంటే ఈ దోమలు ప్రజల రక్తంతో పాటు చైతన్యం పీల్చే స్తున్నట్టుంది. అందుకే ఏ గొడవలు,ఆందోళనలు, చెయ్యకుండ మౌనంగా భరిస్తున్నారు
ReplyDelete