వైద్యుడు మోసకారి అయితే వైద్య శాస్త్రం మోసమవుతుందా?
మీరు ఎన్నైనా చెప్పండి. నన్ను మూడ చాందసవాది అనుకోండి. నాదొకటే సిద్దాంతం " దేనినైనా గుడ్డిగా నమ్మడం యెంత తప్పో, గుడ్డిగా వ్యతిరేకించడం అంతే తప్పు". అరె! వైద్యుడు మోసకారి అయితే వైద్య శాస్త్రం బూటకమా? సైంటిస్ట్ మోసకారి అయితే సైన్స్ బూటకమా ? చెప్పంది. కాదు గదా మరి ఇదే రూలు మన ప్రాచీన శాస్త్రం "జ్యోతీష్యం" కు ఎందుకు వర్తించదు? ఏమి లేదండి నిన్న కొంచమ్ ఒక లుక్కేదమని అలా బ్లాగుల దర్శనానికి బయలుదేరా. ఒక సహ బ్లాగిని రాసిన నాడీ జ్యోతీశ్యం గురించి అమే స్వీయ అనుభవం చదివా. అమేగారు హేతుద్రుక్పదం కలిగిఉండి, అప్పట్టి దాక నమ్మని జ్యోతీషాన్ని ఒకే ఒక సంఘటనతో నమ్మాల్సి వచ్చిందని రాసారు. అంతే కొంతమంది బ్లాగు మిత్రులు అలా మేదావులు అనబడేవారు, దీని పీరు చెప్పి ప్రజల్ని మూడత్వం లోకి నెట్టడమె కాక, వారిని దోపిడి చేస్తున్నారని కామెంట్లు చేసారు. అందుకే నా ఈ ప్రశ్న. ...

Comments
Post a Comment