స్త్రీలకు దహన సంస్కార హక్కు ఇవ్వడం అనివార్యం.

స్త్రీలకు దహన సంస్కార హక్కు లు కావాలి
                                                                           

 నేను ఈ రోజు ఒక వార్త చూసాను. చాలా బాద వేసింది.బెల్లంపల్లి ఏరియాలొ ఒక కన్నతల్లి దహన సంస్కారాలు చెయ్యడానికి కన్న కొదుకే నిరాకరిస్తే, చిన్న కూతురితొ కార్యక్రమం పూర్తి చేసారట.విషయం ఏమిటంటే కొడుకు సింగరేని కంపేనీలొ ఉద్యొగం. ముగ్గురు కూతుళ్లు.చిన్న అమ్మాయి పెళ్లి కోసం ముసలమ్మ(8౦) కొంత సొమ్ము దాచింది. ఆ సొమ్ముని తనకిస్తేగాని తల కొరివి పెట్టనన్నాడట తనయుడు.ఎంత అమానుషమో ఆలొచించండి.చివర్కి ఆ చిన్న కూతురితొనె తలకొరివి పెట్టించారట బందువులు.

      ఇక్కడ మనం తెలుసుకోవల్సింది ఏమిటంటే అసలు తల్లి తండ్రులకు దహన సంస్కారాలు చేసే అదికారం ఇంకా కొడుకులకి మాత్రమే ఉంచడం హేతుబద్దత కాదు.ఎందుకంటే తల్లి తండ్రులకు ప్రాదమిక వారసులు కొడుకులు, కూతుళ్లు మాత్రమే.మనవళ్లు ఏవైపు వారైనా ద్వీతీయ వారసులే అవుతారు.ఉదాహరణకి కూతురు ప్రాదమిక వారసురాలు అయితే, మనవడు (కొడుకు కొడుకు) ద్వీతీయ వారసుడు అవుతాడు. ఇక్కడ మనవడి గురించి ఎందుకు చెపుతున్నానంటె కొరివి పెట్టే అధికారాలు పురుషుల వారసత్వం వారిగ హక్కులను కల్పించారు కాబట్టి కొడుకులు,వారు లేకపోతే మనవళ్లు, ఇలా ఎన్ని తరాల వారైనా పురుష సంతతిలొ తిరిగి పురుశులకే అధికారం కల్పించాము. విచిత్రం ఏమిటంటే కొన్ని పరిస్తితుల్లొ పురుష సంతానం లేకపోతే స్త్రీ సంతానంలోని పురుష పుంగవులకే ఈ అదికారం కట్ట బెట్టారు. లేక పోతే తమ్ముడి వైపో,అన్న వైపు వాళ్లనో పిలిపించి ఈ తంతుకు అర్హులుగ ప్రకటించేసి సంస్కారంలు కానిచ్చేస్తారు. వాళ్లు బ్రతికున్న రొజుల్లొ బద్ద శత్రువుల గా కొట్లాడుకున్న వారిని కూడ "మీరు తప్ప చనిపొఇన వారికి మగ దిక్కు లేదురా,రా రా నీకు ఎకరమో, అర ఎకరమో ఇప్పిస్తామని" చెప్పి తీసుకు వచ్చి తంతు కానిచ్చి,చనిపోయిన వారి ఆత్మకు శాంతి లేకుండా చేస్తుంటారు.

     నేను ప్రత్యక్షంగ చూసాను. ఒక సారి నాకు తెలిసినాయన చనిపోతే చివరి చూపు కి వెళ్లాను. అయనకి ఒక్కడె కొడుకు ముగ్గురు కూతుళ్లు.కొడుక్కి అయనకి అస్సలు పడేదికాదు. ఇరువురు కొట్టుకొని కోర్టులలొ కేసులు పెట్టుకున్నారు. ఆయన చనిపోయేనాటికి అవి పెండింగులోనే ఉన్నాయి.ఆయన చిన్న కూతురు దగ్గరే ఊంటె పాపం ఆ అమ్మాయే చనిపోయే వరకు సపర్యలు చేసింది. ఆయన ఆ కూతురు ఇంటి వద్దే చనిపోయాడు. కూతురి కొడుకుతొ దహన సంస్కారాలు చేయించుదామని వాళ్లు అనుకొని యేర్పాట్లలొ ఉండగ హట్టాతుగ కొడుకు ఊరి పెద్దమనుషులతో వచ్చి శవాన్ని ఎత్తుకొని వెళ్లి తంతు నిర్వహించాడు. దీనికి కారణం తండ్రి మీద ప్రేమ కాదు ఆయనకున్న ఎకరం పొలం చెల్లికి పోదేమొనన్న బయం. 

    అసలు దీనంతటికి కారణం స్త్రీలకు కర్మకాండ చేసే అదికారమ్ ఇవ్వకపొవడమే. అసలు కడుపున పుట్టిన కూతుర్ని కాదని, ప్రేమగ బ్రతికినంత కాలం సేవలు చేసిన స్త్రీ జాతిని కాదని ఈ అదికారమ్ పురుశులకు మాత్రమే కట్ట బెట్టడంలొ ఏ మాత్రం హేతు బద్దత లేదు ఎందుకంటే          స్త్రీ పురుషుల లింగ నిర్దారణ చేసేది వారిలోని క్రోమోజోములు మాత్రమే.తండ్రిలోని y  క్రోమోజోము తల్లిలోని x  క్రోమోజోము కొడుకుని నిర్దారిస్తే, తండ్రిలోని  x క్రోమోజోము  తల్లిలోని x క్రోమోజోము కూతుర్ని నిర్దారిస్తుంది.కాబట్టి ఇరువురు సమానులే.ఐతే   మనవడు (కొడుకు కొడుకు) లో ఉండేది కొడుకు కోడలి క్రోమోజోములు కాబట్టి వారు ప్రాదమిక వారసులు కాజాలరు.మనవడు (కొడుకు కొడుకు) కంటే కూతురే దగ్గరి వారసురాలు.అలాగే కొడుకుతో పాటు సమానమైన హక్కులు బాద్యతలు కల్గి ఉంటుంది.ఉండాలి కూడ.పూర్వ కాలంలో తల్లి తండ్రుల దగ్గర కుమారులే ఉండి,కుటుంబ బాద్యతలు చూసేవారు కాబట్టి వారికె  దహన సంస్కారాలు చెయ్యడానికి అదికారం ఇవ్వడం జరిగింది.రాను రాను అది వారి పేటెంట్ హక్కుగ మారి చివరకు ఆస్తులిస్తే కాని కొరివి పెట్టం అనే స్తాయికి రావడం జరిగింది.కాబట్టి ఇకనైన సమాజం కళ్లు తెరిచి హేతుబద్దతతో ఆలొచన చేసి కూతుళ్లకు దహన  సంస్కారాలు చెయ్యడానికి అధికారం కల్పించాల్సిన సమయం ఆసన్నమైంది.మీరేమంటారు?  

Comments

  1. తలకొరివికి హక్కులా! ఆచారాలు వున్నాయి. చిన్నమ్మాయి తలకొరివి పెట్టిందని మీరే అన్నారు, ఆ అధికారం ఎవరైనా ఇచ్చారా?! అవసరం ఆ కర్తవ్యం చేయిస్తుంది, అంతే.

    ఆ తల్లి దినం కూడా చేయాలనుకుంటే చేసేయొచ్చు. అధికారాలు/హక్కులు ఆస్థులకే పరిమితం.

    ReplyDelete
  2. అలాగా!ఒక చిన్న ఉదాహరణ. స్త్రీలకు,వ్రుద్దులకు బస్సుల్లో సీట్లను ఇవ్వడం సాంప్రదాయం. ఈ సాంప్రాదాయాన్ని మనమందరం పాటిస్తే కొన్ని సీట్లను వారికి రిజర్వేషన్ చెయ్యల్సిన అవసరం ఉండేది కాదు. అందుకే చట్టంలో పొందుపర్చారు. కాబట్టి సదాఆచారాలు పాటించనప్పుడు అవి చట్టాలుగ మారి హక్కులను కల్పిస్తాయి.తెలంగాణా ప్రాంతంలొ కర్మకాండలు చెయ్యనీయక పోయిన స్త్రీలకు శ్మశానం దగ్గరకు వచ్చే ఆచారం ఉంది. కాబట్టి బెల్లంపల్లి ప్రజలు ఆ అమ్మయి చేత తలకొరివి పెట్టించి ఉంటారు. కాని ఇతర ప్రాంతాలలో, ఈ నాటికి శ్మశాన ప్రవేశ అర్హత లేని స్త్రీలు ఉత్తర క్రియలు ఎలా చెయ్యగల్గుతారు.మీరు చెప్పే విదానం చూస్తే దినాలు మీరు చేసుకొండి, ఆస్తులు మాత్రం అడగొద్దు అని స్త్రీలకు సందేశం ఇస్తున్నట్టుంది. ఆస్తుల విషయంలో భారతీయ మహిళలకు పురుశులతో పాటు సమాన హక్కులు ఇచ్చెయడం యెప్పుడో జరిగింది. వాటి గురించి చింత అక్కర్లేదు. ఏమంటారు SNKR(? )గారూ?

    ReplyDelete

Post a Comment

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన